ఫిఫాలో మెరిసిన భారతీయుడు: అడుగు పెట్టంగానే జట్టు ఘనవిజయం

భారతీయ మూలాలున్న వింగర్ నిషాన్ వేలుపిళ్లై (Nishan Velupillay) ఫిఫా వరల్డ్ కప్ అరంగేట్రం చేశాడు. భారత సంతతికి చెందిన ఓ ప్లేయర్ ఫిఫా వరల్డ్ కప్ ఆడటం ఇదే మొదటిసారి. ఆస్ట్రేలియా జట్టు తరఫున ఆడాడీ మలయాళీ. అదే మ్యాచ్ లో ఆస్ట్రేలియా ఘన విజయం సాధించడంతో అతని ఎంట్రీ మ్యాచ్ చిరకాలం గుర్తుండిపోయేలా మారింది. తుర్కియేపై ఆసీస్ 2-0 తేడాతో విజయఢంకా మోగించింది.

ఆదివారం గ్రూప్ డీలో భాగంగా జరిగిన మ్యాచ్‌లో ఆస్ట్రేలియా 2-0తో తుర్కియేను ఓడించింది. నిషాన్ వేలుపిళ్లై స్వరాష్ట్రం.. కేరళ. ఆమె తల్లి మలయాళీ. పేరు గిల్లియన్ వేలుపిళ్లై. ఆమె ఆంగ్లో ఇండియన్. తుర్కియేతో జరిగిన మ్యాచ్ లో 61వ నిమిషంలో సబ్ స్టిట్యూట్ గా ఎంట్రీ ఇచ్చాడు నిషాన్. అప్పటికే ఆస్ట్రేలియా 2-0 ఆధిక్యంలో ఉండటంతో, కోచ్ సూచనల మేరకు నిషాన్ డిఫెన్స్ పైనే ఎక్కువగా దృష్టి పెట్టాడు.

Nishan Velupillay during his historic FIFA World Cup debut

నిషాన్ ఫిఫా వరల్డ్ కప్ ప్రయాణం

నిషాన్ వేలుపిళ్లై ఆస్ట్రేలియా జట్టులోకి వచ్చిన తీరులో అనేక మలుపులు ఉన్నాయి. స్థానిక క్లబ్‌ నుంచి ఎదిగి, మెల్ బోర్న్ విక్టరీ అకాడమీలో శిక్షణ పొందాడు. 2024లో జాతీయ జట్టులో అరంగేట్రం చేశాడు. చైనాతో జరిగిన ఫిఫా వరల్డ్ కప్ క్వాలిఫయర్‌లో సబ్‌స్టిట్యూట్‌గా వచ్చిన ఏడు నిమిషాల్లోనే గోల్ చేసి, 3-1 విజయాన్ని ఖాయం చేయడంలో కీలక పాత్ర పోషించాడు. ఆ గోల్ తర్వాత నిషాన్ పై ఆస్ట్రేలియా జట్టు మేనేజ్మెంట్ కు నమ్మకం పెరిగింది. ఏకంగా ఫీఫా ఆడే జట్టులో చోటు కల్పించింది.

తాజాగా టర్కీతో జరిగని మ్యాచ్ తో మొదలుకుని ఇప్పటివరకు ఆయన ఎనిమిది అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడాడు నిసాన్. మూడు గోల్స్ నమోదు చేశాడు. ఆ మూడు గోల్స్ కూడా వరల్డ్ కప్ క్వాలిఫయర్లలో రావడం, అంతర్జాతీయ వేదికలపై ప్రభావాన్ని చూపించింది. ఈ ప్రదర్శనలే 26 మంది జట్టులో నిషాన్ కు చోటు కల్పించాయి.

మ్యాచ్‌లో కీలక మలుపులు

24 ఏళ్ల తర్వాత వరల్డ్ కప్ వేదికపైకి తిరిగొచ్చిన తుర్కియేకు ఆస్ట్రేలియా గట్టి షాక్ ఇచ్చింది. తొలి అర్ధభాగంలోనే నెష్టోవీ ఇరన్కుండా కౌంటర్ అటాక్‌లో అద్భుతంగా ముగింపు ఇచ్చి జట్టుకు ఆధిక్యం అందించాడు. 27వ నిమిషంలో బంతిని అద్భుతంగా నియంత్రించాడు. టర్కీ డిఫెండర్‌ను దాటించి మరీ గోల్ చేయడం మ్యాచ్ దిశను మార్చింది.

ఆ తరువాత టర్కీ దాడులు పెంచినా, ఆస్ట్రేలియా డిఫెన్స్ ను ఛేదించలేకపోయింది. 75వ నిమిషంలో కొనొర్ మెట్ కాఫె సుమారు 20 యార్డుల దూరం నుంచి బంతిని అందుకుని గోల్‌గా మలిచారు. ఈ రెండో గోల్‌తో టర్కీ ఆశలు అడుగంటాయి. 61వ నిమిషంలో గోల్ చేసిన ఇరన్కుండా స్థానంలో నిషాన్ వేలుపిళ్లై గ్రౌండ్ లోకి వచ్చాడు. గ్రూప్ డీ ప్రారంభ మ్యాచ్‌లో సాధించిన ఈ విజయం ఆస్ట్రేలియాకు పాయింట్ల పట్టికలో విలువైన ఊపునిచ్చింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+