• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

హిట్లు ఆరు శాతమే!

By Staff
|

హైదరాబాద్‌: ఈ సంవత్సరం తెలుగు సినిమా దాదాపు మూడు వందల కోట్ల రూపాయల నష్టం చవి చూసిందని ఒక అంచనా. వందకు పైగా ్రస్టెయిట్‌ చిత్రాలు, యాభైకి పైగా అనువాద చిత్రాలు విడుదలయ్యాయి. గత ఏడాదితో పోల్చుకుంటే సినిమా పరిశ్రమకు ఇది అశుభ సంవత్సరమే. వచ్చే ఏడాది మాత్రం ఆశావహంగా ఉంది. ఈ ఏడాది నవంబర్‌ వరకు 107 ్రస్టెయిట్‌ చిత్రాలు 50 డబ్బింగ్‌ చిత్రాలు విడుదల కాగా వీటిలో విజయవంతమైనవి పట్టుమని పది కూడా లేవు.

సంక్రాంతి రోజున విడుదలైన వర్షం సూపర్‌హిట్‌ కాగా లక్ష్మీ నరసింహ హిట్‌ అయింది. శివరాత్రి రోజు విడుదలైన వెంకటేష్‌ మల్లీశ్వరి మంచి విజయం సాధించింది. ఏప్రిల్‌ నెలాఖరులో వచ్చిన పెదబాబు సరికొత్త కథాంశంతో హిట్‌ అయింది. మే ఏడున విడుదలైన అల్లు అర్జున్‌ ఆర్య కూడా ఫ్రెష్‌నెస్‌ కారణంగా పెద్ద హిట్‌ అయింది. ఆ నెలలోనే విడుదలైన ప్రభాస్‌ అడవి రాముడు ఓపెనింగ్‌ కలెక్షన్లు బాగున్నా అనుకున్నంత హిట్‌ కాలేదు. జులైలో వచ్చిన ఫ్యాక్షన్‌ నేపధ్య చిత్రం యజం హిట్‌ అయింది.

ఆగస్టులో వచ్చిన మహేష్‌బాబు చిత్రం అర్జున్‌ హిట్‌ రేంజికి చేరుకున్నా ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. అత్యధిక వ్యయంతో ఈ సినిమాను నిర్మించారు. సెప్టెంబర్‌లో సుమంత్‌ సిన్మా గౌరి నితిన్‌-రాజమౌళి చిత్రం సై హిట్‌ కాగా పవన్‌ కళ్యాణ్‌ గుడుంబా శంకర్‌ ఫ్లాప్‌ అయింది. అక్టోబర్‌లో తొమ్మిది సినిమాలు విడుదల కాగా రెండు సినిమాలు హిట్‌ అయ్యాయి. అవి శంకర్‌దాదా ఎంబిబిఎస్‌, ఆనంద్‌. శేఖర్‌ కమ్ముల ఆనంద్‌ ఆశ్చర్యకరమైన హిట్‌ చిత్రంగా నిలిచింది. నవంబర్‌లో విడుదలైన చిత్రాల్లో బృందావన్‌ కాలనీ ఒక్కటే హిట్‌ బాటలో పయనిస్తోంది.

తెలుగు సినిమా పరిశ్రమలో చోటుచేసుకున్న అనారోగ్య ధోరణుల కారణంగా పరిశ్రమ స్లంప్‌ అంచుల్లో ఉంది. జూనియర్‌ ఆర్టిస్టులు, థియేటర్ల వద్ద సైకిల్‌ స్టాండుల్లో పనిచేసేవారి వద్ద నుంచి సూపర్‌ స్టార్స్‌ వరకు వేలాది మంది ఈ పరిశ్రమ మీద ఆధారపడ్డారు. తెలుగు సినిమా పరిశ్రమ విజయ పథంలో ఉంటే కొన్ని వేల సామాన్య కుటుంబాల్లో ఆనందం వెల్లివిరుస్తుంది.

రెమ్యూనరేషన్లు పెంచుకుని కొండెక్కి కూర్చున్న స్టార్స్‌, రీమేక్‌లను తప్ప ఒరిజినల్‌ కథలను నమ్మలేని నిర్మాతలు, బయ్యర్లు, టికెట్‌ రేట్లి విపరీతగా పెంచేసిన థియేటర్‌ యజమానులు, వీడియో పైరసీ తెలుగు సినిమా పరిశ్రమకు శాపాల్లా పరిణమించాయి. తక్కువ బడ్జెట్‌తో తీసి ఎక్కువ కలెక్షన్లు రాబడుతున్న శుభ్రమైన సినిమా ఆనంద్‌ వచ్చే ఏడాది తెలుగు సినిమాకు ఆదర్శంగా నిలవాలని ఆశిద్దాం.

ఈ పేజీని మీ మిత్రులకు పంపండి

మాటలమరాఠీ!
ప్రెస్‌అకాడమీ చైర్మన్‌గా అమర్‌
కంచిపైఇంటిలిజెన్స్‌ కన్ను
బాలకృష్ణపైచార్జిషీట్‌
చిరుకథలోపెను మార్పులు!
సినిమా వాళ్ళెక్కడ? మీడియా ఎక్కడ?
జయేంద్ర విశేషాలు
ఒక టిడిపి నేత విజయ గాధ
రాంగోపాల్‌వర్మ నాచ్‌ వివాదం
హెల్మెట్‌లో దాగిన అవినీతి పురుగు
మన్మోహన్‌హంగ్‌!
రాజేంద్రప్రసాద్‌కు రఘుపతి వెంకయ్య అవార్డు
షిండే సక్సెస్‌ స్టోరీ
ఆది మానవుడికీ హనుమంతుడికీ లింకు!
ఉదయభాను విషాద గాధ
ఉత్తమ కంపెనీల్లో సత్యం
హిందీలో వీరప్పన్‌ సినిమా

హోంపేజి

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X