• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

చూపులోనేలోపం!

By Staff
|

హైదరాబాద్‌:భారతదేశంరత్నగర్భ, భారతీయులుగర్భదరిద్రులు - ఎప్పుడో చిన్నప్పుడుసాంఘిక శాస్త్రం పాఠ్యపుస్తకంలోచదివాం. ప్రభుత్వాలు మారినా, దశాబ్దాలుదొర్లిపోయినా పరిస్థితిలో మార్పు లేదు.కారణాలు చాలా సంక్లిష్టంగా,అసంఖ్యాకంగా ఉంటాయి. మన కంటే ఎంతోచిన్నవైన దేశాలు కళ్ల ముందేచకచకా అభివృద్ధి చెందడం మనకళ్లతో మనం చూస్తున్నాం. మనంఎందుకు వెనుకబడి ఉన్నామో సులభంగాఅర్థం కాదు.

సంపన్నదేశాలకు,పేద దేశాలకు మధ్య వ్యత్యాసానికికారణమేమిటి? ఆ దేశాల వయస్సా?కానేకాదు. దానికి ఇండియా, ఈజిప్టు వంటిదేశాలనే ఉదాహరణగా చెప్పుకోవచ్చు.రెండు దేశాలూ నాలుగు వేలసంవత్సరాలకు పైగా చరిత్ర కలిగిఉన్నాయి. అయినా పేద దేశాలే. ఇక కెనడా,ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌ వంటి నవీనదేశాలను చూద్దాం. నూటా యాబైసంవత్సరాల కిందటి వరకూ వాటిఉనికికి గుర్తింపే లేదు, కానీ ఇప్పుడుఅభివృద్ధి చెందిన దేశాలు, సంపన్నదేశాలు!

సంపన్నదేశాలకు,పేదదేశాలకు మధ్య వ్యత్యాసానికి ఆదేశాలలో లభించే సహజ వనరులేకారణమా? కానే కాదు. జపాన్‌ చాలాచిన్నదేశం, భూభాగం చాలా పరిమితం.అందులో మళ్లీ ఎనబై శాతం పర్వతాలు,వ్యవసాయానికి, పశుపోషణకు ఏమాత్రం అనువైనది కాదు. కానీ జపాన్‌ప్రపంచంలోని అతి పెద్ద ఆర్థిక వ్యవస్థలోరెండవ స్థానంలో వున్నది.ప్రపంచంలోని దేశదేశాల నుంచిదిగుమతి చేసుకునే ముడి పదార్థాలు,తయారైన వస్తువులను నిండుగానింపుకున్న ఓడలతో అసలు దేశానికిదేశమే నీటిలో తేలియాడే ఓ పెద్దఫ్యాక్టరీలా గోచరిస్తుంది.

పోనీమరో ఉదాహరణ చూద్దాం. స్విట్జర్లాండ్‌లో ఏమాత్రం కోకో పండదు. కానీ ప్రపంచంలోనిఅత్యంత నాణ్యమైన చాకోలెట్స్‌స్విట్జర్లాండ్‌లో తయారవుతాయి.వాళ్లకు వున్న అతి తక్కువసాగుభూమిలోనే పాడి పశువులనుపెంచడమే కాక, ఏడాదిలో నాలుగు నెలల పాటుపంటలు పండిస్తారు. అంతేకాదు,ప్రపంచంలోని ది బెస్ట్‌ క్వాలిటీ పాలఉత్పత్తులు ఆ దేశంలోనేతయారవుతాయి. భూభాగం రీత్యాస్విస్‌ చాలా చిన్న దేశం. భద్రతకు,క్రమశిక్షణకు నిజంగా మారుపేరు.ఎంతటి పేరు ప్రతిష్టలు లేకపోతేప్రపంచ నేతలందరూ డబ్బుదాచుకునే బోషాణంగా స్విస్‌మారగలదు?

