రోహిత్ శర్మను తప్పించి ముంబై ఇండియన్స్ మంచి పని చేసిందా?
Rohit Sharma: ఈ ఏడాది ఐసీసీ టీ20 వరల్డ్ కప్ జరుగనున్న నేపథ్యంలో- ఈ ఫార్మట్‌లో భారత జట్టు ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తోంది. టీ20 మ్యాచ్‌లపై పట్టు సాధించింది. భారత పర్యటనకు వచ్చిన ఆఫ్ఘనిస్తాన్‌ను తొలి రెండు టీ20ల్లో పరాజయాన్ని చవి చూపించింది. ఇక మూడో మ్యాచ్ ఈ నెల 17వ తేదీన బెంగళూరులో జరుగనుంది.
గత ఏడాది ఐసీసీ ప్రపంచకప్ ముగిసిన తరువాత కొంతకాలం పాటు విశ్రాంతి తీసుకున్న టీమిండియా కేప్టెన్ రోహిత్ శర్మ.. మళ్లీ జట్టుకు అందుబాటులోకి వచ్చాడు. ప్రపంచకప్ 2023 ముగిసిన తరువాత ఆస్ట్రేలియాతో జరిగిన అయిదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో ఆడలేదు. దానికి సూర్యకుమార్ యాదవ్ కేప్టెన్‌గా వ్యవహరించాడు.

అనంతరం దక్షిణాఫ్రికా పర్యటనలో టీ20, వన్డే ఇంటర్నేషనల్స్ సిరీస్‌లో రోహిత్ ఆడలేదు. రెండు టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్‌కు అందుబాటులో వచ్చాడు. అప్పటి నుంచి కంటిన్యూ అవుతున్నాడు. కేప్టెన్సీ బాధ్యతలను తిరిగి అందుకున్నాడు. రోహిత్ కేప్టెన్సీలో దక్షిణాఫ్రికాపై టెస్ట్ సిరీస్‌ను సమం చేసుకుంది టీమిండియా.
ఆఫ్ఘనిస్తాన్‌పైనా తన దండయాత్రను కొనసాగిస్తోంది. తొలి రెండు టీ20 మ్యాచ్‌లను చేజిక్కించుకుంది. అంతా బాగానే ఉన్నప్పటికీ- ఓ బ్యాటర్‌గా రోహిత్ శర్మ దారుణంగా విఫలమౌతోండటం ఆందోళనను కలగిస్తోంది. దక్షిణాఫ్రికాపై టెస్ట్ సిరీస్‌లో భారీ స్కోర్ చేయలేకపోయాడు హిట్ మ్యాన్.
ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్‌పై మరింత అధ్వాన్న ఆటతీరును ప్రదర్శిస్తోన్నాడు. ఆఫ్ఘన్ బౌలర్లను ఎదుర్కొనడంలో తడబడుతున్నాడు. తొలి రెండు టీ20ల్లోనూ డకౌట్ కావడం.. అతని ఫామ్ లేమికి అద్దం పడుతోంది. తొలి మ్యాచ్‌లో రెండో బంతికి లేజీగా పరుగు తీస్తూ.. రనౌట్ అయ్యాడు. రెండో మ్యాచ్‌లో గోల్డెన్ డక్. ఎదుర్కొన్న తొలి బంతికే క్లీన్ బౌల్డ్ అయ్యాడు.
ఈ పరిణామాలు అతనిపై విమర్శలకు తెర తీసినట్టయింది. టీ20ల్లో రోహిత్ శర్మ సత్తా అయిపోయిందంటూ వెల్లువెత్తుతోన్న విమర్శలకు మరింత బలాన్ని ఇచ్చినట్టయింది. అతను విఫలమౌతాడని ముందుగా గ్రహించడం వల్లే ముంబై ఇండియన్స్.. కేప్టెన్సీ బాధ్యతలను తప్పించిందనే అభిప్రాయాలు ఉన్నాయి.












Click it and Unblock the Notifications