SRH: సన్ రైజర్స్ హైదరాబాద్ రిటైన్ చేసుకున్న ఆటగాళ్లు వీరే..!
ఐపీఎల్ 2025 కోసం రిటెన్షన్ ప్రక్రియ కొనసాగుతోంది. తాజాగా సన్ రైజర్స్ హైదరాబాద్ తమ రిటైన్ అటగాళ్లు జాబితాను అధికారికంగా విడుదల చేసింది. సన్‌రైజర్స్ తమ కెప్టెన్, ఆస్ట్రేలియా ఆటగాడు పాట్ కమిన్స్, ట్రావిస్ హెడ్, దక్షిణాఫ్రికా వికెట్ కీపర్ బ్యాటర్ హెన్రిచ్ క్లాసెన్ తో పాటు ఇద్దరు భారత స్టార్లు అభిషేక్ శర్మ, నితీష్ కుమార్ రెడ్డిలను రిటైన్ చేసుకుంది. వికెట్ కీపర్ కామ్ బ్యాటర్ క్లాసెన్‌ను తొలి ఆప్షన్‌గా తీసుకొని అతనికి రూ. 23 కోట్లు ఇచ్చింది. కమిన్స్‌కు 18 కోట్లు, అభిషేక్ 14 కోట్లు, హెడ్‌కు 14 కోట్లు యంగ్‌స్టర్ నితీశ్‌ను రూ. 6 కోట్లతో రిటైన్ చేసుకుంది.
ఈ ఐదుగురి కోసం రూ.75 కోట్లు ఖర్చు చేసిన సన్ రైజర్స్ హైదరాబాద్ కేవలం 45 కోట్లతోనే వేలంలో పాల్గొననుంది. గత రెండు సీజన్లలో క్లాసన్ రాణించాడు.
జట్టులో మిగిలిన ఆటగాళ్లు విఫలమైనా ఒక్కడే వారియర్ లా పోరాటం చేశాడు. అందుకే ఈ సఫారీ ఆటగాడికి సన్ రైజర్స్ హైదరాబాద్ ప్రాముఖ్యత ఇచ్చింది. హెడ్, అభిషేఖ్ శర్మ కూడా అంచనాలకు మించి రాణించారు. పంజాబ్ కింగ్స్ రిటైన్ చేసుకున్న జాబితాను గురువారం ప్రకటించింది. కింగ్స్ తమ రిటైన్డ్ ప్లేయర్‌లుగా ప్రభసిమ్రాన్ సింగ్ మరియు శశాంక్ సింగ్‌లను ఎంచుకుంది.

"ప్రభ్‌సిమ్రాన్ మనం పెట్టుబడి పెట్టి, గొప్ప ఆశలు పెట్టుకున్న వ్యక్తి. శశాంక్ నైపుణ్యానికి చాలా డిమాండ్ ఉంది. అతని అద్భుతమైన ప్రదర్శనల తర్వాత, అతనిని విస్మరించడం కష్టం. మేము కొందరిని తిరిగి తీసుకురావడమే లక్ష్యంగా పెట్టుకుంటాము. వేలంలో ఉన్న మా ఇతర ఆటగాళ్లు కూడా." అని ప్రధాన కోచ్ రికీ పాంటింగ్ చెప్పారు. ఐపీఎల్ 2024లో పంజాబ్ కింగ్స్ తరఫున 14 మ్యాచ్‌లలో 354 పరుగులు చేసిన శశాంక్, 164.65 స్ట్రైక్ రేట్‌తో బ్యాటింగ్ చేశాడు. "మళ్ళీ నాపై విశ్వాసం చూపినందుకు జట్టుకు కృతజ్ఞతలు. నేను పని చేయడానికి ఎదురుచూస్తున్నాను " అని శశాంక్ అన్నారు.
"నేను ఎప్పటినుంచో పంజాబ్ కింగ్స్‌కు ఆడాలని, నాపై వారి నమ్మకాన్ని తిరిగి నిలబెట్టుకోవాలని కోరుకుంటున్నాను. లెజెండరీ రికీ పాంటింగ్ నాయకత్వంలో, నేను ఆటగాడిగా ఎదగాలని, జట్టుకు సహాయం చేయాలని ఆశిస్తున్నాను" అని ప్రభాస్‌సిమ్రాన్ చెప్పారు.












Click it and Unblock the Notifications