భారత్ ను ఛాంపియన్ గా నిలబెట్టిన ఒకే ఒక్కడు, ఆయన మాటే శాసనం..!!
టీం ఇండియా. క్రికెట్ ప్రపంచాన్ని శాసిస్తున్న జట్టు. టీం ఇండియా గతం.. వర్తమానం గమనిస్తే అనూహ్య మార్పు. యువ కెరటాలతో క్రికెట్ లో టీం ఇండియా సునామీల మారింది. వరుస విజయాలతో ఛాంపియన్ గా అవతరించింది. కొత్త రికార్డులు నెలకొల్పుతోంది. అయితే, గతానికి.. ఇప్పటికీ ఆ తేడా వెనుక కారణం ఏంటి. నిర్ణయాల్లో ఆ మార్పు ఎలా వచ్చింది. తెరు వెనుక ఆ వ్యహ కర్త ఎవరు. ప్రస్తుతం క్రికెట్ ప్రపంచానికి ఆయన మాటే శాసనం.
క్రికెట్ లో ఏ ఫార్మాట్ అయినా.. పురుషులు - మహిళల టీం ఏదైనా.. ఛాంపియన్ టీం ఇండియా.
గతం లో టీం ఇండియా అనేక ఆటు పోట్లు చవి చూసింది. ఇప్పుడు గెలుపే లక్ష్యంగా ఆడుతోంది. వరుసగా ప్రపంచ ఛాంపియన్లుగా నిలిచింది. టీ20 ప్రపంచ కప్ 2026 గా గెలిచిన భారత్ కొత్త చరిత్ర లిఖించింది. వరుసగా రెండు సార్లు కప్ గెలవటంతో పాటుగా మూడో సారి గెలిచిన జట్టుగా రికార్డులు తిరగ రాసింది. 2025 ఆసియా కప్ ను గెలుచుకుంది. దుబాయ్‌లో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో పాకిస్థాన్‌పై 5 వికెట్ల తేడాతో గెలుపొంది, రికార్డు స్థాయిలో 9వ సారి ఆసియా కప్ టైటిల్‌ను కైవసం చేసుకుంది. 2024 లో జూన్ 29న బార్బడోస్‌లో జరిగిన ఉత్కంఠభరితమైన ఫైనల్‌లో దక్షిణాఫ్రికాపై 7 పరుగుల తేడాతో విజయం సాధించి రోహిత్ శర్మ నాయకత్వంలో భారత్ టీ20 ప్రపంచ కప్ ను గెలుచుకుంది. 2025 ఐసిసి ఛాంపియన్స్ ట్రోఫీ టైటిల్‌ను భారత్ సొంతం చేసుకుంది.

ఇక, మహిళా క్రికెట్ టీంకు చారిత్రాత్మక కిరీటం దక్కింది. దక్షిణాఫ్రికాపై భారత్ అద్భుతమైన విజయం సాధించి వరల్డ్ కప్ ను సొంతం చేసుకుంది. ముంబయిలో జరిగిన మ్యాచ్ లో భారత్ దక్షిణాఫ్రిపై గెలిచి సరికొత్త చరిత్రను సృష్టించింది. అయితే, వరుసగా ఈ కొత్త జోష్.. టీం కు మద్దతు వెనుక కీలక శక్తిలా నిలిచిన వ్యక్తం ఉన్నారు. ఆయనే జే షా... ప్రపంచ క్రికెట్‌లో టాప్ పోస్ట్ అయిన ఐసిసి చైర్మన్ పదవికి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 2022 లో బీసీసీఐ అధ్యక్షుడిగా సౌరవ్ గంగూలీ స్థానంలో రోజర్ బిన్నీ వచ్చి చేరాడు. కానీ బీసీసీఐ సెక్రటరీగా జే షానే ఏకగ్రీవంగా ఎన్నికయ్యాడు. బీసీసీఐ నుండి ఏషియన్ క్రికెట్ కౌన్సిల్‌కి.. జే షా కెరీర్లో మరో ముఖ్యమైన ఘట్టం ఇది. ఐపీఎల్‌ని ప్రపంచంలోనే రిచెస్ట్ గేమ్‌గా మార్చేసిన జే షా... జే షా బీసీసీఐలో చక్రం తిప్పడం మొదలుపెట్టాకా ఐపీఎల్ స్థితిగతులు కూడా పూర్తిగా మారిపోయాయి.

క్రికెట్ రూపు రేఖలు మార్చేసిన జైషా
టీం ఇండియా సక్సెస్ వెనుక జై షా పాత్ర కీలకం. బీసీసీఐలో జే షా ఇమేజ్ ఏ స్థాయికి వెళ్లిందంటే.. 2024 టీ20 వరల్డ్ కప్ కోసం బీసీసీఐ ప్రకటించే భారత జట్టులో ఎవరెవరు ఉంటారో కూడా ఇంకా క్లారిటీ లేకముందే.. ఫిబ్రవరిలోనే జే షా ఒక ప్రకటన చేశారు. టీమిండియాను రోహిత్ శర్మనే లీడ్ చేస్తారంటూ జే షా ఎనౌన్స్ చేశారు. ఇక.. టీమిండియా కోసం తెర వెనుక తన వ్యూహాలను అమలు చేస్తూ... క్రికెట్ ను అటు ఆదాయం లో.. ఇటు ఆస్వాదించటంలోనూ ముందుచే విధంగా జై షా తన మార్క్ పాత్ర పోషిస్తున్నారు. ఇక.. తాజాగా టీ20 ప్రపంచ కప్ లో భారత్ ఆడిన సెమీస్ , ఫైనల్ మ్యాచ్ లో స్వయంగా వీక్షించి.. టీం గెలిచిన ఆనందాన్ని తాను సొంతం చేసుకున్నారు. ఇదే ఇప్పుడు క్రికెట్ వర్గాల్లో జరుగుతున్న ఆసక్తి కర చర్చ.
-
US Visa: స్లాట్లు ఓపెన్. కానీ ప్రయాణం సేఫ్ కాదు! -
పాకిస్థాన్ కు ఎగిరి గంతేసే వార్త.. ఒకేసారి రూ. 41,500 కోట్లు సాయం అందింది..!! -
బెంగళూరుకు వందేభారత్ స్లీపర్, రైల్వే మంత్రి ప్రకటన- రూట్, హాల్టింగ్..!! -
కలియుగ వైకుంఠంలో అద్భుతం; తిరుమల చరిత్రలో తొలిసారి.. -
మ్యాచ్ గెలిచినా.. ఆనందం లేకపాయె -
దళపతితో చేతులు కలిపిన దీదీ, ఇండియా కూటమిలో ప్రకంపనలు -
జన్మ నక్షత్రం మృగశిర, ఆరుద్ర ఉన్నవారి మే నెల జాతక ఫలం -
ఎంత సీఎం అయినా.. !! -
DA సున్నా?: ఫిట్మెంట్ ఫ్యాక్టర్ పీక్స్! శాలరీ హైక్ రిపోర్ట్ -
సీనియర్ ఎన్టీఆర్‌కు బాగా ఇష్టమైన చిరంజీవి సినిమా -
తెలుగు రాష్ట్రాలకు కేంద్రం భారీ వరం, ఇక కొత్త రూపు..!! -
Vaibhav Suryavanshi: వైభవ్ సూర్యవంశీ సంపాదన, ఆస్తుల విలువ ఎంతో తెలుసా..!!












Click it and Unblock the Notifications