నక్సల్స్ అప్‌బీట్
హైదరాబాద్:నక్సలైట్లు ఇప్పుడు రియల్ హీరోలుగారాష్ట్ర ప్రజలకు కన్పిస్తున్నారు. ఇరవైఏళ్ళ తర్వాత అడవులు వదిలి చర్చలకోసం ప్రజల్లోకి వచ్చిన అగ్రనక్సలైట్ నాయకుల మీద సామాన్యులుఆశలు పెట్టుకున్నట్టు చెప్పడానికి ఒక్క ఉదాహరణచాలు. సామాన్య ప్రజలు తమ సమస్యల గురించివినతి పత్రాలు ఇచ్చుకోవచ్చని పీపుల్స్‌వార్ రాష్ట్ర కార్యదర్శిరామకృష్ణ ప్రకటించగా నక్సలైట్‌నాయకులు బసచేసిన మంజీర అతిధి గృహంవద్దఫిర్యాదులతో జనం బారులు తీరుతున్నారు.పోలీసులు వీరినివెళ్ళగొట్టినా మళ్ళీ మళ్ళీ అక్కడ కన్పిస్తున్నారు.అవినీతి మయమైనఅధికార యంత్రాంగంతో విరక్తి చెందినసామాన్యులు ప్రత్యామ్నాయపరిష్కార మార్గాల కోసం ఎదురుచూడడంసహజమే.
పీపుల్స్‌వార్ అగ్రనేత రామకృష్ణపై యువతరంలో హీరో వర్షిప్‌పెరుగుతోంది. నిన్న గంటన్నర సేపుఆయన పాల్గొన్న మీట్ ది ప్రెస్‌కార్యక్రమాన్ని లైవ్ టెలికాస్ట్ చేసిన టీవీఛానళ్ళను జనంవిరగబడి చూశారు. ఆ సమయంలోఇతర ఛానళ్ళలో వచ్చిన ఇతరకార్యక్రమాలకు ప్రేక్షకులుకరువయ్యారు. రారామకృష్ణఇరవయ్యేళ్ళ తర్వాత కన్నతల్లిని కలుసుకున్న దృశ్యం కూడాఒక ఆ్రర్ధమైన సినిమానుతలపింపజేసింది. గాంధీలాంటి పెద్ద చెవులు, కళ్ళలో మెరుపు ఉన్నరామకృష్ణ టీవీ ఛానళ్ళ కారణంగాజనం మనసుల్లో ప్రత్యేక ముద్రవేశాడు. హింసా మార్గం నచ్చని వారికికూడా వారు తాము నమ్మిన సిద్ధాంతానికికట్టుబడి కష్టపడడం అనే లక్షణం నచ్చుతుందనడంలో సందేహంలేదు.
ప్రజల్లోపెరుగుతున్న ఆదరణను నక్సలైట్‌నాయకులు తమ ఉద్యమాన్ని బలోపేతంచేసుకునే అవకాశాలు కన్పిస్తున్నాయి. చర్చలనుఅయిదారు దఫాలుగా పొడిగించి ఈ లోపురాష్ట్రం నలుమూలలా బహిరంగ సభలునిర్వహించి జనం మద్దతు కూడగట్టుకోడానికివారుప్రయత్నిస్తారు. నిరుద్యోగం, దారిద్య్రంతోమగ్గుతున్న లక్షలాదిప్రజలకు ఈ ఉద్యమం ఆశాజ్యోతిగా కన్పించేఅవకాశం ఉంది. చర్చలు సఫలమైనావిఫలమైనా నక్సల్బరీ ఉద్యమంబలపడడానికి సహకరిస్తున్న చారిత్రక సందర్భమిది.
వీసాలపైఆశలు
వెయ్యికార్ల ర్యాలీ
ఈయనకు ఎక్సయిజ్ శాఖ కావాలట!
సెప్టెంబర్ పదకొండు వాస్తవాలు
అనంత ఎస్పీ అనుభవం
కెసిఆర్‌కు చివరకు మిగిలింది?
మనమే వీసాల వీరులం!
తెలుగుసినిమా దుస్ధితి
మేనేజర్‌గాగవాస్కర్
వైఎస్ భలే చర్య
ఆ ముద్దు నష్టం పాతిక లక్షలు!
బెజవాడలో గూండా రాజ్
త్వరలో తెలుగు సినిమా టీవీ
అనంత హత్యాకాండ












Click it and Unblock the Notifications
