మహ్మద్ షమీ చిరకాల కోరిక నెరవేర్చిన సీఎం యోగీ - భారీ గిఫ్ఠ్..!!

ప్రపంచ కప్ సమరంలో నిర్ణయాత్మక పోరుకు సిద్దమైంది. కోట్లాది మంది క్రికెట్ ఫ్యాన్స్ ఫైనల్ సమరం వైపు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. పుష్కర కాలం తరువాత టీం ఇండియా ప్రపంచ కప్ గెలిచి తమ కలలను నిజం చేస్తుందని నమ్మకంతో ఉన్నారు. గ్రాండ్ ఫైనల్ పోరుకు అహ్మదాబాద్ వేదిక కానుంది. సమఉజ్జీలుగా ఉన్న ఇండియా - ఆసీస్ ఈ ఫైనల్ పోరులో తలపడుతున్నాయి. ఇదే సమయంలో ప్రపంచ కప్ లో సంచలనంగా మారిన మహ్మద్ షమీకి యూపి సీఎం యోగీ భారీ గిఫ్ఠ్ ప్రకటించారు.

షమీ ఒక సంచలనం:ఈ ప్రపంచ కప్ లో మహ్మద్ షమీ ఒక సంచలనం. తొలి నాలుగు మ్యాచ్ లక దూరంగా ఉన్న షమీ..ఆ తరువాత ప్రతీ మ్యాచ్ లోనూ తానేంటో రుజుకు చేసుకున్నారు. కీలకమైన సెమీస్ లో ఏడు వికెట్లు కొత్త రికార్డు క్రియేట్ చేసారు. మహ్మద్ షమీ ఈ ప్రపంచ కప్ లోనే అందరి ప్రశంసలు అందుకుంటూ..వరుస రికార్డులతో ఫైనల్ లో ఆశాకిరణంగా మారారు. షమీ ఆట తీరుకు క్రికెట్ ఫ్యాన్స్ జేజేలు పలుకుతున్నారు. తాజాగా కివీస్ పైన షమీ ప్రదర్శనపైన ప్రధాని సైతం ప్రశంసలు గుప్పించారు. ఇక, ఇప్పుడు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాధ్ తీసుకున్న నిర్ణయం ఆసక్తి కరంగా మారుతోంది. కోట్లాది భారతీయుల మనసు గెలిచిన బౌలర్ గా నిలిచిన మహ్మద్ షమీకి యోగీ భారీ గిఫ్ట్ ప్రకటించారు.

UP CM Yogi Adityanath to make cricket stadium in Mohammed Shamis village

షమీ కోసం యోగీ నిర్ణయం:ఉత్తరప్రదేశ్ లోని అలీనగర్ మహ్మద్ షమీ సొంత ఊరు. అక్కడ మినీ క్రికెట్ స్టేడియంతో పాటుగా జిమ్ ను నిర్మించేందుకు యోగి సర్కార్ ఏర్పాట్లుచేస్తోంది. ఇందుకోసం ఇప్పటికే అమ్రోహా జిల్లా కలెక్టర్ రాజేష్ త్యాగి, అధికారుల బృందం శుక్రవారం(నవంబర్ 17)న అలీనగర్ గ్రామంలో పర్యటించారు. ఈ క్రమంలోనే అక్కడ క్రికెట్ స్టేడియాన్ని నిర్మించేందుకు అనువైన స్థలాన్ని పరిశీలించారు. గ్రౌండ్ నిర్మించేందుకు భూమి చాలానే ఉందని కలెక్టర్ ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు.ఈ మేరకు అధికారులకు, జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు కూడా జారీ చేసింది. అమ్రోహా జిల్లాలో స్టేడియం నిర్మించేందుకు మహ్మద్ షమీ సొంత ఊరు అలీనగర్ ను ఎంపిక చేశామని కలెక్టర్ రాజేష్ త్యాగి తెలిపారు.

షమీ చిరకాల కోరిక:షమీ తన స్వగ్రామంలో తాను ప్రాక్టీస్ చేసేందుకు తన సొంత డబ్బుతో క్రికెట్ పిచ్ తయ్యారు చేసుకున్నాడు. ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా 3 రకాల పిచ్ లను సొంత భూమిలో రెడీ చేయించాడు. జట్టుకు దూరంగా ఉన్న టైమ్ లో ఇక్కడే కఠోర సాధన చేసి.. ఇప్పుడు అద్భుతాలు సృష్టిస్తున్నాడు. ఈ మెగాటోర్నీలో ఆడిన 6 మ్యాచ్ ల్లోనే 23 వికెట్లు తీసి.. వరల్డ్ కప్ లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ గా అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. షమీ చిరకాల కోరికగా ఉన్న స్టేడియం ఏర్పాటు పైన ఇప్పుడు యూపీ సీఎం యోగీ తీసుకున్న నిర్ణయం ప్రపంచ కప్ లో అతని ఆట తీరుకు గిఫ్ఠ్ గా భావిస్తున్నారు. యూపీ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం పైన క్రికెట్ ఫ్యాన్స్ హ్యాపీ ఫీలవుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+