• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

కెసిఆర్‌కు మిగిలింది దీక్షలే

By Staff
|
హోంపేజి టాక్‌ ఆఫ్‌ టుడే జనరల్‌ Saturday, August 07 2004

హైదరాబాద్‌: రెండో రాష్ట్రాలపునర్విభజన కమిషన్‌కే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుఅంశాన్ని నివేదించడానికే కాంగ్రెస్‌ కట్టుబడి ఉందని ముఖ్యమంత్రివైఎస్‌ రాజశేఖరరెడ్డి ఢిల్లీలో స్పష్టం చేయడంతో తెలంగాణరాష్ట్ర సమితి నాయకులు మల్లగుల్లాలు పడుతున్నారు.రాజశేఖరరెడ్డి ప్రకటనను వారు జీర్ణంచేసుకోలేకపోతున్నారు.

త్వరలో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుచేయకపోతే సోనియాగాంధీ ఇంటి ముందు ధర్నా చేస్తామనిటిఆర్‌ఎస్‌ అధ్యక్షుడు, కేంద్రమంత్రి చంద్రశేఖరరావుహెచ్చరించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాతరాజశేఖరరెడ్డి ఆంధ్ర రాష్ట్రానికి మాత్రమేముఖ్యమంత్రిగా ఉంటారని, ఇందుకు ఆయన మానసికంగాసిద్ధపడాలని ఆయన సూచించారు.

దీనితో ప్రత్యేక తెలంగాణ అంశంఇప్పుడు కీలక దశకు చేరుకున్నట్టయింది. రెండో ఎస్సార్సీకితెలంగాణ అంశాన్ని నివేదిస్తే ప్రత్యేక రాష్ట్రంపై నిర్ణయంతీసుకోడానికే నాలుగైదేళ్ళు పడుతుందని రాజ్యాంగ నిపుణులుఅభిప్రాయపడుతున్నారు. రెండో ఎస్సార్సీకే కాంగ్రెస్‌ కట్టుబడిఉందని సోనియాగాంధీ కూడా కాంగ్రెస్‌ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జిదిగ్విజయ్‌ సింగ్‌తో ప్రకటన చేయించే అవకాశముందనిభావిస్తున్నారు. అటువంటప్పుడు ఈ కింది పరిస్ధితులు ఏర్పడవచ్చు.

చంద్రశేఖరరావుఆందోళన కార్యక్రమాలకే పరిమితమవుతారు. కేంద్రంలోకాంగ్రెస్‌ సంకీర్ణ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించాలనినిర్ణయించే సాహసం ఆయన చేయలేరు. ఎందుకంటే ఐదుగురుఎంపీలున్న టిఆర్‌ఎస్‌ మద్దతు ఉపసంహరించుకున్నా కేంద్రప్రభుత్వానికి ఎటువంటి నష్టం జరగదు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకుప్రజా ఉద్యమాన్ని నడిపే నైతిక స్ధైర్యం ఇప్పుడు చంద్రశేఖరరావుకులేదు. ఆయన నాయకత్వంలో ఏర్పడే తెలంగాణపైనక్సలైట్లకు నమ్మకం లేదు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటువిషయంలో చంద్రశేఖరరావు తెలంగాణ ప్రజలనుమోసగిస్తున్నారని పీపుల్స్‌వార్‌ నిశ్చితాభిప్రాయం.

చంద్రశేఖరరావుఎటువంటి ఉద్యమాలు నడిపినా పీపుల్స్‌వార్‌ అడ్డుపడేఅవకాశముంది. వార్‌పై నిషేధం లేదు కాబట్టి వారుచంద్రశేఖరరావుకు వ్యతిరేకంగా రాజకీయ సభలునిర్వహించే అవకాశముంది.

ఆరు నెలల్లో తెలంగాణ రాష్ట్రంఏర్పాటవుతుందని అనేకసార్లు ప్రకటనలు చేసినచంద్రశేఖరరావుకు ప్రజలను ఎదుర్కోడానికి మొహంచెల్లకపోవచ్చు.

తెలంగాణ ఏర్పాటు కోసంప్రాణత్యాగమైనా చేస్తానని గతంలో అనేకసార్లు ప్రకటించినచంద్రశేఖరరావు పొట్టి శ్రీరాములు తరహాలో ఆమరణనిరాహార దీక్షకు దిగితే పరిస్ధితులు ఆయనకుఅనుకూలించవచ్చు. అయితే పొట్టి శ్రీరాములుకు ఉన్నంత చిత్తశుద్ధి,నైతిక స్ధైర్యం చంద్రశేఖరరావుకు ఉన్నాయా అన్నదేప్రశ్న.

Recent Stories

తెలుగు భాష దుస్ధితి

పాపం వైఎస్‌!

ఇద్దరు

చైతన్య కిడ్నాప్‌ వెనుక...

ఆరుదేశాల్లో ఎన్నారై శాఖ ఆఫీసులు

తెలంగాణకు ఎర్ర జెండా

ఆరుదేశాల్లో ఎన్నారై శాఖ ఆఫీసులు

మొగిలిచెర్లలోవార్‌

సిద్దిపేట సీను

ఆంధ్రపైజయ చిందులు

మణికుమారికిసవతిపోరు!

కొడుకు రాజకీయంపై వైయస్‌

సైకిల్‌దిగిన బాబూఖాన్‌

సమైక్యనినాదం ఊపు

తిరగబడినరాత

బాబుపైబాలయ్య అసంతృప్తి!

సచిన్‌టెండూల్కర్‌ - ఇంటర్వ్యూ హోంపేజి

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X