కంచి పీఠంవెనుకా... ముందూ
హోంపేజి
టాక్ ఆఫ్ టుడే;/SPAN>
జనరల్ Friday, November 19 2004
హైదరాబాద్:మతతత్వం, ప్రాంతీయతత్వం,అవినీతి, అన్ని రంగాల్లో క్రమశిక్షణరాహిత్యం ఈ నాలుగూ మనదేశసమైక్యతకు ప్రమాదకరమైనవి.వీటన్నిటిలోకీ మతతత్వం ఎక్కువప్రమాదకరం. ఈ నాలుగు జాఢ్యాలకుకారణం రాజకీయ నాయకుల, రాజకీయపార్టీల స్వార్ధం. అని జయేంద్ర సరస్వతికిముందు కంచి పీఠాధిపతిగా ఉన్న శ్రీచంద్రశేఖరేంద్ర సరస్వతి పాతికేళ్ళక్రితమే వ్యాఖ్యానించినట్టు భవన్స్‌జర్నల్ ప్రచురించింది. కంచి పీఠాధిపతుల్లోచంద్రశేఖరేంద్ర అగ్రగణ్యులు.కంచిపీఠాన్ని రాజకీయానికి, మతానికిఅతీతంగా బాగా అభివృద్ధి చేసిన ఘనతఆయనది.
ఇందిరాగాంధీ దేశంలోఎమర్జెన్సీ విధించిన తర్వాత దేశంలోఆమె పట్ల వ్యతిరేకత పెరుగుతున్నదశలో ఆమె అభద్రతా భావంతో క ంచివెళ్ళారు. అప్పటి పీఠాధిపతిచంద్రశేఖరేంద్ర సాక్షాత్తూప్రధానమంత్రి అని కూడా చూడకుండాఆమెకు దర్శనం ఇవ్వడానికినిరాకరించారు. అంతటి గొప్పదనం గలచంద్రశేఖరేంద్ర తర్వాత కంచిపీఠాన్ని అధిరోహించిన జయేంద్ర సరస్వతిఇప్పుడు పోలీసు స్టేషన్‌లో కటకటాలులెక్కించడం ఎంతదురదృష్టకరం? ఎంత దారుణం?
చంద్రశేఖరేంద్రస్వామి రాజకీయ నాయకుల స్వార్ధాన్నివిమర్శించిన పాతికేళ్ళ లోపే జయేంద్రసరస్వతి గత ఏప్రిల్‌లో చెన్నైలో బిజెపిఎన్నికల కార్యాలయాన్ని త్న స్వహస్తాలతోప్రారంభించారు. ఆ ఎన్నికల్లోఎఐఎడిఎంకె-బిజెపి కూటమి మట్టిపరిచింది.కంచి పరమాచార్య అస్తమించినప్పటినుంచి విజయేంద్ర సరస్వతి ఆధ్వర్యంలోకంచి మఠం రాజకీయాలకు కేంద్రమైంది. మఠం నియమాలఉల్లంఘన జరుగుతూ వచ్చింది.
శైవ పీఠానికిచెందిన జయేంద్ర సరస్వతి వైష్ణవఆలయమైన తిరుమల గుడివ్యవహారాలలో తలదూర్చడాన్ని త్రిదండిశ్రీమన్నారాయణ రామానుజ చిన జీయర్‌స్వామి తీవ్రంగా విమర్శించారు. వెయ్యికాళ్ళ మంటపం నిర్మాణం విషయంలో ఈఇద్దరు స్వాములవి భిన్నమైనవాదనలు.
కంచి మఠం గతపదేళ్ళుగా వ్యాపార, సేవారంగాల్లోకికూడా విస్తరించింది. ధర్మ ప్రచారం కోసంక్రీస్తు పూర్వమే వెలిసిన పీఠంఇటువంటి విస్తరణల కారణంగా క్షీణవిలువలను ఆహ్వానించినట్టయింది. రియల్ ఎస్టేట్‌వ్యాపారులకు మఠంలో ప్రత్యేక స్ధానంవచ్చింది. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఒకరియల్ ఎస్టేట్ సంస్ధకు రూపాయివడ్డీకి క ంచి మఠం కొన్ని కోట్ల రూపాయలఅప్పు ఇచ్చినట్టు వార్తలు వచ్చాయి. ఇటువంటికార్యకలాపాల వల్ల కొన్ని అవాంఛనీయశక్తులకు కూడా మఠంలో ఆశ్రయంలభించింది.
హత్యకుగురైన శంకర రామన్ వీటివివరాలన్నీ సేకరించినట్టు తెలుస్తోంది.
చిరుకథలోపెను మార్పులు!
సినిమా వాళ్ళెక్కడ? మీడియా ఎక్కడ?
జయేంద్ర విశేషాలు
ఒక టిడిపి నేత విజయ గాధ
రాంగోపాల్‌వర్మ నాచ్ వివాదం
హెల్మెట్‌లో దాగిన అవినీతి పురుగు
మన్మోహన్‌హంగ్!
రాజేంద్రప్రసాద్‌కు రఘుపతి వెంకయ్య అవార్డు
షిండే సక్సెస్ స్టోరీ
ఆది మానవుడికీ హనుమంతుడికీ లింకు!
ఉదయభాను విషాద గాధ
ఉత్తమ కంపెనీల్లో సత్యం
హిందీలో వీరప్పన్ సినిమా
అడవుల విస్తరణలో రాష్ట్రం టాప్
దసరా మూవీస్
రెండో రౌండు సాధ్యమే!
కెసిఆర్ మీమాంస
లంచగొండితనం సమస్య కాదా?
నానితో ఎన్టీఆర్ కటీఫ్
ఇకనైనా నిదానం నాగేందర్












Click it and Unblock the Notifications