మీకు దండం పెడతాం.. ఇక రిటైర్మెంట్ ప్రకటించండి..!
సుదీర్ఘ విరామం తర్వాత అంతర్జాతీయ వన్డే క్రికెట్‌లోకి తిరిగొచ్చిన భారత దిగ్గజ బ్యాటర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ తొలి మ్యాచ్‌లోనే ఘోరంగా విఫలం కావడంపై క్రికెట్ అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆస్ట్రేలియాతో పెర్త్‌లోని ఆప్టస్ స్టేడియంలో జరిగిన మొదటి వన్డేలో వీరిద్దరూ తక్కువ స్కోరుకే పెవిలియన్‌కు చేరారు. ఈ వైఫల్యం సోషల్ మీడియాలో భారీ చర్చకు దారి తీయగా, కొందరు అభిమానులు ఏకంగా రిటైర్మెంట్ ప్రకటించండంటూ డిమాండ్ చేస్తున్నారు.
🚨 Adam Gilchrist - They say Rohit Sharma is a match-winner. They just never said for which side. (Laughs)
— zoxxy (@PrimeKohli) October 19, 2025
He is cooking him silently. 🤣🤣🤣pic.twitter.com/A5yhBOCFV1
ఆస్ట్రేలియా కెప్టెన్ మిచెల్ మార్ష్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకోవడంతో, ఫాస్ట్ బౌలింగ్‌కు అనుకూలించే పెర్త్ పిచ్‌పై భారత్ బ్యాటింగ్‌కు దిగింది. ఏడు నెలల విరామం తర్వాత వన్డే జట్టులోకి వచ్చిన రోహిత్ శర్మకు ఇది 500వ అంతర్జాతీయ మ్యాచ్ కావడం విశేషం. అయితే, ఈ ప్రత్యేక సందర్భంలో రోహిత్ కేవలం 8 పరుగులు మాత్రమే చేసి నిరాశపరిచాడు. జోష్ హేజిల్‌వుడ్ అదనపు బౌన్స్‌తో వేసిన బంతిని డిఫెండ్ చేయబోయి, బ్యాట్ అంచుకు తగిలించి క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు.

రోహిత్ తర్వాత మూడో స్థానంలో వచ్చిన కింగ్ కోహ్లీ పరిస్థితి మరింత దారుణంగా ఉంది. అభిమానులు ఎంతో ఆశగా ఎదురుచూసిన కోహ్లీ, ఆసీస్ పేసర్ల ధాటికి తట్టుకోలేక కేవలం 8 బంతులు ఎదుర్కొని సున్నా (డకౌట్) పరుగులకే వెనుదిరిగాడు. ఆసీస్ పేసర్ల పదునైన దాడి ముందు భారత్ 6.1 ఓవర్లలోనే 21 పరుగులకు రెండు కీలక వికెట్లు కోల్పోయింది. ఆ తర్వాత వెంటనే శుభ్‌మన్ గిల్ కూడా ఔటవ్వడంతో, టాప్ ఆర్డర్ కూలిపోయింది.
Kehe do ki ye jutt hai 🥹🙏🏻#ViratKohli #RohitSharma #IndianCricket #AUSvIND pic.twitter.com/osN9rVypJB
— Maltiशर्मा (@maltiSharmaa) October 19, 2025
సుదీర్ఘ విశ్రాంతి తీసుకున్న తర్వాత కూడా ఈ ఇద్దరు దిగ్గజాలు ఇలాంటి కీలక మ్యాచ్‌లో విఫలం కావడంపై నెటిజన్లు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇంత కాలం ఆటకు దూరంగా ఉండి, తిరిగి వచ్చినా ఫామ్ కోల్పోతే ఎలా అంటూ ప్రశ్నిస్తున్నారు.ఇక మీరు రిటైర్మెంట్ ప్రకటించి యువ ఆటగాళ్లకు అవకాశం ఇవ్వాలని కొందరు ఘాటుగా విమర్శిస్తున్నారు.
కేవలం కొద్ది ఓవర్లలోనే రోహిత్, కోహ్లీ, గిల్ వికెట్లు కోల్పోయి భారత్ పీకల్లోతు కష్టాల్లో పడటం, ఆ తర్వాత వర్షం కారణంగా మ్యాచ్ ఆగిపోవడం అభిమానులకు మరింత ఆగ్రహం తెప్పించింది. ప్రపంచ క్రికెట్‌లో అత్యుత్తమ బ్యాటర్లుగా పేరుగాంచిన ఈ ఇద్దరు ఆటగాళ్ల వైఫల్యంపై అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.












Click it and Unblock the Notifications