రాజస్థాన్ రాయల్స్ ఆటగాడితో ముద్దుపై ప్రీతి జింటా షాకింగ్ కామెంట్స్
ఐపీఎల్ 2025 టోర్నమెంట్ నేపథ్యంలో రాజస్థాన్‌కు చెందిన 14 ఏళ్ల యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ సోషల్ మీడియాలో భారీ స్థాయిలో వైరల్ అవుతున్నాడు. ఈ టోర్నమెంట్‌లో వేగంగా సెంచరీ సాధించడమే కాకుండా, వరుసగా హాఫ్ సెంచరీలు చేసుకుంటూ తన అద్భుతమైన ఆటతీరుతో అందరినీ ఆకట్టుకుంటున్నాడు. వైభవ్ బ్యాటింగ్‌కు ప్రధాని నరేంద్ర మోడీ కూడా ఫిదా అయ్యారు, బీహార్ ముఖ్యమంత్రి కూడా భారీ నజరానా ప్రకటించారు.
This is a morphed image and fake news. Am so surprised now news channels are also using morphed images and featuring them as news items !
— Preity G Zinta (@realpreityzinta) May 20, 2025
అయితే, ఇంతటి మంచి పేరు, ప్రఖ్యాతలు సంపాదిస్తున్న వైభవ్ తాజాగా ఒక కొత్త వివాదంలో చిక్కుకున్నాడు. బాలీవుడ్ నటి, పంజాబ్ కింగ్స్ సహ-యజమాని ప్రీతి జింటా, 14 ఏళ్ల వైభవ్‌ను హగ్ చేసుకున్నట్లు ఒక ఫోటో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యింది. దీంతో ప్రీతి జింటాపై తీవ్ర ట్రోలింగ్ మొదలైంది. "50 ఏళ్లు దాటిన నీకు 14 ఏళ్ల కుర్రాడు అవసరమా?" అంటూ నెటిజన్లు ఆమెపై విరుచుకుపడ్డారు.

ఈ "హగ్" వివాదంపై పంజాబ్ కింగ్స్ యజమాని ప్రీతి జింటా నేరుగా స్పందించారు. తాను అస్సలు హగ్ ఇవ్వలేదని, అది మార్ఫింగ్ ఫోటో అని, దాన్ని సోషల్ మీడియాలో వైరల్ చేసి తనను ట్రోల్ చేస్తున్నారని ఆమె మండిపడ్డారు. తాను హగ్ ఇచ్చినట్లు చాలా వెబ్‌సైట్‌లు వార్తలు రాశాయని, వాటిని చూసి తాను షాక్ అయినట్లు వెల్లడించారు. కానీ అందులో ఏ మాత్రం వాస్తవం లేదని, తప్పుడు కథనాలు ప్రచురించకూడదని ఆమె హెచ్చరించారు. ప్రీతి జింటా స్పష్టత ఇవ్వడంతో ఈ వివాదం ఇక్కడితో ముగిసినట్టు అయింది.












Click it and Unblock the Notifications