వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

టిడిపి గుండెల్లోఏలేరురైళ్ళు

By Staff
|
Google Oneindia TeluguNews

హోంపేజి టాక్‌ ఆఫ్‌ టుడే తెలుగుదేశం Saturday, June 12 2004

హైదరాబాద్‌: మళ్ళీ తెరమీదికివచ్చిన ఏలేరు కుంభకోణం మరికొంత కాలం దుమారం రేపేఅవకాశం ఉంది. ఏలేరు ప్రాజెక్టు వల్ల నిర్వాసితులైన వారిభూములకు నష్టపరిహారం చెల్లింపులో కోట్లాది రూపాయలకుంభకోణం జరిగిందని ఆరోపణలు రావడంతో అప్పటి తెలుగుదేశంప్రభుత్వం విచారణకు సోమశేఖర కమిషన్‌ను నియమించింది.కుంభకోణంలో తెలుగుదేశం పెద్దల హస్తం ఉన్నట్టు సోమశేఖరనివేదికలో ప్రస్తావించినట్టు తెలుసుకుని ఆనాటి టిడిపి ప్రభుత్వం ఈకమిషన్‌ను రద్దు చేసింది.

ఇప్పుడు కాంగ్రెస్‌ ప్రభుత్వంమళ్ళీ సోమశేఖర కమిషన్‌ ను పునరుద్ధరించాలనిఆలోచిస్తుడడంతో సోమశేఖర వద్దని, సుప్రీంకోర్టు సిటింగ్‌జడ్జితో విచారణ జరిపించాలని శనివారం నాడుపీట ముడి వేసింది. సోమశేఖర మీద తమకు నమ్మకం లేదనినీటిపారుదల శాఖ మాజీ మంత్రి, తెలుగుదేశం నాయకుడుకడియం శ్రీహరి విలేకరుల సమావేశంలో తెలిపారు.

ఏలేరు కుంభకోణంపై ఆనాడుఅసెంబ్లీలో దుమారం రేపిన కాంగ్రెస్‌ నాయకుడు పి.జనార్ధనరెడ్డి తెలుగుదేశం నాయకుల ప్రకటనలనుతప్పుపట్టారు. సోమశేఖర కమిషన్‌ విచారణను పూర్తిచేసిందని, దానిని కాదని కొత్తగా సుప్రీంకోర్టు న్యాయమూర్తితోవిచారణ జరిపించాలనడం కాలయాపన చేయడానికేనని ఆయనఆక్షేపించారు. ఏలేరు భూముల నష్టపరిహారాన్ని కొన్ని రెట్లుపెంచాలన్న మెమొరాండంపై అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పాజిటివ్‌ రిమార్కులతో స్వయంగా సంతకం చేశారనిజనార్ధనరెడ్డి ఆరోపించారు.

కాంగ్రెస్‌ ప్రభుత్వం మాత్రంసోమశేఖర కమిషన్‌ను పునరుద్ధరించ డానికేసూత్రప్రాయంగా నిర్ణయించింది. సోమశేఖర కమిషన్‌ రద్దయ్యేనాటికే విచారణను దాదాపు పూర్తి చేసినందున త్వరలో నివేదికవెలువరించే అవకాశం ఉంది.

ఇటీవలికథనాలు

  • చంద్రబాబుతురుపుముక్క
  • ఎన్టీఆర్‌ గుర్తున్నాడా?
  • సైకిల్‌కుఅసమ్మతి బ్రేక్‌లు
  • చిరంజీవిరహస్య ఎజెండా?

  • అస్పష్ట రాజకీయ చిత్రం
  • హోంపేజి
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X