• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

కులమే సామాజికసత్యం

By Staff
|

హోంపేజి టాక్‌ ఆఫ్‌ టుడే జనరల్‌ Saturday, April 10 2004

హైదరాబాదు:కులాల పేర్లు పత్రికల్లో రాయడం అపచారంగాభావించే రోజులు పోయాయి. ఆంగ్ల, ఉత్తరాదిహిందీ పత్రికలు కులాల గురించి పారదర్శకంగాఉన్నట్టే ఈ ఎన్నికల్లో తెలుగుపత్రికల్లో కులాలగురించి రాస్తున్నారు. గతంలో అగ్రకులం,బిసి, ఎస్సీ, ఎస్టీ అని రాసిన పత్రికలు ఏ పార్టీ అభ్యర్ధిఏ కులానికి చెందినవాడో స్పష్టంగా రాస్తున్నారు.

కులాలప్రాతిపదికగా రాజకీయ పార్టీలు టికెట్లు ఇస్తున్నప్పుడుమనకెందుకీ హిపోక్రసీ అనుకున్నారేమోపత్రికలు ఈ దారికి వచ్చాయి. రాష్ట్రంలో కాంగ్రెసుపార్టీ ఈసారి రెడ్లకు ఎక్కువ స్ధానాలు కేటాయించిందన్నఅభిప్రాయం వ్యక్తమవుతోంది. టికెట్ల కేటాయింపులోసామాజిక న్యాయ సూత్రాన్ని అమలుచేయలేకపోయామని,బలహీన వర్గాల అభ్యర్ధులకు వనరులుతక్కువగా ఉన్నందువల్ల జనాభా అధికంగాఉన్నా వారికి తగినన్ని టికెట్లు ఇవ్వలేకపోయామనిఎఐసిసి ప్రధాన కార్యదర్శి గులాం నబీఅంగీకరించారు. బలహీనవర్గాల నాయకత్వాన్నిక్రమంగా అభివృద్ధి చేస్తామని ఆయన చెప్పారు.

కమ్యూనిస్టులుచెప్పిన నీతి సూత్రాల కారణంగా మరుగునపడిన కులాల ప్రస్తావన ఇప్పుడుతెరచిన పుస్తకం. ఆధునిక మంత్రమైనపారదర్శకతలో భాగంగా కులాల ప్రస్తావననుకూడా పరిగణిస్తున్నారు. కులాలు పూర్తిగాఅంతరించిపోయి ఆదర్శ సమాజం ఏర్పడే అవకాశంలేనప్పుడు తరతరాలుగా వస్తున్నకులసమాజాన్ని ఇప్పటికంటే ఆదర్శవంతంగాతీర్చిదిద్దుకోవడంలో తప్పులేదు. పెళ్ళికికులం, టికెట్టుకు కులం, పదవికి కులం,పుట్టుకకు కులం, చావుకు కులం ఉన్నప్పుడుకులాలు లేవని మభ్యపెట్టుకోవడం మంచిదికాదన్న అభిప్రాయం ఇప్పుడు చాలా మందిసామాజిక శాస్త్రవేత్తల్లో ఉంది. సాహిత్యరంగంలోదీనిమీద పెద్ద చర్చే జరుగుతున్నది.

తమజనాభా ఎక్కువ ఉన్న నియోజకవర్గాల్లోతమకు పోటీ చేసే అవకాశాన్ని తెలుగుదేశంపార్టీ ఇవ్వడం లేదన్న అభిప్రాయం కాపు/బలిజ,బిసిలలోని కొన్ని కులాల్లో ఉంది. ఆయా కుల సంఘాలనాయకులు దీనిపై పత్రికా ప్రకటనలు కూడాఇచ్చారు. నిజంగా అంతబలం ఉన్నప్పుడు ఆ రెండుపార్టీలను దేబిరించడం దేనికి ఇండిపెండెంట్లుగాపోటీ చేసి గెలవవచ్చు కదా అన్న విమర్శలూవచ్చాయి. ఇక్కడ మంగళగిరిని ఉదహరించాలి.ఈ అసెంబ్లీ నియోజకవర్గంలో నేతపనివారు(పద్మశాలీలు) పెద్ద సంఖ్యలో ఉన్నారు. తెలుగుదేశంపార్టీ ఆ కులానికి చెందిన తటస్ధుడికి టికెట్టుఇవ్వాలని నిర్ణయించింది. కానీ పొత్తులో భాగంగాఆ సీటును బిజెపికి ఇవ్వవలసి వచ్చింది. బిజెపికూడా పద్మశాలి కులానికి చెందిన మహిళకుఈ టికెట్టు ఇచ్చింది. కొందరు ఒసిలు ప్రయత్నించినావారిని ఏ దశలోను ఈ పార్టీలు పరిగణనలోకితీసుకోలేదు.

రాష్ట్రంలోసంఖ్యాధిక్యత గల కులాల్లో చైతన్యంపెరుగుతోంది. రాష్ట్రంలో మొదట బాహ్మణులుతర్వాత రెడ్లు ఆ తర్వాత కమ్మవారురాజకీయ ఆధిపత్యం చెలాయించారని,తర్వాత కాపులు ఆ తర్వాత బిసిలు ముందుకువస్తారని లోహియావాదులు సూత్రీకరించారు.అదెంతకాలం పడుతుందో కానీ లోహియాఆలోచనా విధానంతో ఈ కులాల సమీకరణతోకొత్త పార్టీకి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.ఈ అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోతే రాష్ట్రంలోకాంగ్రెసు అంతరించిపోతుంది.

  • పార్టీ టికెట్ల మార్కెటింగు
  • చిరంజీవిరహస్య ఎజెండా?
  • అస్పష్ట రాజకీయ చిత్రం
  • హోంపేజి

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X