సంపన్నదేశాల ఉన్నతస్థాయి అధికారులుపేదదేశాల అధికారులతో సంప్రతింపులుజరిపే క్రమంలో అసాధారణ ప్రతిభావ్యుత్పత్తులను ప్రదర్శించిన దాఖలాలుకనిపించవు. జాతి, వర్ణంమొదలైనవేవీ సంపదలోవ్యత్యాసాలకు కారణాలు కాదు.స్వదేశాలలో సోమరులుగా, పని దొంగలుగాముద్రపడిన వారు సంపన్నయూరప్‌ దేశాలలో గొప్ప ఉత్పాదకశక్తిగా మారుతున్నారు. మరి ఈతేడాకు కారణం ఏమిటి?

ఈతేడాకు కారణం ప్రజల దృక్పథం; విద్యాసంస్కృతుల ఆధారంగా ఏళ్ల తరబడిపేరుకుపోయిన వారి దృష్టి, వైఖరిసంపన్న, అభివృద్ధి చెందిన దేశాలప్రవర్తనను పరిశీలించినప్పుడు వారిఅత్యధిక సంఖ్యాకులు నీతినియమాలను,విలువలను మౌలకసూత్రంగాపాటిస్తారు. సత్ప్రర్తన,బాధ్యతాయుత వైఖరి, చట్టాలు, నియమనిబంధనల పట్ల గౌరవం, ఇతర పౌరులపట్ల గౌరవం, పనిని ప్రేమించే గుణం,పొదుపు, పెట్టుబడి, సమయపాలన వంటిసూత్రాలను క్రమశిక్షణతో పాటిస్తారు.మనం పేదలుగా వున్నామంటేమనకు ప్రకృతి వనరులులేకకాదు. ప్రకృతి మన పట్ల కరుణకలిగి ఉండవపోవడం మరెంతమాత్రం కాదు. మన కర్మ ఇంకెంతమాత్రం కాదు. మనం పేదలుగావుండటానికి కారణం మనకుసరైన దృక్పథం లేకపోవడమే.సంపన్న దేశాల ప్రజల అనునిత్యంపాటించే ఈ సూత్రాలను ఆచరించడం కానీ,బోధించే ఉద్దేశం కానీ మనకులేశమంతైనా కనిపించదు.మనకుగా మనం పాటించకుండా,వాటిని పాటించాల్సిన అసవరం గురించిఉపన్యాసాలు ఇస్తాం. ఇతరులు పాటిస్తే దానివల్ల మనకు ప్రయోజనాన్ని అంచనావేస్తాం. ఇది సరికాదు. వ్యక్తులుగా,సమాజంగా మన ప్రగతి మనచేతులలోనే ఉంది. మన దృక్పథంలోఉంది. మన దృక్పథం గురించి ఒక్కసారినిజాయితీగా ఆలోచించడమే మనపురోగతికి తొలి మెట్టు.

ఈ పేజీని మీ మిత్రులకు పంపండి

చర్చలకుతూట్లు?

త్వరలోదాసరి ఛానల్‌!

మాటలమరాఠీ!

ప్రెస్‌అకాడమీ చైర్మన్‌గా అమర్‌

కంచిపైఇంటిలిజెన్స్‌ కన్ను

బాలకృష్ణపైచార్జిషీట్‌

చిరుకథలోపెను మార్పులు!

సినిమా వాళ్ళెక్కడ? మీడియా ఎక్కడ?

జయేంద్ర విశేషాలు
ఒక టిడిపి నేత విజయ గాధ
రాంగోపాల్‌వర్మ నాచ్‌ వివాదం
హెల్మెట్‌లో దాగిన అవినీతి పురుగు
మన్మోహన్‌హంగ్‌!
రాజేంద్రప్రసాద్‌కు రఘుపతి వెంకయ్య అవార్డు
షిండే సక్సెస్‌ స్టోరీ
ఆది మానవుడికీ హనుమంతుడికీ లింకు!
ఉదయభాను విషాద గాధ
ఉత్తమ కంపెనీల్లో సత్యం
హిందీలో వీరప్పన్‌ సినిమా

హోంపేజి

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more