వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

డయల్‌యువర్‌ ఇసి!

By Staff
|
Google Oneindia TeluguNews

హోంపేజి టాక్‌ ఆఫ్‌ టుడే జనరల్‌ Tuesday, August 03 2004

హైదరాబాద్‌: విజయవిహారం మాసపత్రికసబ్‌-ఎడిటర్‌ పింగళి చైతన్యను కిడ్నాప్‌ చేసి అత్యాచార యత్నంచేసినవారిపై పోలీసులు చర్యలు తీసుకోకపోవడంపై మహిళాసంఘాలు నిరసన వ్యక్తం చేస్తున్నాయి. చైతన్య కేసు ఇరవైరోజులుగా వార్తల్లోకి వస్తున్నది. ఈమె ఎన్‌కౌంటర్‌ పత్రిక నడిపినపింగళి దశరథరామ్‌ కుమార్తె. జాతీయ పతాకాన్నిరూపొందించిన పింగళి వెంకయ్య మనవరాలు.

ఈకేసుకు పెద్ద చరిత్ర ఉంది.

విజయవిహారం ఎడిటర్‌, పబ్లిషర్‌ రమణమూర్తికిజనహర్ష రియల్‌ ఎస్టేట్‌ సంస్ధ ఉంది. సంఘీనగర్‌ సమీపంలోజనహర్ష దాదాపు పదహేను వందల ఎకరాల్లో ప్లాట్లను డెవలప్‌చేస్తున్నది. రెండేళ్ళ క్రితం వార్త సిఎండి గిరీష్‌ సంఘీ అక్రమాలు,మోసాలపై విజయవిహారం పత్రిక బద్మాష్‌ సంఘి శీర్షికతో కవర్‌స్టోరీ ప్రచురించింది. అప్పటికి ఆరేళ్ళుగా సజావుగా సాగినజనహర్ష రియల్‌ ఎస్టేట్‌ సంస్ధకు ఇబ్బందులుఎదురవుతున్నాయి.

జనహర్ష కంపెనీ తనదే నని నవీష్‌ మూర్తిఅనే వ్యక్తి అకస్మాత్తుగా రంగంలోకి వచ్చాడు. జనహర్షతనదేనని అతను విలేకరుల సమావేశాలు పెట్టినా, పత్రికాప్రకటనలు ఇచ్చినా పత్రికలు పట్టించుకోక పోవడంతో అతనురమణమూర్తి మీద కరపత్రాలు వేసి పంచాడు. తనఅక్రమాలను, మోసాలను వెలికి తీసిన విజయవిహారం పత్రికయాజమాన్యం మీద కక్షసాధించుకోడానికి నవీష్‌ మూర్తిని ఒక పావుగా గిరీష్‌ సంఘిఉపయోగించుకుంటు న్నాడన్నది రమణమూర్తి ప్రధాన ఆరోపణ.

రియల్‌ ఎస్టేట్‌ వివాదం పరస్పర దాడులకుదారి తీయడంతో నవీష్‌ మూర్తి, రమణమూర్తిల మీద పోలీసులు కేసులునమోదు చేశారు. జనహర్ష కంపెనీ తనదేనంటూ నవీష్‌మూర్తి వేసిన సివిల్‌ దావానుకోర్టు అడ్మిషన్‌ దశలోనే తిరస్కరించింది. అయినా ఆ కంపెనీచైర్మన్‌ను తానేనని చెప్పుకు తిరుగుతున్న నవీష్‌కు గిరీష్‌సంఘీ, కోడెల శివప్రసాదరావు వంటి వారు అన్ని విధాలప్రోత్సహిస్తున్నారని జనహర్ష సంస్ధ ఆరోపిస్తున్నది. సంఘీరాజ్యసభ సభ్యుడయ్యాక జనహర్ష భూములపై కన్నువేశారని జనహర్ష యాజమాన్యం అనుమానించి దానికి తగినఆధారాలను సేకరించినట్టు తెలుస్తోంది.

చైతన్య కిడ్నాప్‌ కేసును సంఘీ వత్తిడిమేరకే పోలీసులు నీరుగార్చడానికి ప్రయత్నిస్తున్నారన్నఅభిప్రాయం కూడా ఉంది. ఒక యువతి కిడ్నాప్‌ కేసులో ఆమె నిందితులనుగుర్తించినా పోలీసులు వారిపై చర్యలు తీసుకోకపోవడం పట్లమేధావులు, మహిళా సంఘాల నాయకురాళ్ళు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.

Recent Stories
ఆరుదేశాల్లో ఎన్నారై శాఖ ఆఫీసులు
తెలంగాణకు ఎర్ర జెండా
ఆరుదేశాల్లో ఎన్నారై శాఖ ఆఫీసులు
మొగిలిచెర్లలోవార్‌
సిద్దిపేట సీను
ఆంధ్రపైజయ చిందులు
మణికుమారికిసవతిపోరు!
కొడుకు రాజకీయంపై వైయస్‌
సైకిల్‌దిగిన బాబూఖాన్‌
సమైక్యనినాదం ఊపు
తిరగబడినరాత
బాబుపైబాలయ్య అసంతృప్తి!
సచిన్‌టెండూల్కర్‌ - ఇంటర్వ్యూ హోంపేజి

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X