వేడెక్కిన ప్రచారం

హోంపేజి టాక్‌ ఆఫ్‌ టుడే రాజకీయాలు Friday, April 09 2004

హైదరాబాద్‌: వేసవి ఎండలతో పాటు ఎన్నికలవాతావరణం కూడా వేడెక్కుతున్నది. శుక్రవారంరాజశేఖరరెడ్డి జైత్రయాత్ర వరంగల్లు జిల్లాలో సాగింది. శుక్రవారం ఉదయం ఢిల్లీ నుంచివచ్చిన ఎఐసిసి రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి గులాంనబీ ఆజాద్‌ఎన్నికలయ్యేవరకు రాష్ట్రంలో ఎక్కువ కాలం గడపాలనినిర్ణయించారు. ఇటీవల బహిరంగ సభలకు ఎక్కువ మంది జనంరాకపోవడం వల్ల తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు సోనియాగాంధీ తరహాలో రోడ్డు షోలునిర్వహిస్తున్నారు.

తెలుగుదేశం, కాంగ్రెసు, తెరాసపార్టీలలో తిరుబాటుదారుల సమస్య తీవ్రంగా ఉంది. గులాం నబీతోచర్చించిన తర్వాత పిసిసి అధ్యక్షుడు కాంగ్రెసు తిరుగుబాటుఅభ్యర్ధులను సస్పెండు చేయడానికి కసరత్తు చేస్తున్నారు.తిరుగుబాట్ల సమస్యను రేపటి లోగా పరిష్కరించుకోకపోతేకాంగ్రెసు-తెరాస పొత్తు మంచి ఫలితాలను ఇచ్చే అవకాశంలేదు.

తెలుగుదేశం, కాంగ్రెసు పార్టీలప్రచారాస్త్రాల్లో మార్పు లేదు. కాంగ్రెసు నాయకులు టికెట్లుఅమ్ముకున్నారని, ఇటువంటి వారు దేశాన్ని కూడా అమ్ముకుంటారనిచంద్రబాబు నాయుడు శుక్రవారం కూడా విమర్శించారు.రాజశేఖరరెడ్డి ఉచిత విద్యుత్తు, చంద్రబాబు నాయుడుఅక్రమార్జన గురించే మాట్లాడుతున్నారు. ఇక తెలంగాణరాష్ట్ర సమితి ప్రచారం ఇంకా పుంజుకోలేదు.

ఈ వారం ప్రధాని విశాఖపట్నం, రాజమండ్రిసభలకు జనం అతి తక్కువగా హాజరుకావడంతో రాష్ట్రబిజెపి నాయకుల్లో గుబులు పట్టుకుంది. ప్రధాని సభలకు జనాన్నిసమీకరించలేకపోయింది మీరంటే మీరంటూ బిజెపి, టిడిపినాయకులు నిందించుకుంటున్నారు.

కొసమెరుపు: గులాం నబీ ఆజాదు హవాబాగా తగ్గిపోయింది. టికెట్ల సీజనులో ఆయన అడుగులకుమడుగులొత్తిన కాంగ్రెసు నాయకులు ఈరోజు విమానాశ్రయంలోకన్పించలేదు. కాంగ్రెసు ఒక విలక్షత ఉందంటే ఇటువంటిదే.

  • పార్టీ టికెట్ల మార్కెటింగు
  • చిరంజీవిరహస్య ఎజెండా?

  • అస్పష్ట రాజకీయ చిత్రం
  • హోంపేజి
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+