వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Home

By Staff
|
Google Oneindia TeluguNews

హోంపేజి టాక్‌ ఆఫ్‌ టుడే తెలుగుదేశం Tuesday, March 23 2004

TDPహైదరాబాద్‌:తొలి జాబితాపై వెల్లువెత్తిన నిరసనతోతెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, ఆపద్ధర్మముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అయోమయంలోపడ్డారు. దీంతో రెండవ జాబితా విడుదలనుఆయన వాయిదా వేసుకున్నారు. తొలి జాబితానుడెబ్బయ్‌ రెండు అసెంబ్లీ స్థానాలకు పోటీ చేసేఅభ్యర్థుల పేర్లతో ఆదివారం ఉగాదిపర్వదినం రోజున ఆయన విడుదల చేశారు.రెండవ జాబితాను మంగళవారం విడుదలచేయాలని అనుకున్నారు. అయితే తొలి జాబితావిడుదలైన వెంటనే జిల్లాల్లో పెద్ద యెత్తుననిరసనజ్వాలలు ఎగిసిపడ్డాయి.

తొలిజాబితాలో తన పేరు లేనందుకునిరసనగా వికారాబాద్‌ తాజా మాజీశాసనసభ్యుడు ఎ. చంద్రశేఖర్‌ తెలుగుదేశంపార్టీకి సోమవారం రాజీనామా చేశారు. ఆదివారంనాడుదర్శికి చెందిన సీనియర్‌ నాయకుడు చప్పిడివెంగయ్య పార్టీకి రాజీనామా చేశారు.

తూర్పుగోదావరి జిల్లా పార్టీ అధ్యక్షుడు చిన రాజప్పతీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఆయన అమలాపురంసీటును ఆశిస్తున్నారు. అందుకు చంద్రబాబుసుముఖత వ్యక్తం చేయడంతో రాజీనామాకుసిద్ధపడ్డారు. చంద్రబాబు ఆయనకు ఫోన్‌చేసి బుజ్జగించడానికి చేసిన ప్రయత్నం కూడావిఫలమైనట్లు సమాచారం. అదే దారిలోకృష్ణా జిల్లాకు చెందిన మంత్రులు వడ్డేశోభనాద్రీశ్వరరావు, యన్‌. నరసింహారావుకూడా ఉన్నట్లు సమాచారం. తొలి జాబితాలోతమ పేర్లు లేకపోవడంతో ఈ ఇద్దరుమంత్రులు సమావేశమై రహస్య మంతనాలుజరిపారు. వీరిని బుజ్జగించేందుకు తెలుగుదేశంపార్టీ నాయకత్వం ప్రయత్నిస్తోంది. వారినిహైదరాబాద్‌కు రావాల్సిందిగా పార్టీ నాయకత్వంవిజ్ఞప్తి చేసింది.

ఇదిలావుంటే, బాబూమోహన్‌ పేరు తొలి జాబితాలోలేకపోవడంతో ఆయన అనుచరులు తీవ్రఆగ్రహం వ్యక్తం చేశారు. వారు తెలుగుదేశంపార్టీ రాష్ట్ర కార్యాలయం ఎన్టీ ఆర్‌ భవన్‌కువచ్చి బాబూమోహన్‌కు టికెట్‌ ఇవ్వాలని కోరారు.

రెండవజాబితా వెలువడితే నిరసన వెల్లువమరింత పెల్లుబుకవచ్చుననే ఆందోళనతెలుగుదేశం రాష్ట్ర నాయకత్వాన్ని పీడిస్తోంది.వికారాబాద్‌ మాజీ శాసనసభ్యుడు చంద్రశేఖర్‌తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరడానికి మార్గంసుగమం చేసున్నట్లు సమాచారం. తెలుగుదేశంపార్టీకి రాజీనామా చేస్తే దారులుంటాయనేఆశ నాయకులు ఉంది. ఈ స్థితి తెలుగుదేశంనాయకత్వానికి మింగుడుపడని విషయం.

హోంపేజి

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X