RIP Gautam Gambhir: రోహిత్ ఫ్యాన్స్ ఫైర్, కుట్రలో కోహ్లీ..!!

టీమిండియా కోచ్ గంభీర్‌పై రోహిత్ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. తాజాగా గంభీర్ కామెంట్స్ పైన సోషల్ మీడియా వేదికగా సంచలన పోస్టులతో ట్రోల్ చేస్తున్నారు. రిప్ గౌతమ్ గంభీర్ అంటూ హ్యాష్ ట్యాగ్ ట్రెండింగ్ లో ఉంది. గంభీర్, కోహ్లీ కలిసి రోహిత్ పై కుట్రలు చేస్తున్నారంటూ ఫ్యాన్స్ పోస్టింగ్స్ చేస్తున్నారు. గంభీర్ లా గతంలో ఎవరూ వ్యవహరించ లేదని మండిపడుతున్నారు. ఇటు, సిడ్నీ టెస్టు లో రోహిత్ స్వయంగా తప్పుకున్నారని కెప్టెన్ బూమ్రా వెల్లడించారు.

గంభీర్ పై ఫైర్
ఆసీస్ టూర్ లో రోహిత్ వైఫల్యం పై గంభీర్ చేసిన కామెంట్స్ హిట్ మ్యాన్ ఫ్యాన్స్ ను నచ్చలేదు. దీంతో, సోషల్ మీడియా వేదికగా ఫైర్ అవుతున్నారు. ఏకంగా రిప్ గౌతమ్ గంభీర్ అంటూ హ్యాష్ ట్యాగ్ తో ట్రెండ్ చేస్తున్నారు. రోహిత్ శర్మ టీమిండియా లో ఏం చేసారో వివరిస్తూ ఫ్యాన్స్ మద్దతు గా కామెంట్స్ పెడుతున్నారు. 2021 నుంచి టెస్టుల్లో అధిక రన్స్ చేసింది రోహిత్ శర్మ అంటూ మద్దతుగా నిలుస్తున్నారు. ఇంత అవమాన కరంగా రోహిత్ ను తప్పిస్తారా అంటూ నిలదీస్తున్నారు.
గంభీర్ బాధ్యతలు తీసుకున్నాకే టీమ్ ఇండియాకు వరుస పరాజయాలు ఎదురవుతున్నాయంటూ టార్గెట్ చేస్తున్నారు.

RIP Gautam Gambhir is trending all over social media Fans supports Rohit

కోహ్లీ టార్గెట్ అయ్యారా
సోషల్ మీడియాలో ప్రస్తుతం గౌతమ్ గంభీర్ టార్గెట్ గా చేస్తున్న పోస్టింగ్స్ వైరల్ అవుతున్నాయి. తాజాగా నాలుగో టెస్టులో టీమిండియా ఓటమి తరువాత డ్రెస్సింగ్ రూమ్ లో కోల్డ్ వార్ మొదలు అయింది. కోచ్ గంభీర్ కెప్టెన్ రోహిత్ తో పాటుగా కోహ్లీ, పంత్ పైన మండిపడినట్లు వార్తలు వైరల్ అయ్యాయి. దీని పైన గంభీర్ స్పందిస్తూ..తాను ఎవరి పైనా ఆగ్రహం వ్యక్తం చేయలేదని వివరణ ఇచ్చారు. ఆటలో గెలుపు, ఓటమలు సహజం అంటూ చెప్పుకొచ్చారు. ఇక, ఈ చివరి మ్యాచ్ తరువాత రోహిత్ తన రిటైర్మెంట్ ప్రకటిస్తారనే అంచనాలు ఉన్నాయి. ఈ సమయంలోనే సిడ్నీ లో ఈ రోజు ప్రారంభమైన టెస్టు నుంచి రోహిత్ తప్పుకున్నారు. తనంతటగా తానే తప్పుకున్నట్లు కెప్టెన్ బాధ్యతలు స్వీకరించిన బూమ్రా టాస్ సమయంలో వెల్లడించారు.

సిడ్నీ టెస్టులో

కొందరు ఫ్యాన్స్ కోహ్లీని వివాదంలోకి లాగారు. గంభీర్, కోహ్లీ కలిసే రోహిత్ పైన కుట్రలు చేస్తున్నా రంటూ పోస్టింగ్స్ చేస్తున్నారు. ఇక, సిడ్నీ టెస్టులో టాస్ గెలిచిన బూమ్రా బ్యాటింగ్ ఎంచుకోగా.. ఓపెనర్లు తొలి దశలోనే పెవిలియన్ బాట పట్టారు. కోహ్లీ, గిల్ కుదురుకుంటున్న కనిపించగా, గిల్ స్లిప్ లో క్యాచ్ ఇచ్చి అవుటయ్యారు. లంచ్ తరువాత కొద్ది సేపటికే కోహ్లీ 17 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. క్రీజులో పంత్ 32, జడేజా 11 పరుగులతో ఆడుతున్నారు. టీ బ్రేక్ సమయానికి టీం ఇండియా నాలుగు వికెట్లు నష్టపోయి 107 పరుగులు చేసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+