వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

టివిఎస్‌+కంచి స్వామి= అపచారం

By Staff
|
Google Oneindia TeluguNews

హోంపేజి టాక్‌ ఆఫ్‌ టుడే;/SPAN> జనరల్‌ Wednesday, December 01 2004

టివిఎస్‌+కంచి స్వామి= అపచారం

మాధవన్‌అనే వ్యక్తిని ఇటీవల తమిళనాడు పోలీసులువార్తల్లోకి తీసుకొచ్చారు.కొంతకాలం క్రితం ఈయన మీదపట్టపగలు కొందరు దుండగులు నడిరోడ్డు మీదదాడి చేశారు. తీవ్రంగాగాయపడిన మాధవన్‌ కోలుకున్నతర్వాత ఆయన వాంగ్మూలాన్ని పోలీసులురికార్డు చేశారు. అప్పట్లో దీనిమీదమౌనంగా ఉండిపోయారు. ఇప్పుడు తాజాగాఆనాటి దాడి జయేంద్ర సరస్వతే చేయించారనికేసులు నమోదు చేయడం గమనార్హం.

మాధవన్‌మీద జరిగిన దాడి గురించి అప్పట్లోనే కొన్నితమిళ పత్రికలు వివరాలు రాశాయి. ఈ దాడివిషయంలో ముఖ్యమంత్రి జయలలితపక్షపాతంతో వ్యవహరిస్తున్నారని,ఉన్నత స్ధానాల్లొ ఉన్నవారికి ఈ దాడిలోప్రమేయం ఉందని ఆ పత్రికలు రాశాయి.అయినా పోలీసులు పట్టించుకోలేదు. మాధవన్‌ ఉదంతాన్ని పరిశీలిస్తేకొన్ని ఆసక్తికరమైన విషయాలుతెలియవస్తాయి.

మాధవన్‌వైష్ణవుడు. అయినాశంకరమఠమైన కంచి పీఠంతోసంబంధాలు పెట్టుకున్నాడు. గతించిన కంచిస్వామి చంద్రశేఖరేంద్ర సరస్వతిబతికున్న రోజుల్లో మాధవన్‌ ఆయనకుసన్నిహితంగా ఉండేవారు. మాధవన్‌కు సమవయస్కుడైనజయేంద్ర సరస్వతితో వైరం తెచ్చినకారణాలు ఆసక్తికరంగా ఉన్నాయి.

నక్కీరన్‌పత్రిక వెలుగులోకి తెచ్చిన వివరాలప్రకారం తమిళనాడులోని ఒక గ్రామంలోఒక ఆలయం ఉంది. తమిళనాడులోని ప్రముఖ పారిశ్రామిక సంస్ధ టివిఎస్‌యజమానులు నంబి అయ్యంగార్‌, సుందరంఅయ్యంగార్ల స్వగ్రామం అదే. ఆగ్రామంలోని ఆలయంలో ఒక శివలింగాన్నిప్రతిష్టించి శైవ,వైష్ణవ తేడాలుఉండకూడదని అప్పట్లో పెద్దలు నిర్ణయించారు.

ఇలా ఉండగాటివిఎస్‌ సంస్ధకు ఒక పర్యాయం తీవ్ర నష్టాలువచ్చాయి. దీనికి కారణమేమిటనిటివిఎస్‌ అధినేతలు ఒక ప్రముఖ కేరళజ్యోతిషుడిని సంప్రదిస్తారు. మీ ఊళ్ళోని ఆలయంలోముందు శివలింగం, తర్వాత నంబిపెరుమాళ్‌ విగ్రహాలు ఉండడమే అరిష్టానికికారణమని జ్యోతిషుడు చెప్పాడట.శివలింగాన్ని ఆ ఆలయం నుంచి తొలగిస్తే టివిఎస్‌సంస్ధకు పట్టిన అరిష్టం తొలగిపోతుందనిసెలవిచ్చాడట. అందుకు ఆ ఊరు ప్రజలుఅంగీకరించలేదు.

ఈనేపధ్యంలో టివిఎస్‌ సంస్ధ అధిపతులుతమకు సన్నిహితుడైన కంచిపీఠాధిపతి జయేంద్ర సరస్వతినిసంప్రదించారట. జయేంద్ర ఒక రోజుహఠాత్తుగా ఆ గ్రామాన్ని సందర్శించారట.అంత గొప్ప వ్యక్తి చెప్పాపెట్టకుండాతమ గ్రామానికి రావడంతోగ్రామస్తులు ఆశ్చర్యచకితులయ్యారు.జయేంద్ర అప్పటికప్పుడు ఒక సమావేశం పెట్టిఆలయంలోని శివలింగాన్నితొలగిస్తే గ్రామ ప్రజలు సుఖ సంతోషాలతోఉంటారని సెలవిచ్చారట, ఆయన కోరిక మీదశివలింగాన్ని అక్కడి నుంచి తొలగించిఎదురుగా ఉన్న పశువుల కొట్టంలోకి మార్చారు.

ఈ సంఘటనచాలా మంది శైవులకే గాక వైష్ణవులకుకూడా ఆగ్రహం తెప్పించింది.ఒక ప్రముఖ శంకరమఠాధిపతిశివలింగాన్ని తొలగించమని చెప్పడం, ఆ చర్యనువైష్ణవులు అడ్డుకోవాలని చూడడం విచిత్రమైన పరిస్ధితి. టివిఎస్‌పారిశ్రామిక సంస్ధ కోరిక మేరకు జయేంద్ర సరస్వతి శివలింగానికిఅపచారం చేశారని, వ్యాపారవర్గాలకొమ్ము కాసి శివలింగానికి అపచారం చేసిన తొలి శంకరాచార్యఈయనేననికొందరు ఆరోపించారు. వారిలో మాధవన్‌ముఖ్యుడు. బెదిరింపులకులొంగని మాధవన్‌ మీ హత్యాయత్నంజరిగిందని నక్కీరన్‌ పత్రిక రాసింది.

ఈ పేజీని మీ మిత్రులకు పంపండి

మాటలమరాఠీ!
ప్రెస్‌అకాడమీ చైర్మన్‌గా అమర్‌
కంచిపైఇంటిలిజెన్స్‌ కన్ను
బాలకృష్ణపైచార్జిషీట్‌
చిరుకథలోపెను మార్పులు!
సినిమా వాళ్ళెక్కడ? మీడియా ఎక్కడ?
జయేంద్ర విశేషాలు
ఒక టిడిపి నేత విజయ గాధ
రాంగోపాల్‌వర్మ నాచ్‌ వివాదం
హెల్మెట్‌లో దాగిన అవినీతి పురుగు
మన్మోహన్‌హంగ్‌!
రాజేంద్రప్రసాద్‌కు రఘుపతి వెంకయ్య అవార్డు
షిండే సక్సెస్‌ స్టోరీ
ఆది మానవుడికీ హనుమంతుడికీ లింకు!
ఉదయభాను విషాద గాధ
ఉత్తమ కంపెనీల్లో సత్యం
హిందీలో వీరప్పన్‌ సినిమా

హోంపేజి
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X