ముస్తాఫిజుర్ కు మరో బిగ్ షాక్.. !!

బంగ్లాదేశ్ స్టార్ క్రికెటర్ ముస్తాఫిజుర్ రెహ్మాన్ ను తక్షణమే జట్టు నుంచి తప్పించాలని బీసీసీఐ ఆదేశించిన తర్వాత పలు కీలక పరిణామలు చోటు చేసుకుంటోన్నాయి. టీ20 వరల్డ్ కప్ మ్యాచ్ లను ఆడటానికి భారత్ రాకూడదని ఆ దేశ క్రికెట్ బోర్డ్ నిర్ణయించింది. ఆ జట్టు ఆడాల్సిన నాలుగు మ్యాచ్ లు కూడా శ్రీలంకకు రీలొకేట్ కానున్నాయి. దీనిపై ఐసీసీ వరల్డ్ కప్ వెన్యూల్లో కొన్ని మార్పులు చేర్పులు చేస్తోంది. దీంతో పాటు తమదేశంలో ఐపీఎల్ ప్రసారాలన్నింటినీ కూడా నిలిపివేయాలని బంగ్లాదేశ్ నిర్ణయించింది.

దీని తర్వాత మరో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. కేకేఆర్ మేనేజ్మెంట్ అతన్ని అర్ధాంతరంగా విడుదల చేయడం వల్ల ఎలాంటి చెల్లింపులు దక్కే అవకాశం లేదు. బీసీసీఐ ఆదేశాలతో ఒప్పందం రద్దవడం వల్ల కేకేఆర్‌కు చట్టబద్ధంగా నష్టపరిహారం చెల్లించాల్సిన అవసరం లేదు. ఫలితంగా 2026 సీజన్ లో అతను 9.20 కోట్ల రూపాయలకు అమ్ముడుపోయినప్పటికీ.. ఒక్క రూపాయి కూడా అతను అందుకోలేడు.

Mustafizur Could Lose Rs 9 2 Crore IPL Salary With No Compensation in Sigh

అద్భతమైన పేసర్ కావడం, టీ20 ఫార్మట్ లో నిలకడగా రాణిస్తోన్న నేపథ్యంలో కిందటి నెల జరిగిన వేలం పాట సందర్భంగా ముస్తాఫిజుర్ కు భారీ డిమాండ్ ఏర్పడింది. అతని కోసం మోస్ట్ సక్సెస్ ఫుల్ టీమ్ చెన్నై సూపర్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్‌ పోటీ పడ్డాయి. ఒకదానికొకటి పోటీ పడుతూ రేటును పెంచుకుంటూ పోయాయి. దీంతో అతని ధర తొమ్మిది కోట్ల రూపాయలను దాటింది. ఈ రెండు జట్లను కూడా అధిగమించి కేకేఆర్ అతడిని రూ. 9.20 కోట్లతో కొనుగోలు చేసింది.

ఇష్టం లేకపోయినా బీసీసీఐ ఆదేశాల మేరకు ఇప్పుడు అర్ధాంతరంగా ముస్తాఫిజుర్ ను విడుదల చేయాల్సి వచ్చింది కేకేఆర్ కు. అతని స్థానంలో మరో ప్లేయర్ కోసం అన్వేషిస్తోంది. 9.20 కోట్ల రూపాయలకు అతన్ని జట్టులోకి తీసుకున్నప్పటికీ అర్ధాంతరంగా కాంట్రాక్ట్ రద్దు కావడం వల్ల అతనికి ఒక్క రూపాయి కూడా చెల్లించనక్కర్లేదు. ఇటువంటి పరిస్థితి ఎదురైనప్పుడు ప్లేయర్ ఆర్థిక ప్రయోజనాలను పరిరక్షించేలా ఒక్క నిబంధన కూడా మార్గదర్శకాల్లో లేవు.

ఆటగాళ్ల వేతనాలకు బీమా ఉంటుందని బీసీసీఐ వర్గాలు చెబుతున్నాయి. విదేశీ ప్లేయర్లు సాధారణంగా.. ఫ్రాంఛైజీలో చేరినా లేక టోర్నమెంట్ సమయంలో మ్యాచ్ ఆడుతూ గాయపడినా.. దానికి అయ్యే ఖర్చును ఫ్రాంఛైజీనే భరించాల్సి ఉంటుంది. సాధారణంగా 50 శాతం వరకు బీమా నుంచి కవర్ అవుతుంది. ముస్తాఫిజుర్ వ్యవహారం దీని పరిధిలో లేదు. అతను ఇంకా ఫ్రాంఛైజీలో చేరలేదు. అంతకుముందే జట్టును ఉద్వాసనకు గురి కావడంతో ఆర్థిక ప్రయోజనాలేవీ దక్కట్లేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+