నేను అలిగాను, ఐ హర్టు: షేక్ హ్యాండ్ ఇవ్వని కోహ్లీ సాబ్

ఐపీఎల్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ మరో అద్వితీయ విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. శుక్రవారం రాత్రి ఉప్పల్ స్టేడియంలో జరిగిన మ్యాచ్ లో రాయల్ ఛాలెంజర్స్ ను మట్టికరిపించింది. 55 పరుగుల తేడాతో భారీ విజయాన్ని అందుకుంది. ఈ విజయం తర్వాత బ్యాటింగ్ దిగ్గజం విరాట్ కోహ్లీ, సన్ రైజర్స్ హైదరాబాద్ ఓపెనర్ ట్రావిస్ హెడ్ మధ్య జరిగిన ఉద్రిక్త ఘటన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

మ్యాచ్ అనంతరం సంప్రదాయంగా ట్రావిస్ హెడ్ కు షేక్ హ్యాండ్ ఇవ్వడానికి నిరాకరించాడు విరాట్ కోహ్లీ. ట్రావిస్ హెడ్ ముందు వెళ్తోన్న ప్లేయర్లందరితో హ్యాండ్ షేక్ చేసిన కోహ్లీ.. ట్రావిస్ హెడ్ వద్దకు రాగానే గమ్మున ఉండిపోయాడు. ఒకవంక ట్రావిస్ హెడ్ తన చేతిని ముందుకు చాచినప్పటికీ.. కోహ్లీ మాత్రం చేతిని కలవపలేదు. క్లియర్ గా నిరాకరించాడు. దీనికి సంబంధించిన ఓ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

Watch Virat Kohli Bypasses Handshake with Travis Head After Surisers Hyderabad vs RCB Match

కెప్టెన్ ప్యాట్ కమిన్స్, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్‌లతో కోహ్లీ కరచాలనం చేసినప్పటికీ, హెడ్‌ను దాటవేయడం ఇందులో స్పష్టంగా చూడొచ్చు. ఈ మ్యాచ్‌లో సాయంత్రం నుంచే ఉద్రిక్తత రాజుకుంది. మ్యాచ్ మొదటి ఇన్నింగ్స్‌లో రాసిఖ్ సలామ్ దార్ బౌలింగ్‌లో ట్రావిస్ హెడ్ 26 పరుగుల వద్ద ఔటైనప్పుడు, కోహ్లీ ఉద్వేగభరితంగా సంబరాలు చేసుకోవడం కనిపించింది.

అనంతరం సన్ రైజర్స్ నిర్దేశించిన 256 పరుగులను అందుకునే క్రమంలో మాటల యుద్ధం తీవ్రమైంది. హెడ్‌తో వాగ్వాదం చేస్తూ, బౌలింగ్ చేయడానికి రావాలని దూకుడుగా సంజ్ఞలు చేశాడు విరాట్ కోహ్లీ. సినిమాటిక్ ట్విస్ట్‌గా ట్రావిస్ హెడ్ బౌలింగ్‌కు దిగాడు. 39 బంతుల్లో 56 పరుగులు చేసి అద్భుతంగా ఆడుతున్న ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్‌ను ఔట్ చేశాడు. దీంతో కోహ్లీ మరింత ఠారెత్తాడు.

ఇషాన్ కిషన్ (46 బంతుల్లో 79), అభిషేక్ శర్మ (22 బంతుల్లో 56) ఆకాశమే హద్దుగా చెలరేగి అర్ధ సెంచరీలు సాధించడంతో సన్ రైజర్స్ 255/4 పరుగుల భారీ స్కోరును నమోదు చేసింది. ఇషాన్ కిషన్ 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డును దక్కించుకున్నాడు. చివర్లో హెన్రిచ్ క్లాసెన్ కూడా 24 బంతుల్లో 51 పరుగులు చేసి మెరుపులు మెరిపించాడు.

ఈ మ్యాచ్ లో పరాజయం పాలైనప్పటికీ మెరుగైన నెట్ రన్ రేట్ (NRR) కారణంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో పాటు సన్ రైజర్స్ హైదరాబాద్ స్టాండింగ్స్‌లో మొదటి రెండు స్థానాల్లో నిలదొక్కుకోగలిగారు. నాకౌట్ దశకు స్థానం సంపాదించుకున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+