పీక్ ఫామ్- ఫైనల్ షోడౌన్: కొదమ సింహాల పోరు

ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో అత్యంత కీలక మ్యాచ్‌ నేడు జరుగనుంది. ఈ సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు తమ చివరి లీగ్ మ్యాచ్‌ను ఆడబోతోన్నాయి. పాయింట్ల పట్టికలో తొలి, మూడో స్థానంలో ఈ జట్లు పరస్పరం తలపడనున్నాయి. హైదరాబాద్‌ ఉప్పల్ స్టేడియం దీనికి వేదిక. ఈ సాయంత్రం 7:30 గంటలకు మ్యాచ్ జరుగనుంది. ఇప్పటికే ప్లేఆఫ్స్‌లో తమ స్థానాన్ని పదిలం చేసుకున్నాయి.. ఈ రెండు జట్లు కూడా.

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు డిఫెండింగ్ ఛాంపియన్ తరహాలో అదరగొడుతోంది. ఇప్పటికే ప్లేఆఫ్స్‌కు అర్హత పొందింది. ఈ సీజన్ అంతటా అద్భుతమైన ఫామ్‌లో ఉన్న ఆర్సీబీ.. హైదరాబాద్‌లోనూ అదే జోరు కొనసాగించాలని చూస్తోంది. ఆర్సీబీతో సమానంగా తడాఖా చూపుతూ వస్తోంది సన్ రైజర్స్. ఇప్పటివరకు ఆడిన 14 మ్యాచ్ లల్లో ఎనిమిదింట్లో నెగ్గింది. 16 పాయింట్లతో పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో నిలిచింది. ఇందులో మెరుగైన రన్ రేట్ తో గెలిస్తే.. తన పొజీషన్ ను మార్చుకునే అవకాశం ఉంది.

SRH vs RCB Final League Clash Headed for Today Showdown End the Group Stage Strong Vie for Momentum

ఉప్పల్ స్టేడియం బ్యాటింగ్‌కు అనుకూలమైన పిచ్‌. గత కొన్ని సీజన్లుగా బ్యాటర్లకు స్వర్గధామంగా మారింది. ఇక్కడ పరుగుల వరద పారించడం సులువు. పేస్, బౌన్స్‌ను సద్వినియోగం చేసుకొని షార్ట్ లెంగ్త్ బంతులేసిన ఫాస్ట్ బౌలర్లకు కుడా పిచ్ సహకరిస్తుంది. ఇక్కడ ఛేజింగ్ చేసిన జట్టుకు అధిక విజయావకాశాలు ఉన్నాయి. బ్యాటింగ్, బౌలింగ్ లో ఈ రెండు జట్లు కూడా సమవుజ్జీలే. అదరగొట్టే బ్యాటర్లు, అద్భుతమైన బౌలర్లు, అదే స్థాయిలో ఆల్ రౌండర్లు ఉన్నారు.

అభిషేక్ శర్మ.. అత్యంత ప్రమాదకరమైన హిట్టర్‌గా నిరూపించుకున్నాడు. ఈ సీజన్ లో 13 ఇన్నింగ్స్‌లలో 507 పరుగులు సాధించాడు. ఇందులో ఓ సెంచరీ, మూడు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. హెన్రిక్ క్లాసెన్ మరో డేంజరస్ బ్యాటర్. ఈ సీజన్ మొత్తానికీ అత్యంత నిలకడగా రాణిస్తోన్నాడు. అతను లో స్కోర్ చేసిన మ్యాచ్ చాలా పరిమితం. ఇప్పటివరకు 13 మ్యాచ్ లు ఆడిన క్లాసెన్.. 555 పరుగులు చేశాడు. ఇందులో అయిదు హాఫ్ సెంచరీలు ఉన్నాయి.

ఫిల్ సాల్ట్, విరాట్ కోహ్లీ, వెంకటేష్ అయ్యర్, రజత్ పటిదార్, టిమ్ డేవిడ్, రొమారియో షెప్పర్డ్, దేవ్ దత్ పడిక్కల్, జాకబ్ బేథెల్ వంటి ప్రమాదకరమైన బ్యాటర్లతో తొణికిసలాడుతోంది ఆర్సీబీ. ఇక భువనేశ్వర్ కుమార్ గురించి చెప్పనక్కర్లేదు. ఈ మ్యాచ్‌లో కూడా అతను వికెట్ జాతర చేసుకోవచ్చు. ప్రస్తుతం అతను పీక్ ఫామ్‌లో ఉన్నాడు. 16.37 సగటుతో 24 వికెట్లు తీసి పర్పుల్ క్యాప్‌ను సొంతం చేసుకున్నాడు. పిచ్ పరిస్థితి, గత రికార్డులను బట్టి చూస్తే, ఛేజింగ్ చేసే జట్టు ఈ మ్యాచ్‌లో విజయం సాధించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

సన్‌రైజర్స్ హైదరాబాద్ తుదిజట్టులో: అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), హెన్రిచ్ క్లాసెన్, సలీల్ అరోరా, స్మరణ్ రవిచంద్రన్, నితీష్ కుమార్ రెడ్డి, పాట్ కమిన్స్ (కెప్టెన్), శివాంగ్ కుమార్, ఈషన్ మలింగా, సాకిబ్ హుస్సేన్, ప్రఫుల్ హింగే బరిలో దిగే అవకాశం ఉంది. ట్రావిస్ హెడ్ ఇంపాక్ట్ ప్లేయర్‌గా ఉండవచ్చు.

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరులో వెంకటేష్ అయ్యర్, విరాట్ కోహ్లీ, దేవదత్ పడికల్, రజత్ పాటిదార్ (కెప్టెన్), జితేష్ శర్మ (వికెట్ కీపర్), టిమ్ డేవిడ్, రొమారియో షెపర్డ్, కృనాల్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, జోష్ హేజిల్‌వుడ్, సుయాష్ శర్మ ఆడే అవకాశం ఉంది. జాకబ్ డఫ్ఫీ ఇంపాక్ట్ ప్లేయర్‌గా వ్యవహరించవచ్చు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+