Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఆ ఆటగాళ్లను IPL లో ఆడిస్తే పిచ్ లు ధ్వంసం చేస్తాం- సాధువుల హెచ్చరిక..!!

IPL 2026: ఐపీఎల్ వేళ కొత్త పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే ఐపీఎల్ వేలం పూర్తయింది. తుది జట్లు ఖరారయ్యాయి. కెప్టెన్ల మార్పు దాదాపు ఖాయమైంది. ఇక.. ఐపీఎల్ షెడ్యూల్ ఖరారు పైన కసరత్తు జరుగుతోంది. అయితే, అంతర్జాతీయంగా చోటు చేసుకుంటున్న ఘటనలు ఐపీఎల్ పైన ప్రభావం చూపుతున్నాయి. తాజాగా ఆ దేశ ఆటగాళ్లను ఆడిస్తే ఐపీఎల్ మ్యాచ్ పిచ్ లను ధ్వంసం చేస్తామని సాదువులు హెచ్చరించటం సంచలనంగా మారింది. దీంతో, ఇప్పుడు ఫ్రాంఛైజీలు ఏం చేస్తారనేది ఆసక్తిని పెంచుతోంది.

మరి కొద్ది నెలల్లో IPL 2026 ప్రారంభం కానుంది. ఈ సమయంలోనే మధ్యప్రదేశ్ కు చెందిన కొందరు సాదువులు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. తాజాగా బంగ్లాదేశ్ లో చోటు చేసుకుంటున్న హింస ఐపీఎల్ పైన ప్రభావం చూపుతోంది. బంగ్లాదేశ్ ఆటగాళ్లు ఆడేందుకు అనుమతిస్తే, ఐపీఎల్ మ్యాచ్​లను అడ్డుకుంటామని మధ్యప్రదేశ్ ​కు చెందిన సాధువులు, హిందూ మత పెద్దలు హెచ్చరిక జారీ చేశారు. ఈ టోర్నీ​లో బంగ్లా ప్లేయర్లు ఆడేందుకు వీల్లేదని వారు హెచ్చరించారు.

Ujjain seers warn to disrupt IPL matches over Bangladesh players

తాజాగా బంగ్లాదేశ్‌లో జరిగిన ఈ హింసాత్మక దాడిలో హిందూ సమాజానికి చెందిన ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. ఈ క్రమంలోనే ఉజ్జయిన్​ సాదువులు ఈ హెచ్చరిక చేసారు. బంగ్లా క్రికెటర్లు మ్యాచ్ లో ఆడితే ఆ మ్యాచ్ ను ఆపటానికి సాదువులు.. యోధులు స్టేడియం లో ప్రవేశిస్తారని తేల్చి చెప్పారు.

అంతే కాదు.. మైదానంలోని పిచ్​ లను ధ్వంసం చేసి మ్యాచ్‌లకు అంతరాయం కలిగిస్తామని హెచ్చరిక చేశారు. అక్కడ హిందువుల పైన జరిగిన దాడులను అక్కడి అధికారులు పట్టించుకోక పోవటం పైన మండిపడ్డారు. ఈ పరిస్థితుల్లో బంగ్లాదేశ్ కు చెందిన ఏ క్రికెటర్ కూడా భారత్ లో జరిగే ఐపీఎల్ లో ఆడకూడదని అల్టిమేటం జారీ చేసారు. కాగా, IPL 2026 మినీ వేలంలో బంగ్లా దేశ్ ఆటగాడు ముస్తాఫిజుర్ రహ్మాన్​ను కోల్‌కతా నైట్ రైడర్స్ భారీ ధరకు దక్కించుకుంది.

అతడిని రూ. 9.20 కోట్ల భారీ ధరకు దక్కించుకుంది. 2016 నుంచి ఈ బంగ్లా ఫాస్ట్ బౌలర్ ఐపీఎల్ ఆడుతున్నాడు. గత 10 సీజన్లలో అతడు ఇప్పటి వరకు అయిదు ఫ్రాంచైజీలకు ప్రాతినిధ్యం వహించాడు. కాగా.. ఈ ఐపీఎల్ ​లో బంగ్లాదేశ్​ నుంచి ముస్తాఫిజుర్ ఒక్కడే ఆడనున్నాడు. ఇక.. తాజాగా సాధువుల హెచ్చరికలతో కేకేఆర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది ఆసక్తి కరంగా మారుతోంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+