ఏం ప్లాను బాబో
ఓటుహక్కు ఉపయోగించుకోని వారిని పోలింగు కేంద్రాలవరకు రప్పించే ప్లానులో ఇప్పుడు చంద్రబాబునాయుడు ఉన్నారు. గత ఎన్నికల్లో అరవయినుంచి డెబ్బయి శాతం మాత్రమే ఓట్లువేశారని, దాదాపు కోటి మంది ఓట్లు వేయలేదనిబాబు లెక్కలు లాగారు.
ఎన్నికలలెక్కల్లో ఆరితేరిన బాబును తక్కువగాఅంచనా వేయలేం. తమ పార్టీకి ఎంతశాతం ఓట్లు తక్కువ పడుతున్నాయో ఆయనకుముందుగానే తెలిసిపోతుంటుంది. ఆ మేరకుభర్తీ ప్లాను ఆయన వద్ద ఎప్పుడోసిద్ధంగా ఉంటుంది.
తెలుగుదేశంఓట్ల మాస్టరు ప్లానుకు నిదర్శనం గతబల్దియా ఎన్నికలు. మజ్లిసు పరం కావలసినమేయరు పదవి మీసాల క్పష్ణారెడ్డికిదక్కేలా చేయడం వెనుక చంద్రబాబునాయుడు లెక్కలు చాలా ఉన్నాయి.
ఓటువేసే అలవాటు లేని వారిని ఎడ్యుకేటు చేసే పనిని ఆయనతలకెత్తుకున్నారు. ఓటు హక్కు వినియోగించుకోకపోవడంసామాజిక నేరంగా ప్రచారం చేయబోతున్నారు.
వచ్చేఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ భారీ ఎత్తునరిగ్గింగ ప్రణాళిక వేసిందని ఓటింగు శాతంమీద ఎన్నికల సంఘానికి అనుమానాలు రాకుండాఇలా ప్రజాస్వామ్య ఉద్ధరణ కబుర్లు చెబుతున్నారనిఅప్పుడే ప్రతిపక్షాలు కీడు ఎంచుతున్నాయి.
- సైకిల్‌కు అసమ్మతి బ్రేక్‌లు












Click it and Unblock the Notifications