వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రాష్ట్రం నుంచి మూడో ప్రధాని

By Staff
|
Google Oneindia TeluguNews

హోంపేజి టాక్‌ ఆఫ్‌ టుడే కాంగ్రెస్‌ Friday, June 25 2004

Manmohan Singhహైదరాబాద్‌: ప్రధాని మన్మోహన్‌ సింగ్‌మన రాష్ట్రంలోని నంద్యాల లోక్‌సభ స్ధానం నుంచి పోటీ చేసేఅవకాశాలు ఎక్కువగా కన్పిస్తున్నాయి. ఈ నియోజకవర్గంనుంచి ఇటీవలి ఎన్నికల్లో గెలుపొందిన ఎస్‌పివై రెడ్డి ప్రధాని కోసం ఎంపిపదవికి రాజీనామా చేయడానికి సంసిద్ధత వ్యక్తం చేసినట్టుతెలుస్తోంది. ఆయన ఇప్పటికే ప్రధానమంత్రి కార్యదర్శులతో ఈవిషయం చర్చించారు. ముఖ్యమంత్రి ఆహ్వానంపై జులై ఒకటి,రెండుతేదీల్లో రాష్ట్రంలో పర్యటించడానికి ప్రధాని అంగీకరించారు. నంద్యాలస్ధానంపై ఆ సమయంలోనే నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

ప్రధానమంత్రి పదవి చేపట్టినఆరునెలలలోపు మన్మోహ న్‌ సింగ్‌ లోక్‌సభకు ఎన్నిక కావలసిఉంటుంది. పదమూడేళ్ల క్రితం ప్రధానమంత్రి పదవి చేపట్టినపివి నరసింహారావు నంద్యాల లోక్‌సభ నియోజకవర్గం నుంచేఎన్నికయ్యారు. ఆయన అక్కడ నుంచి పోటీ చేయడానికి వీలుగాఅప్పటి సిట్టింగ్‌ ఎంపి గంగుల ప్రతాప్‌రెడ్డి రాజీనామా చేశారు.అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ మెదక్‌ లోక్‌సభ ఉపఎన్నికల్లో పోటీచేసి గెలుపొందారు. మన్మోహన్‌సింగ్‌ నంద్యాల నుంచి ఎన్నికైతేముగ్గురు ప్రధానులను లోక్‌సభకు పంపిన ఘనతరాష్ట్రానికి దక్కుతుంది.

పివినరసింహారావు నంద్యాల నుంచి పోటీ చేసినప్పుడుతెలుగుదేశం పార్టీ ఆయన తొలి ప్రధానిగా ఆయన మీద ఉన్నగౌరవంతో ఆయన మీద పోటీకి తమ అభ్యర్ధిని రంగంలోనిలపలేదు. ఒకవేళ మన్మోహన్‌సింగ్‌ నంద్యాల నుంచి పోటీ చేస్తేతెలుగుదేశం పార్టీ అభ్యర్ధిని నిలబెట్టడం ఖాయం. ఆ అభ్యర్ధిఎవరన్న విషయంపై ఇంకా తెలుగుదేశం పార్టీలో మంతనాలుప్రారంభం కాలేదు.

  • నెలరాజు వైఎస్‌
  • మారువేషంలోవెళ్ళొచ్చు కదా?
  • ఎవరు గొప్ప?
  • ఆచితూచి అడుగులు
  • సవాళ్ళు ఎన్నో...
హోంపేజి
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X