రోహిత్ శర్మ అడుగు పెడితే జట్టుకు ఓటమే..!
రోహిత్ శర్మ, భారతీయ క్రికెట్ జట్టుకు ఒక అమూల్యమైన ఆస్తి. తన అద్భుతమైన బ్యాటింగ్‌తో ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న రోహిత్ శర్మ, భారతీయ క్రికెట్‌లో ఒక కొత్త అధ్యాయానికి నాంది పలికాడు. మూడు ఫార్మాట్లలోనూ భారత జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించి, జట్టును అనేక విజయాలకు నడిపించాడు. వన్డేల్లో రెండు డబుల్ సెంచరీలు చేసిన ఏకైక బ్యాట్స్‌మన్‌గా రికార్డు సృష్టించాడు.ముంబై ఇండియన్స్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరిస్తూ అనేక ఐపీఎల్ టైటిల్స్‌ను గెలుచుకున్నాడు. 2013 ఛాంపియన్స్ ట్రోఫీ మరియు 2016 టీ20 ప్రపంచకప్‌లలో భారత జట్టును విజయం వైపు నడిపించాడు. ఇక గతేడాది జరిగిన టీ20 ప్రపంచ కప్ గెలిచి చరిత్ర సృష్టించాడు.
అయితే రోహిత్ శర్మపై తీవ్రంగా ట్రోల్స్ నడుస్తున్నాయి. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో భారత జట్టు ఐదు టెస్ట్ మ్యాచులను ఆడుతోంది. పెర్త్ వేదికగా జరిగిన మొదటి టెస్ట్ మ్యాచ్‌కు రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ దూరం కావడంతో, స్టార్ బౌలర్ బుమ్రా జట్టుకు నాయకత్వం వహించాడు. మొదటిసారే కెప్టెన్సీ చెప్పట్టినప్పటికీ , కెప్టెన్‌గా జట్టుకు విజయాన్ని అందించాడు.రోహిత్ శర్మ తిరిగి జట్టులో చేరడంతో రెండో టెస్ట్ మ్యాచ్‌కు నాయకత్వం వహించాడు.

అయితే రెండో టెస్ట్ మ్యాచ్‌లో భారత జట్టు 10 వికెట్ల తేడాతో ఓడిపోయింది. ఆస్ట్రేలియా సిరీస్ సందర్భంగా రోహిత్ ఎప్పుడు టీమిండియా కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టినా ఓటమిని చవిచూడాల్సి వస్తుంది.సిరీస్ మధ్యలో రోహిత్ కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టినప్పుడల్లా భారత జట్టుపై ఆస్ట్రేలియా ఆధిపత్యం కనబరుస్తోంది.ఇలా జరగడ మొదటిసారి కాదు. రోహిత్ శర్మ ఇప్పటివరకు మూడుసార్లు ఆస్ట్రేలియాతో మధ్య సిరీస్‌కు కెప్టెన్‌గా వ్యవహరించాడు. ఈ కాలంలో అతను ఓటమిని మాత్రమే ఎదుర్కోవలసి వచ్చింది. దీంతో రోహిత్ శర్మ వస్తే చాలు జట్టు ఓడిపోతుందనే అభిప్రాయం క్రికెట్ అభిమానుల్లో బలంగా నాటుకుపోయింది.












Click it and Unblock the Notifications