వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎన్నికలకలం

By Staff
|
Google Oneindia TeluguNews

హోంపేజి టాక్‌ ఆఫ్‌ టుడే రాజకీయాలు Wednesday, March 31 2004

హైదరాబాద్‌:రాష్ట్ర ఎన్నికల చిత్రం అస్పష్టంగా ఉంది.కాంగ్రెస్‌, తెలుగుదేశం, బిజెపి, టిఆర్‌ఎస్‌ లలో అంతర్గత తగాదాలు తీవ్రంగా ఉన్నాయి.పార్టీల కంటే అభ్యర్ధులే ఇప్పుడు ప్రధానమయ్యేపరిస్ధితులున్నాయి. అధికార తెలుగుదేశంపార్టీ మీద వ్యతిరేకత అంత తీవ్రంగాలేదు. కాంగ్రెస్‌ పార్టీకి పెద్ద ఆకర్షణలేదు. బిజెపికి ఐదేళ్ళ నాటి ప్లస్‌ పాయింట్లు(కార్గిల్‌ వగైరా) ఇప్పుడు లేవు.

మధ్యతరగతి,ఉద్యోగవర్గాలు మాత్రం తెలుగుదేశంపార్టీకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు.మంచో చెడో ఒక మార్పయితే కావాలని వీరివాదన. జీ ఛానల్‌ సర్వే గమ్మత్తుగాఉంది. కాంగ్రెస్‌ అలయెన్సుకు అసెంబ్లీ ఎన్నికల్లోసగానికి సగం సీట్లు వస్తాయని, టిడిపి-బిజెపిలకుఅంతకంటే పది స్ధానాలు తక్కువవస్తాయని అ సర్వే సారాంశం. ఈ సర్వేలవిశ్వసనీయత ప్రశ్నార్ధకమే. అయితేఇవి ఏ ప్రభంజనం లేని ఎన్నికలని నిస్సంహంగాచెప్పవచ్చు.

కాంగ్రెస్‌నుంచి శివశంకర్‌ వంటి సీనియర్‌నాయకులు వెళ్లిపోవడం పార్టీ కేడర్‌ కుతప్పుడు సంకేతాలు పంపుతున్నాయి.రగడలు రాజీనామాలు తెలుగుదేశంలోతక్కువే. సమస్యలు తప్ప ఉద్వేగభరితఅంశాలేవీ ఈసారి కన్పించడం లేదు. డబ్బు ప్రధానపాత్ర వహించబోతోంది.

ఒక్కచిరంజీవి తప్ప సినిమా వాళ్ళ ప్రభావం ఓటరుపైఅంతంతమాత్రమే. యుపిలో అమితాబ్‌ను సమాజ్‌ వాది పార్టీ బ్రాండ్‌ అంబాసిడర్‌గా వాడుకున్నట్టు టిడిపి చిరంజీవిని ఉపయోగించుకోవాలనిప్రయత్నిస్తోంది.

అస్పష్టరాజకీయ చిత్రం
రాష్ట్ర ఎన్నికల చిత్రం అస్పష్టంగా ఉంది. ఉద్వేగభరితమైనఅంశాలు లేకపోవడంతో పాజిటివ్‌, నెగిటివ్‌ప్రభంజనాలు వీచే అవకాశం లేదు.

  • చిరంజీవిరహస్య ఎజెండా?


    టిడిపికిచిరంజీవి ఆశీస్సులు లభించబోతున్నాయి. ఆయనడిమాండ్లను టిడిపి అంగీకరించింది. బాబు స్క్రిప్టుప్రకారం ఆయన నటించవలసి ఉంటుంది.

    హోంపేజి
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X