వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నోబెల్‌ ఆలోచన

By Staff
|
Google Oneindia TeluguNews

హోంపేజి టాక్‌ ఆఫ్‌ టుడే రాజకీయాలు Sunday, January 23 2004

న్యూఢిల్లీ:తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్‌యస్‌)అగ్రనేత, కేంద్ర మంత్రి కె.చంద్రశేఖర్‌ రావు నక్సల్స్‌తోచర్చల పునరుద్ధరణకు ఢిల్లీలోచక్రం తిప్పుతున్నారు. విందురాజకీయాలతో పరిస్థితినిచక్కదిద్దేందుకు ఆయన పాటుపడుతున్నారు. ఆదివారంనాడు ఆయనకాంగ్రెస్‌ ఆంధ్రప్రదేశ్‌ వ్యవహారాలఇన్‌చార్జి దిగ్విజయ్‌ సింగ్‌తో, ఇతరకాంగ్రెస్‌ నేతలతోసమావేశమయ్యారు.

ముఖ్యమంత్రిడాక్టర్‌ వై.యస్‌. రాజశేఖర్‌ రెడ్డినికట్టడి చేయాలని చంద్రశేఖర్‌ రావుదిగ్విజయ్‌ సింగ్‌ను కోరినట్లు సమాచారం.దిగ్విజయ్‌ సింగ్‌తో కెసి ఆర్‌ దాదాపు గంటసేపు మంతనాలు జరిపారు.ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న పోలీసు,నక్సల్స్‌ హింస గురించి వారుమాట్లాడారని సమాచారం. ముఖ్యమంత్రిడాక్టర్‌ రాజశేఖర్‌ రెడ్డిపై టి ఆర్‌యస్‌నేత ఎ. నరేంద్ర చేసిన తీవ్రవ్యాఖ్యలను ఈ సమావేశంలో కొందరుప్రస్తావించినట్లు తెలిసింది.

ఎన్‌కౌంటర్లనుఆపేయాలని డిమాండ్‌ చేస్తూ రాష్ట్రంలోని టిఆర్‌యస్‌ మంత్రులు ముఖ్యమంత్రికివినతి పత్రం సమర్పించారు. అయితేదానిపై ముఖ్యమంత్రి వైఖరి టిఆర్‌యస్‌మంత్రులకు నచ్చలేదనిచెబుతున్నారు. దీంతో రవాణా శాఖ మంత్రిఎస్‌. సంతోష్‌ రెడ్డి మినహా మిగతాఐదుగురు టి ఆర్‌యస్‌ మంత్రులుఢిల్లీకి చేరుకున్నారు. దీంతో రాజశేఖర్‌రెడ్డిని తిరిగి చర్చలకు ఒప్పించేమంతనాలు పెరిగాయి.

కెసిఆర్‌ను వైయస్‌తో దిగ్విజయ్‌సింగ్‌ ఫోన్‌లోమాట్లాడించినట్లు సమాచారం. అటు నుంచి(నక్సల్స్‌ నుంచి) హింసను మానిపిస్తే ఇటునుంచి (ప్రభుత్వం వైపు నుంచి) హింసతగ్గుతుందని వైయస్‌ కెసి ఆర్‌తోచెప్పినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో తిరిగిచర్చల పునరుద్ధరణకుఅవసరమైన మార్గంలభించవచ్చునని తెలుస్తోంది.సమావేశానంతరం దిగ్విజయ్‌ సింగ్‌గానీ, కెసి ఆర్‌గానీ విలేకరులతోమాట్లాడలేదు.

రాష్ట్రానికిచెందిన టి ఆర్‌యస్‌ మంత్రులుమాత్రం కర్ర విరగకుండా పాముచావకుండా మాట్లాడారు. చర్చలవిషయంలో, ఎన్‌కౌంటర్ల విషయంలోప్రభుత్వ వైఖరి మారకపోతే తమమార్గం తాము చూసుకుంటున్నామనిచెప్పిన టి ఆర్‌యస్‌ మంత్రులు కాస్తమెతకబడినట్లు వారి మాటలను బట్టిఅర్థమవుతోంది.

  • మామూలై పోయిన మామూళ్ళు!
  • తెలంగాణపై మళ్ళీ దోబూచులాట!
  • తెలంగాణ వచ్చుడో, కెసిఆర్‌ చచ్చుడో
  • తారల ప్రభావం నిల్‌!
  • ఉద్వేగ అంశాలు
  • తారల ప్రభావం నిల్‌!
  • ఇప్పటికిప్పుడు చెరిసగం

  • పార్టీ టికెట్ల మార్కెటింగు
  • చిరంజీవి రహస్య ఎజెండా?

  • అస్పష్ట రాజకీయ చిత్రం
  • కెసిఆరే పెద్ద ఫ్యాక్టర్‌
  • పార్టీ టికెట్ల మార్కెటింగు
  • చిరంజీవి రహస్య ఎజెండా?

  • అస్పష్ట రాజకీయ చిత్రం
  • హోంపేజి
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X