బాబుకు బ్రేకులు

హోంపేజి టాక్‌ ఆఫ్‌ టుడే చంద్రబాబు Tuesday, July 20 2004 Chandrababu Naidu

హైదరాబాద్‌: మాజీ ముఖ్యమంత్రిచంద్రబాబు నాయుడుకు చెందిన హెరిటేజ్‌ ఫుడ్స్‌పైవాణిజ్యపన్నుల శాఖ విజిలెన్స్‌ విభాగం దాడులు జరపడంతో చంద్రబాబునాయుడిపై కక్ష సాధింపు చర్యలకు కాంగ్రెస్‌ ప్రభుత్వంశ్రీకారం చుట్టినట్టు అయింది. పాలపొడి అమ్మకాలపై కోట్లాదిరూపాయల పన్నును పెనాల్టీలతో కట్టవలసిందిగా నోటీసు జారీచేసిన అధికారులు ఆ తర్వాత చిత్తూరుజిల్లాలోని హెరిటేజ్‌డెయిరీ కార్యాలయంపై దాడి చేసి రికార్డులు స్వాధీనంచేసుకున్నారు.

రంగారెడ్డి జిల్లాలో విలువైన ప్రభుత్వభూములను ప్రైవేటు కంపెనీలకు నామమాత్రపు ధరకుచంద్రబాబు నాయుడి ప్రభుత్వం కేటాయించదని, ఈ లావాదేవీల్లో పెద్దఎత్తున డబ్బు మూటలు చేతులు మారాయన్న ఆరోపణలపైవిచారణకు కాంగ్రెస్‌ ప్రభుత్వం ఇప్పటికే మంత్రివర్గఉపసంఘాన్ని నియమించింది. మంత్రి వర్గ ఉపసంఘం రాజకీయపక్షపాతం చూపే అవకాశమున్నందువల్ల దీనిపైన్యాయవిచారణ జరిపిస్తే సమంజసంగా ఉంటుందని తెలుగుదేశంతెలిపింది.

మరో వైపు చంద్రబాబు నాయుడు హయాంలోటీవీ మీడియాకు ఇచ్చిన కోట్లాది రూపాయల అడ్వర్టయిజ్‌ మెంట్లలోనిధుల దుర్వినియోగం జరిగిందన్న ఆరోపణలపై ఇప్పటికేశాఖాపరమైన విచారణ ప్రారంభమైంది. నెదర్లాండ్స్‌నిధులతో అమలు చేసిన నీరు-మీరు కార్యక్రమంలో కోట్లాదిరూపాయల నిధుల దుర్వినియోగంపై విజిలెన్స్‌ విచారణ త్వరలో ప్రారంభమయ్యేఅవకాశముంది. ప్రతిపక్షంలోకి వచ్చిన రెండు నెలల కేతెలుగుదేశం పార్టీ అగ్రెసివ్‌గా వ్యవహరిస్తూ ఉద్యమాలకుఉపక్రమిస్తున్నందువల్ల చంద్రబాబు నాయుడిని విచారణలచట్రంలో బిగించాలన్నది కాంగ్రెస్‌ వ్యూహంగా కన్పిస్తున్నది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+