శ్రీకృష్ణదేవరాయలుపైకొత్త పుస్తకం
హైదరాబాద్:దేశభాషలందు తెలుగు లెస్స అని పలికినకవి, విజయనగర సామ్రాజ్య చక్రవర్తి శ్రీకృష్ణదేవరాయలుపై ఇటీవలతెలుగులో ఒక ఆసక్తికరమైన పుస్తకం వెలువడింది. విజయనగరసామ్రాజ్య చరిత్ర ఎక్కడా ఒకచోట సమగ్రంగారికార్డు కానందువల్ల అనేక గ్రంధాలను రిఫర్‌చేసి ఈ పుస్తకంరాసినట్టు రచయిత డాక్టర్‌బండ్లమూడి సుబ్బారావు పేర్కొన్నారు.తిరుమల తిరుపతి దేవస్ధానం ఆర్ధికసహాయంతో ప్రచురించిన ఈ పుస్తకంలోరెండో చాప్టర్‌లో ఒక భాగాన్ని ఉన్నదిఉన్నట్టు ఇక్కడ ఇస్తున్నాం.
"సరస్వతీ పుత్ర పుట్టపర్తి నారాయణాచార్యులవారు తుళువవంశీయులు(శ్రీకృష్ణదేవరాయల కుటుంబీకులు) తెలుగువారేనని, సంపెటలేదా సమ్మెట ఇంటి పేరుగల వీరుకమ్మ లేదా బలిజ కులస్తులని చెప్పారు. వీరు కమ్మకులస్తులని ప్రముఖ రచయిత్రి తెన్నేటి హేమలతచెప్పింది. శ్రీకృష్ణ దేవరాయలు యాదవుడనే ఒక వాదనకూడా లేకపోలేదు. ఏది ఏమైనా రాయలవారుతెలుగువారు, శూద్రులు అన్నది నిర్వివాదాంశం. ఆయన కమ్మ లేదాబలిజలేదా యాదవ కులానికి చెందిన వారు.
సింహాసనంఎక్కగానే శ్రీకృష్ణదేవరాయలుఅగ్రజుడైన వీర నరసింహ నాయకుడుతన కుటుంబంలో అనాదిగా వస్తున్ననాయకుడు పదాన్ని తొలగించుకునివీరసింహ రాయలుగా కొత్తఅవతారమెత్తాడు. సేనాధిపతులుగా,రాజ బంధువులుగా అప్పటివరకుకొనసాగిన తమ వంశానికిరాచరిక శబ్దాన్ని సూచించేరాయలు పేరు చేర్చుకోవడంతో ఆపరంపర తుళు వంశం చివరివరకు కొనసాగింది.
ఇవిశ్రీకృష్ణదేవరాయలు అనే పుస్తకంలోని రెండు పేరాలు. ఈపుస్తకానికి పద్మభూషణ్ డాక్టర్ బోయి భీమన్న, డాక్టర్‌నాగభైరవకోటేశ్వరరావు పీఠికలు రాశారు.
ఈపుస్తకంలోనివే మరో రెండు పేరాలు:
"ఆముక్త మాల్యదను శ్రీకృష్ణదేవరాయలు రాయలేదని,అల్లసాని పెద్దన రాసిన కావ్యానికి శ్రీకృష్ణదేవరాయలు తన పేరుపెట్టుకున్నాడని అప్పకవి అభాండం వేశారు.ఆముక్తమాల్యదలో శ్రీకృష్ణదేవరాయలు పరులవాక్యాలుగా పేర్కొన్న ఇరవై ఎనిమిది పద్యాల్లోపదిహేడు పెద్దన మనుచరిత్రలోవి.పదకొండు పద్యాలు ఇతరులవి.ఉదాహరణకు నీల మేఘముడాలుసేయగ జాలు వంటి పద్యాలు అల్లసాని వారిమనుచరిత్రలోనూ ఉన్నాయి. శ్రీకృష్ణదేవరాయలువీటిని పరులవాక్యాలుగా స్పష్టంగా పేర్కొన్నప్పటికీఆయన మీద అభాండాలు వేశారు. శూద్రుడైనశ్రీకృష్ణదేవరాయలుపాండిత్యాన్ని, సృజనాత్మకతనుసహించలేని బ్రాహ్మణ ఛాందసులు ఆముక్తమాల్యద కావ్యాన్ని ఆయనరాయలేదన్న ప్రచారాన్ని శతాబ్దాలపాటుకొనసాగించారు.
అయితేవేదం వెంకటరాయ శాస్త్రి, వావిళ్ళవెంకటేశ్వర శాస్త్రి, గట్టుపల్లి శ్రీనివాసకవి, గుడిపాటి వెంకట కవి, దీపాల పిచ్చయ్య శాస్త్రి, ఓరుగంటిరామచంద్రయ్య, కుందూరిఈశ్వరదత్తు మొదలైనపండితులు ఆముక్తమాల్యదను కూలంకషంగా పరిష్కరించిశ్రీకృష్ణదేవరాయలే రాశాడని నిర్ద్వంద్వంగా ప్రకటించారు
ఇవీ ఈపుస్తకంలోని మరో రెండు పేరాలు.
రచయితబండ్లమూడి సుబ్బారావు ప్రకాశం జిల్లాపర్చూరు మండలం వీరన్న పాలెంగ్రామానికి చెందిన వారు. ఆయన బెనారస్ హిందూవిశ్వవిద్యాలయం నుంచి వ్యవసాయ ఆర్ధిక శాస్త్రంలోడాక్టరేట్ పొందారు. రైతాంగ నాయకుడుఆచార్య ఎన్‌జి రంగా శిష్యులు.సమకాలీన సమస్యలపై వివిధపత్రికల్లో ఆయన రాసిన వ్యాసాలు బూజుపట్టిన రాజ్యాంగం పేరుతో పుస్తకరూపంలో వచ్చాయి. వివిధ దేశాల్లోవిస్తృతంగా పర్యటించిన డాక్టర్ సుబ్బారావుప్రొఫెసర్ ఎన్‌జి రంగాఫౌండేషన్ వ్యవస్ధాపక అధ్యక్షులు.హిందీ మాట్లాడే వారికి అన్ని రాష్ట్రాలు ఉండగాలేనిది తెలుగువారికి మూడు రాష్ట్రాలు ఉంటేతప్పేమిటన్న ఎన్‌జి రంగా వాదనకు సుబ్బారావు విస్తృతప్రచారం కల్పించి,చిన్న రాష్ట్రాల వాదనను బలపరిచారు.
మాటలమరాఠీ!
ప్రెస్‌అకాడమీ చైర్మన్‌గా అమర్
కంచిపైఇంటిలిజెన్స్ కన్ను
బాలకృష్ణపైచార్జిషీట్
చిరుకథలోపెను మార్పులు!
సినిమా వాళ్ళెక్కడ? మీడియా ఎక్కడ?
జయేంద్ర విశేషాలు
ఒక టిడిపి నేత విజయ గాధ
రాంగోపాల్‌వర్మ నాచ్ వివాదం
హెల్మెట్‌లో దాగిన అవినీతి పురుగు
మన్మోహన్‌హంగ్!
రాజేంద్రప్రసాద్‌కు రఘుపతి వెంకయ్య అవార్డు
షిండే సక్సెస్ స్టోరీ
ఆది మానవుడికీ హనుమంతుడికీ లింకు!
ఉదయభాను విషాద గాధ
ఉత్తమ కంపెనీల్లో సత్యం
హిందీలో వీరప్పన్ సినిమా












Click it and Unblock the Notifications
