World Cup Final: ఫైనల్ మ్యాచ్ కు ముందే టీమిండియాకు రవిశాస్త్రి గుడ్ న్యూస్...
భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య ఇవాళ అహ్మదాబాద్ లోని నరేంద్రమోడీ స్టేడియంలో ఫైనల్ మ్యాచ్ జరుగుతోంది. అయితే ఈ మ్యాచ్ లో విజేత ఎవరన్న దానిపై పలు ఊహాగానాలు సాగుతున్నాయి. అదే సమయంలో ఈ మ్యాచ్ కు ఆతిధ్యమిస్తున్న మోడీ స్టేడియంలో పిచ్ ఎలా స్పందిస్తుందన్న దానిపై కూడా అంతే చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో మ్యాచ్ కు ముందే భారత క్రికెట్ దిగ్గజం రవిశాస్త్రి కీలక ప్రకటన చేశాడు. మ్యాచ్ కు ముందు జరిగిన చర్చలో రవిశాస్త్రి కీలక వ్యాఖ్యలు చేశాడు.
భారత్, ఆస్ట్రేలియా ఫైనల్ మ్యాచ్ ఆడుతున్న పిచ్ స్పిన్నర్లకు అనుకూలంగా ఉండబోతోందని రవిశాస్త్రి విశ్లేషించాడు. పిచ్ పొడిగా ఉందని, కచ్చితంగా స్పిన్నర్లకు అనుకూలించే అవకాశం ఉందని తేల్చశాడు. ఈ మ్యాచ్ లో ఆస్టేలియా టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో భారత్ బ్యాటింగ్ కు దిగింది. ఆరంభంలో పేసర్లకు అనుకూలించినా ఆ తర్వాత స్పిన్నర్లకు ఈ పిచ్ అనుకూలించే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.

గతంలో భారత్-పాకిస్తాన్ మ్యాచ్ కు ఆతిధ్యమిచ్చిన అహ్మదాబాద్ పిచ్ స్లోగా ఉంటుందని ఇప్పటికే క్యూరేటర్ తో పాటు పలువురు క్రికెట్ దిగ్గజాలు అంచనా వేశారు. ఇప్పుడు ఈ పిచ్ పై భారత్, ఆస్ట్రేలియా మ్యాచ్ సందర్భంగా కూడా ఇదే పరిస్ధితి ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఇలాంటి స్లో పిచ్ పై స్పిన్నర్లను ఎదుర్కొని మ్యాచ్ గెలవడం అంటే ఆస్ట్రేలియాకు చాలా కష్టమే అంటున్నారు. అసలే ఈ మ్యాచ్ లో భారత్ అన్ని విధాలుగా ఫేవరెట్ గా కనిపిస్తున్న వేళ రవిశాస్త్రి చెప్పిన న్యూస్ కచ్చితంగా స్పిన్నర్లకు మానసికంగా బలాన్ని ఇచ్చింది.












Click it and Unblock the Notifications