• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

ఒక అడుగుముందుకు, రెండు వెనక్కి!

By Staff
|

హైదరాబాద్‌:ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి మంత్రివర్గాన్నివిస్తరించే సాహసం ఇప్పట్లో చేయకపోవచ్చు. విధానమండలి పునరుద్ధరణ బిల్లును వచ్చే అసెంబ్లీసమావేశాల్లోనే ప్రవేశపెట్టనున్నట్టుఆయన ప్రకటించారు. పిసిసిఅధ్యక్షుడుగా కేశవరావునుఎంపిక చేయించుకోవడం వైఎస్‌రాజకీయ విజయమైనప్పటికీ నక్సలైట్లతోచర్చల విషయంలో ఆయనవైఫల్యం త్వరలో బయటపడనుంది.

ప్రస్తుతానికి తుపాకులమోతలుసద్దుమణిగినప్పటికీ దీనిని మంచిఅవకాశంగా తీసుకుని నక్సలైట్లు రిక్రూట్‌మెంట్‌ను ఉధృతంచేయడమే కాకుండా పల్లెల్లో తమపట్టును పెంచుకుంటున్నారు. చంద్రబాబులావ్యవహరిస్తే వైఎస్‌ను కూడా విడిచేదిలేదని ప్రకటించి హీరోయిజం చాటుకుంటున్నారు.నక్సలైట్లతో చర్చలువైఎస్‌కు పులి మీద స్వారీలాపరిణమించవచ్చన్న అభిప్రాయం ఉంది.

ఆశ్రీతపక్షపాతం విషయంలో చంద్రబాబు నాయుడికీ రాజశేఖరరెడ్డికీ తేడాలేదు. మీడియా విషయంలో మాత్రంఇద్దరిదీ చెరో దారి. మీడియా మాకు ఎప్పుడూఅనుకూలం కాదని వైఎస్‌ నిన్న ఢిల్లీలోప్రకటించడం ఒక ఉదాహరణ.వ్యతిరేక వార్తలు వస్తే సహించలేనిముఖ్యమంత్రి తరచు ఇటువంటిప్రకటనలు చేస్తున్నారు. ప్రభుత్వంఅన్న తర్వాత అక్రమాలు జరిగి తీరుతాయి,వాటిని మీడియా బయట పెట్టి తీరుతుంది.ఇన్వెస్టిగేటివ్‌ వార్తల నిజా నిజాలనుపరిశీలించి అవసరమైన చర్యలు తీసుకోడానికి ఏ ప్రభుత్వమైనా ఒకప్రత్యేక యంత్రాంగాన్ని ఏర్పరచుకోవాలి.వైఎస్‌ జమానాలో అటువంటి యంత్రాంగం ఏదీఉన్నట్టు కన్పించదు.

కాంట్రాక్టుఉద్యోగాలన్నిటినీ రద్దు చేస్తూ వైఎస్‌అధికారంలోకి రాగానే ఒక జనరల్‌ప్రభుత్వ ఉత్తర్వులు వెలువడినా సమాచార శాఖ వంటికొన్ని విభాగాల్లోఅటువంటి ఉద్యోగులు కొనసాగుతున్నారు. అవినీతి మీదచంద్రబాబు లాగానే వైఎస్‌ కూడా సీరియస్‌గారియాక్ట్‌ కావడం లేదు. అవినీతిమయ ప్రభుత్వయంత్రాంగం మీద సామాన్యుల్లో ఆగ్రహంనివురుగప్పిన నిప్పులా ఉంటుంది. దీనిని పాలకులుగ్రహించకపోవడం వల్ల సామాన్యులుతీవ్రవాదంవైపు ఆకర్షితులవుతున్నారు.

నీటిపారుదలప్రాజెక్టులకు ప్రాధాన్యం ఇస్తాం, కట్టి తీరుతాం అని ప్రకటిస్తున్నముఖ్యమంత్రిచిత్తశుద్ధి పులిచింతల ప్రాజెక్టు విషయంలోబయటపడింది. గతంలో చంద్రబాబు నాయుడు శంకుస్ధాపనచేశారు. పని ముందుకు సాగలేదు. ఇప్పుడు వైఎస్‌రాయి వేసి వచ్చారు. మళ్ళీ పరిస్ధితి మామూలే.

పవర్‌ ప్లస్‌పవర్‌

సమాంతరశక్తులు!

ఇందిరమ్మభూమి

ఇదొకరాజ్యకీయం.

అవినీతి వికేంద్రీకరణ

కాంగ్రెస్‌-టిఆర్‌ఎస్‌ కటీఫ్‌?

సోదరహాసం

ఐటీమీద వైఎస్‌ దృష్టి

త్తెకాలపు సత్తెన్న

కప్పల తక్కెడ

మూడోపవర్‌ఫుల్‌ లేడీ

టికెట్‌-క్యాన్సిల్‌-ఒకతెలుగమ్మాయి

బాలకృష్ణ ఇంటిదొంగలేనా?

మంద భాగ్యనగరం

తెలంగాణకు ఎర్ర జెండా

ఛానళ్ళా? చేపల చెరువులా?

టిఆర్‌ఎస్‌లో ముసలం?

వార్‌ బహుముఖ విస్తరణ

ఎమ్యెల్యేకుకోటి!

ప్రత్యేక వ్యూహం!

వైఎస్‌ అసహనం

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X