వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్రజల దేవుడు

By Staff
|
Google Oneindia TeluguNews

హోంపేజి టాక్‌ ఆఫ్‌ టుడే జనరల్‌ Friday, May 28 2004

N T Ramarao, Chandrababuహైదరాబాద్‌: దివంగత ఎన్టీరామారావు జయంతి అంటే స్మృతి పథంలో అనేక విషయాలు మెదులుతున్నాయి.అప్పుల బాధ భరించలేక బడుగు రైతులు ఆత్మహత్యలుచేసుకుంటున్న సమయంలోనే ఎన్టీఆర్‌ జయంతి రావడంకాకతాళీయమే. అయినా పేదల కోసం తెలుగుదేశం అంటూఆయన రెండు దశాబ్దాల క్రితం స్ధాపించిన తెలుగుదేశం పార్టీఇప్పుడు ఆ ఆశయాలకు దూరమై ప్రజాదరణ కోల్పోయింది.

పేదల పట్ల ఎన్టీఆర్‌కున్న సానుభూతిఅపారమైనది. గ్రామీణ ఆర్ధిక వ్యవస్ధ మీద ఆయన మంచిఅవగాహన ఉండేది. ముఖ్యమంత్రి అయ్యాక కూడా ఆయనఆడంబరాలకు పోలేదు. ప్రజాధనానికి ఆయన నిజమైనట్రస్టీగా ఉండేవారు. అవినీతిపరులైన అధికారుల మీదఆయనకు పట్టరాని కోపం వచ్చేది. చంద్రబాబు నాయుడుప్రభుత్వం ఇందుకు పూర్తి విరుద్ధంగా పనిచేసింది. టిడిపిసంపన్నుల బడాకాంట్రాక్టర్ల పార్టీగా మారిపోయిందన్న ముద్రపడింది.

ఏడాదిగా వైఎస్‌ రాజశేఖరరెడ్డిఎన్టీఆర్‌ శైలిని అనుకరించి విజయం సాధించారంటే ఆశ్చర్యంకలుగుతుంది. తెలుగుదేశం పార్టీని స్ధాపించినప్పుడు చైతన్యరథంలో ఎన్టీఆర్‌ గ్రామాల్లో పర్యటించారు. రోడ్డు పక్కన స్నానంచేసి చెట్ల కింద భోజనం చేశారు. పాదయాత్ర, జైత్ర యాత్రల్లోవైఎస్‌ చేసింది సరిగ్గా ఇదే. ఆనాడు ప్రజల సమక్షంలో ఎల్బీ స్టేడియంలోఎన్టీఆర్‌ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు. ఇప్పుడు వైఎస్‌ అంతేచేశారు. మంచి ఎవర వద్ద ఉన్నా స్వీకరించడంలోతప్పులేదనడానికి ఇది చిన్న ఉదాహరణ.

  • కదిలిన మానవత
  • కులం లెక్కలు ఎంత కరెక్టు?
  • కాంగ్రెస్‌లో ఇది మామూలే!
  • వైఎస్‌కు ముందు నుయ్యి వెనుక గొయ్యి
  • ఎవరు గొప్ప?
  • ఆచితూచి అడుగులు
  • సవాళ్ళు ఎన్నో...
హోంపేజి
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X