వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సత్తెకాలపు సత్తెన్న

By Staff
|
Google Oneindia TeluguNews

హోంపేజి టాక్‌ ఆఫ్‌ టుడే కాంగ్రెస్‌ Monday, August 30 2004

M Satyanarayana raoహైదరాబాద్‌: ప్రభుత్వం అంతా ఒక దారిఅయితే రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి ఎం.సత్యనారాయణరావుది మరో దారి. కృష్ణా పుష్కరాల్లో దుర్ఘటన నేపధ్యంలోఆయన మరోసారి వార్తల్లోకి వచ్చారు. ఎప్పుడూ గతంలో జీవించేఆయనకు ఫ్లాష్‌బ్యాక్‌ సత్తెన్న అనిపేరు. ఇందిరాగాంధీ హయాంలోతాను ఐదురాష్ట్రాలకు ఇంచార్జిగా ఉండేవాడినని ఆయనపదేపదే చెబుతుంటారు. కాంగ్రెస్‌లో ఉండగా చంద్రబాబునాయుడు తన శిష్యుడని ఆయన గుర్తుచేసుకుంటారు.

పిసిసి అధ్యక్షుడుగా ఉన్నప్పటి నుంచిఆయన రాజశేఖరరెడ్డికి అనేక తలనొప్పులుతీసుకొస్తున్నారు. దేవాదాయశాఖను అయిష్టంగా స్వీకరించినఆయన వందరోజులుగా ఆ శాఖను తీవ్ర గంద్రగోళంలో ఉంచారు.వెయ్యికాళ్ళ మంటపం నిర్మాణంపై చినజీయర్‌ స్వామికిప్రభుత్వం తరఫున హామీ ఇచ్చివచ్చిన ఆయన తర్వాతముఖ్యమంత్రి మందలింపుతో నాలుక కరుచుకున్నారు.

ఆయనవిషయం విలేకరులు ప్రస్తావించినప్పుడల్లా ముఖ్యమంత్రి అదోవిధమైన నవ్వు నవ్వుతుంటారు. ఎమ్మెస్‌ మాటలకు ఏం విలువఉందన్నది ఆ నవ్వు సారాంశం. కృష్ణా పుష్కర ఏర్పాట్లలో నిర్లక్ష్యంకారణంగా కృష్ణా కలెక్టరును, పోలీసు కమిషనర్‌నుముఖ్యమంత్రి ఆగమేఘాల మీద బదిలీ చేసి ఇంచార్జులనునియమించగా తాపీగా విజయవాడ చేరుకున్న ఎమ్మెస్‌ ఇవి బదిలీలుకావని, విచారణ పూర్తయ్యేవరకు వారిని విధులకు దూరంగాఉంచామని ఒక మాట సెలవిచ్చారు.

దీనితో రాజశేఖరరెడ్డికి నవ్వాలోఏడవాలో అర్ధం కాలేదు. పుష్కర దుర్ఘటనలకు దేవాదాయ శాఖమంత్రి ఎం.సత్యనారాయణ రావు నైతిక బాధ్యత వహించిరాజీనామా చేయాల్సిన అవసరం లేదా అని విశాఖపట్నలో విలేకరులుముఖ్యమంత్రిని నిలదీయగా ఆయన సమాధానం దాటవేశారు.

కృష్ణా పుష్కరాల విషయంలో ఎమ్మెస్‌మొదటి నుంచి తలాతోకా లేని ప్రకటనలు చేశారు. గోదావరిపుష్కరాలకు చేసినంత ఖర్చు కృష్ణ పుష్కరాలకుఅనవసరమని ఆనాడు ఆయన ప్రకటించారు. ఆ తర్వాతఅంతకంటే పదికోట్ల రూపాయల నిధులను ఎక్కువగాకేటాయించారు. ఆలోచన వచ్చిందే తడవుగా ముందూ వెనకాచూసుకోకుండా మాట్లాడేయడం ఎమ్మెస్‌ స్వభావం. బోళా మనిషి.పెద్దగా డబ్బు ఆశలేని మనిషి. కాంగ్రెస్‌లో అంతరించిపోయినవృద్ధ తరానికి ఆయన ప్రతినిధి.

ఆయన పిసిసి అధ్యక్షుడిగా ఉన్నప్పుడువైఎస్‌ సిఎల్పీ నాయకుడిగా ఉండేవారు. ఒక సందర్భంలో ఆయనవైఎస్‌ మీద ఆగ్రహిస్తూ పిసిసి ప్రెసిడెంట్‌ కంటే సిఎల్పీ నాయకుడుపెద్ద కాడని ప్రకటించారు. దానితో కోపమొచ్చిన వైఎస్‌ఆయనను పిసిసి అధ్యక్ష పదవి నుంచి తొలగించాలని హైకమాండ్‌ వద్దపట్టుబట్టారు.

ఆ దశలో రాజీకి వచ్చిన ఎమ్మెస్‌ కాబోయే సిఎంరాజశేఖరరెడ్డేనని ప్రకటించి ఆయనను ప్రసన్నంచేసుకున్నారు. యాభై ఏళ్ళకు పైగా రాజకీయాల్లోఉన్నాను. రాజకీయాల్లో నేను డబ్బు సంపాదించి ఉంటే నా కొడుకులుడ్రై క్లీనింగ్‌ షాపు ఎందుకు పెట్టుకోవాల్సి వస్తుంది? అని ప్రశ్నించే ఈపెద్దాయన భవిష్యత్తు ఏమిటి? వచ్చే మంత్రివర్గ విస్తరణలోఆయన శాఖను మార్చుతారా?

Recent Stories
కప్పల తక్కెడ
మూడోపవర్‌ఫుల్‌ లేడీ
టికెట్‌-క్యాన్సిల్‌-ఒకతెలుగమ్మాయి


బాలకృష్ణ ఇంటిదొంగలేనా?
మంద భాగ్యనగరం
తెలంగాణకు ఎర్ర జెండా
ఛానళ్ళా? చేపల చెరువులా?
టిఆర్‌ఎస్‌లో ముసలం?
వార్‌ బహుముఖ విస్తరణ
ఎమ్యెల్యేకుకోటి!
ప్రత్యేక వ్యూహం!
వైఎస్‌ అసహనం హోంపేజి

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X