నీ దుంప తెంచేసే వాళ్లు భయ్యా- జస్ట్ మిస్

Rohit Sharma: ఐపీఎల్ 2025లో ఎట్టకేలకు బోణీ కొట్టింది ముంబై ఇండియన్స్. కోల్‌కత నైట్ రైడర్స్‌ ఘన విజయం సాధించింది. ఈ గెలుపుతో ఆ జట్టు వరుస ఓటములకు పుల్ స్టాప్ పడింది. మ్యాచ్ ముందు వరకూ పాయింట్ల పట్టికలో అట్టడుగున.. అంటే పదో స్థానంలో ఉన్న ముంబై ఇండియన్స్ ఒక్కసారిగా ఆరోస్థానానికి ఎగబాకింది.

సోమవారం రాత్రి వాంఖెడే స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌కు దిగింది కోల్‌కత నైట్ రైడర్స్. అధ్వాన్నపు ఆటతీరును ప్రదర్శించింది. ముంబై ఇండియన్స్ బౌలర్ల పరాక్రమం ముందు తలవంచింది. వరుసగా వికెట్లను కోల్పోయింది. నిర్ణీత 20 ఓవర్లల్లో 116 పరుగులకు కుప్పకూలింది.

Rohit Sharma fails again to score against Kolkata Knight Riders in IPL 2025

కోల్‌కత నైట్ రైడర్స్ ఇన్నింగ్‌లో 26 పరుగులు చేసిన అంగ్‌క్రిష్ రఘువంశీ ఒక్కడే టాప్ స్కోరర్ అంటే ఆ జట్టు బ్యాటర్లు ఎంత చెత్తగా ఆడారో అర్థం చేసుకోవచ్చు. క్వింటన్ డికాక్- 1, సునీల్ నరైన్- 0, అజింక్య రహానె- 11, వెంకటేష్ అయ్యర్- 3, రింకూ సింగ్- 17, మనీష్ పాండే- 19, ఆండ్రీ రస్సెల్- 5, రమణ్ దీప్ సింగ్- 22, హర్షిత్ రాణా- 4, స్పెన్సర్ జాన్సన్- 1 పరుగు చేశారు.

అనంతరం బ్యాటింగ్‌కు దిగిన ముంబై ఇండియన్స్.. ఈ మ్యాచ్‌ను ఏకపక్షంగా మార్చివేసింది. 12.5 ఓవర్లల్లో 121 పరుగులు చేసింది. ఈ క్రమంలో రెండు వికెట్లను మాత్రమే కోల్పోయింది. ఫామ్‌లో లేని ఓపెనర్ రోహిత్ శర్మ 13, విల్ జాక్స్- 16 పరుగులకే అవుట్ అయ్యారు. మరో ఓపెనర్ రియాన్ రికెల్టన్ 62, సూర్యకుమార్ యాదవ్ 9 బంతుల్లో 27 పరుగులతో అదరగొట్టారు.

ఈ మ్యాచ్‌లో నాలుగు వికెట్లతో చెలరేగాడు డెబ్యూట్ బౌలర్ అశ్విని కుమార్. మూడు ఓవర్లల్లో 24 పరుగులు ఇచ్చి అజింక్య రహానె, రింకూ సింగ్, మనీష్ పాండే, ఆండ్రీ రస్సెల్ వికెట్లను నేలకూల్చాడు. ఇదే అతనికి తొలి ఐపీఎల్ సీజన్.. తొలి మ్యాచ్ కూడా. అరంగేట్రంలోనే నాలుగు వికెట్లు పడగొట్టి చరిత్ర సృష్టించాడు.

ఈ మ్యాచ్‌లో కూడా రోహిత్ శర్మ విఫలం కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. తక్కువ స్కోరే ఉన్నప్పటికీ కుదురుగా ఆడలేకపోయాడు. ఇన్నింగ్ మొత్తం మీద 12 బంతులను మాత్రమే ఎదుర్కొన్నాడు. 13 పరుగులు మాత్రమే చేయగలిగాడు. ఇందులో నమోదైంది ఒకే ఒక్క సిక్సర్.

వికెట్లకు కాస్త దూరంగా ఆండ్రీ రస్సెల్ వేసిన ఫ్లాట్ బ్యాట్‌లో షాట్ ఆడాడు రోహిత్. బ్యాట్ ఎడ్జ్ తీసుకుని గాల్లోకి ఎగిరిన బంతిని మిడాఫ్‌లో సులువగా అందుకున్నాడు హర్షిత్ రాణా. 46 పరుగుల వద్ద రోహిత్ శర్మ రూపంలో తొలి వికెట్ కోల్పోయింది ముంబై ఇండియన్స్. ఛేదించాల్సిన స్కోర్ భారీగా లేకపోయినప్పటికీ- కుదురుగా ఆడివుంటే కనీసం అతని బ్యాటింగ్ ట్రాక్‌లో పడి ఉండేది.

ఈ సీజన్‌లో రోహిత్ శర్మ ఇప్పటివరకు చేసిన పరుగులు 21. చెన్నై సూపర్ కింగ్స్‌పై చెపాక్ స్టేడియంలో జరిగిన తొలి మ్యాచ్‌లో డకౌట్ అయ్యాడు. రెండో మ్యాచ్‌లో ఎనిమిది పరుగులకే వెనుదిరిగాడు. ఇప్పుడు 13 పరుగులకే అవుట్ అయ్యాడు. ఒత్తిడి వల్లే అతను స్వేచ్ఛగా ఆడలేకపోతున్నాడనే అంచనాలు ఉన్నాయి.

ముంబై ఇండియన్స్ టీమ్ గెలిచింది కాబట్టి అతని ఫెయిల్యూర్‌ను ఎవరూ పట్టించుకోవట్లేదు గానీ అదే ఓడిపోయుంటే పరిస్థితి మరోలా ఉండేది. సోషల్ మీడియాలో అతనిపై ఘోరంగా ట్రోల్స్ పడేవి. ఈ వరుస వైఫల్యాలకు ఓ భారీ ఇన్నింగ్‌తో చెక్ పెట్టాలని కోరుకుంటోన్నారు అభిమానులు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+