ఇక బాబు రోడ్‌షోలు
హైదరాబాద్:అధికారంలో ఉండగా వినువీధుల్లోవిహరించిన టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు డిసెంబర్‌నుంచి పల్లెబాటపట్టనున్నారు. ఈ కార్యక్రమానికి ఇంకాపేరు పెట్టనప్పటికీ ఎన్టీఆర్ పేరు ముందు ఉండవచ్చని తెలుస్తోంది. ఈమధ్య ప్రజలతో నేరుగా సంబంధాలు లేనిచంద్రబాబు నాయుడు ఈకార్యక్రమం ద్వారా వారికి సన్నిహితమవుదామనియోచిస్తున్నారు. దశల వారీగా జిల్లాల్లో ఆయనపర్యటిస్తారు. చిన్న చిన్న వీధి సమావేశాల్లోపాల్గొంటారు.
ఈయాత్రల్లో ఆయనప్రజల సమస్యలను కార్యకర్తల ద్వారాతెలుసుకుంటారు. ప్రధాన సమస్యలమీద ఆయన ప్రసంగించి కాంగ్రెస్‌ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపాలనుకుంటున్నారు. కిందిస్ధాయిటిడిపి కార్యకర్తలను ఈకార్యక్రమం ద్వారా ఉత్తేజ పరచాలనితెలుగుదేశాధీశుడి ఆలోచన.
కిందిస్ధాయి నాయకుల మధ్య విభేదాలనుపరిష్కరించడానికి కూడా ఈ కార్యక్రమం పనికివస్తుందని భావిస్తున్నారు. మంచిమెజారిటీతో అధికారంలోకి వచ్చినకాంగ్రెస్ ప్రభుత్వంపై కనీసం ఆరు నెలలవరకు ఎదురుదాడికి దిగరాదని సూత్రప్రాయంగానిర్ణయించినందువల్ల చంద్రబాబు నాయుడు పల్లెల పర్యటనకార్యక్రమాన్ని డిసెంబరులో పెట్టుకున్నట్టుటిడిపి వర్గాల ద్వారా తెలిసింది.
గత పదేళ్ళుగాచంద్రబాబు నాయుడు హెలికాప్టర్‌పర్యటనలు చేశారే గానీ రోడ్‌షోలు నిర్వహించలేదు.అయితే హై సెక్యూరిటీ జోన్‌లో ఉన్న చంద్రబాబునాయుడు రోడ్ షోలకు భద్రతాపరమైన చిక్కులు ఎదురుకావచ్చు.
ఇటీవలికథనాలు
- టిడిపి గుండెల్లో ఏలేరురైళ్ళు
- చంద్రబాబుతురుపుముక్క
- ఎన్టీఆర్ గుర్తున్నాడా?
- సైకిల్‌కుఅసమ్మతి బ్రేక్‌లు
- చిరంజీవిరహస్య ఎజెండా?
- అస్పష్ట రాజకీయ చిత్రం












Click it and Unblock the Notifications
