రేసు గుర్రాన్ని పక్కన పెట్టిన ఆర్సీబీ

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 19వ సీజన్ దగ్గరికొచ్చింది. ఈ నెల 28న ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు- సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్‌ఆర్‌హెచ్) మధ్య జరుగనుంది. ఈ ఐపీఎల్ ఓపెనర్ కు బెంగళూరు ఎం చిన్నస్వామి స్టేడియం ఆతిథ్యాన్ని ఇవ్వనుంది. ప్రస్తుతం 10 జట్లు తమ సన్నాహకాల్లో నిమగ్నం అయ్యాయి. ప్లేయర్లందరూ తమ జట్లతో కలుస్తున్నారు. ముమ్మరంగా ప్రాక్టీస్ సాగిస్తోన్నారు.

ఈ పరిస్థితుల మధ్య రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫాస్ట్ బౌలర్ యష్ దయాళ్ ఈ సీజన్ కు దూరం అయ్యాడు. అతను ఆడట్లేదని ఆర్సీబీ అధికారికంగా ప్రకటించింది. అతను ఇంకా జట్టుతో చేరలేదని, ఈ సీజన్ లో అందుబాటు ఉండట్లేదని తెలిపింది. చిన్నస్వామి స్టేడియంలో జరిగిన ట్రైనింగ్ సెషన్స్ కు కూడా పాల్గొనలేదని స్పష్టం చేసింది. గత ఏడాది ఆర్‌సీబీ టైటిల్ గెలిచిన జట్టులో కీలక సభ్యుడైన దయాళ్.. ప్రస్తుతం అనేక వివాదాల సుడిగుండంలో చిక్కుకున్నాడు.

RCB Confirm Yash Dayal Will Not Join IPL Season Despite he remains under contract and stay away

ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఈ క్రికెటర్‌.. వేర్వేరు రాష్ట్రాల్లో లైంగిక వేధింపులకు సంబంధించిన ఆరోపణలను ఎదుర్కొంటోన్న విషయం తెలిసిందే. దీంతో అతన్ని ఈ సీజన్ కోసం ఆర్సీబీ పక్కన పెట్టింది. అత్యాచారం ఆరోపణలు ఎదుర్కొంటున్న దయాళ్ వ్యక్తిగత కారణాలతో ఈసారి మ్యాచ్ ఆడట్లేదని ఆర్సీబీ డైరెక్టర్ మో బోబాట్ ధృవీకరించారు. దయాళ్ కొన్ని వ్యక్తిగత సమస్యలను ఎదుర్కొంటున్నాడని, ఒప్పందం ప్రకారం జట్టులో ఉన్నప్పటికీ, ఈ సీజన్‌లో పాల్గొనట్లేదని తెలిపారు.

ఘజియాబాద్, జైపూర్ లల్లో అతనిపై లైంగిక వేధింపుల కేసులు నమోదయ్యాయి. వివాహం చేసుకుంటానని చెప్పి లైంగిక దోపిడీకి పాల్పడ్డారని దయాల్‌పై ఆరోపణలు ఉన్నాయి. తప్పుడు హామీల ఆధారంగా బాధితురాలితో సంబంధాన్ని కొనసాగించారని ఈ ఫిర్యాదులో పేర్కొన్నారు. వీటన్నింటినీ కూడా అతను తోసిపుచ్చాడు. ముందస్తు బెయిల్ కోసం చేసిన ప్రయత్నాలు కూడా విఫలం అయ్యాయి. జైపూర్‌లోని పోక్సో ప్రత్యేక కోర్టు ఈ పిటిషన్‌ను తిరస్కరించింది.

కొద్దిరోజుల కిందట యాష్ దయాళ్ కంటెంట్ క్రియేటర్ శ్వేతా పుండిర్‌ను వివాహం చేసుకున్నాడు. ఫిబ్రవరి 4న సన్నిహితులు, కుటుంబ సభ్యులు, బంధువుల పెళ్లి జరిగింది. ఈ జంట తమ వివాహం గురించి సోషల్ మీడియాలో ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. అయినప్పటికీ, శ్వేతా పుండిర్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో యశ్ దయాల్‌తో గడిపిన కొన్ని క్షణాలతో కూడిన ఒక చిన్న వీడియో రీల్‌ను పంచుకున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+