పాక్ తో మ్యాచ్ వేళ అభిషేక్ రీ ఎంట్రీ పై బిగ్ అప్డేట్, తుది జట్టులో మార్పులు..!!
T20 World Cup 2026 Ind Vs Pak: ప్రపంచ కప్ లో అసలైన సమరానికి కౌంట్ డౌన్ మొదలైంది. దాయాది టీంలు నువ్వా నేనా అన్నట్లు పోటీకి సిద్దమయ్యారు. చివరి వరకు బెట్టు పోయిన పాక్ ఎట్టకేలకు దిగొచ్చింది. భారత్ -పాక్ మధ్య కొలంబో ప్రేమదాస స్టేడియం వేదికగా జరిగే టీ20 ప్రపంచ కప్ మ్యాచ్ పైన ఫ్యాన్స్ లో భారీ అంచనాలు ఉన్నాయి. అయితే, ఈ సారి పాక్ తో మ్యాచ్ ను టీమిండియా మరింత సీరియస్ గా తీసుకుంది. కొన్ని మార్పులకు సిద్దం అవుతోంది. డాషింగ్ ఓపెనర్ అభిషేక్ శర్మ రీ ఎంట్రీ పైన బిగ్ అప్డేట్ అందుతోంది.
టీ20 ప్రపంచ కప్ లో సిసలైన సమరం కోసం ఫ్యాన్స్ వేచి చూస్తున్నారు. భారత్ - పాక్ మ్యాచ్ పైన భారీ అంచనాలు ఉన్నాయి. కొలొంబోలోని ప్రేమదాస స్టేడియం బ్యాటింగ్ కు అనుకూలం గా చెబుతున్నారు. దీంతో... తుది జట్టులో టీమిండియా కీలక మార్పులకు సిద్దం అవుతోంది. నమీబియా మ్యాచ్ లో ఓపెనింగ్ జోడీ వీర విహారం చేసింది. పాక్ పైన ఇషాన్ అదే దూకుడు కొన సాగించే అవకాశం ఉంది. అయితే, అనారోగ్యంతో నమీబియా మ్యాచ్ కు దూరమైన అభిషేక్ శర్మ ఆరోగ్యం పైన మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి బిగ్ అప్టేడ్ ఇచ్చారు. కడుపులో సమస్య కారణంగా నమీబియా మ్యాచ్ కు దూరమైన ఈ యువ హిట్టర్, పాక్ మ్యాచ్‌లో కనిపిస్తాడా లేదా అన్నదానిపై వరుణ చెప్పిన విషయాలతో సస్పెన్స్ కు తెర పడింది.

పాక్ తో మ్యాచ్ వేళ కొత్త వ్యూహాలతో
అభిషేక్ శర్మ ఆరోగ్యంపై వరుణ్ చక్రవర్తి గుడ్ న్యూస్ చెప్పాడు. అమెరికాతో మ్యాచ్ తర్వాత అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన అభిషేక్, ఇప్పుడు డిశ్చార్జ్ అయి జట్టుతోనే ఉన్నాడు. నమీబియాతో మ్యాచ్ ను స్టేడియంలోనే తిలకించాడు. కాగా.. అభిషేక్ మళ్లీ ప్రాక్టీస్ మొదలు పెట్టాడని.. తాను అతనితో మాట్లాడానని వరుణ్ చెప్పారు. అభిషేక్ చాలా ఉత్సాహంగా ఉన్నాడని చెప్పిన వరుణ్.. పాకిస్థాన్‌తో జరిగే తర్వాతి మ్యాచ్‌లో అతను ఆడే అవకాశం ఉందని వెల్లడించారు. దీంతో.. భారత్ ఫ్యాన్స్ కు మరింత మజా ఖాయంగా కనిపిస్తోంది.
నమీబియాతో మ్యాచ్ జరుగుతున్నప్పుడు అభిషేక్ డగౌట్‌లో కూర్చుని జట్టును ఉత్సాహపరచిన సీన్ టీవీల్లో కనిపించింది. అయితే, కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ వ్యాఖ్యలు కాస్త భిన్నంగా ఉన్నాయి. అభిషేక్ శర్మ కోలుకోవడానికి మరో ఒకటి లేదా రెండు మ్యాచ్‌లు పట్టవచ్చని హింట్ ఇచ్చాడు. కాగా.. అభిషేక్ శర్మ లేకపోయినా టీమిండియా పటిష్టంగానే ఉన్నప్పటికీ, అతని రాక జట్టులో మరింత జోష్ నింపుతుంది. దీంతో.. పాక్ తో జరిగే ఉత్కంఠ పోరులో అభిషేక్ రీ ఎంట్రీ పైన రేపు (శనివారం) స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
-
అన్నా - చెల్లి కాస్తా.. భార్యాభర్తలు అయ్యారుగా ??? -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
IPL 2026: కొంపముంచిన బుడ్డోడు.. రాజస్థాన్‌ను చిత్తు చేసిన SRH! -
రాజ్యసభకు టీడీపీ, బీజేపీ నుంచి ఊహించని అభ్యర్దులు- జనసేన నుంచి ఆయనే..!! -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా.. -
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
నిర్మాతలకు స్టార్ హీరోయిన్ బంపరాఫర్! -
10th Class Results అప్పుడే..! పది ఫలితాలపై కీలక ప్రకటన -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
రేషన్ సరఫరా లో కీలక మార్పులు, తాజా మార్గదర్శకాలు..!! -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000












Click it and Unblock the Notifications