రాజేంద్రప్రసాద్‌కు రఘుపతి వెంకయ్య అవార్డు
హైదరాబాద్: ప్రతిష్టాత్మక రఘుపతి వెంకయ్య అవార్డు ఈసారి ఒక నాటి మేటి నిర్మాత విబి రాజేంద్రప్రసాద్‌కు దక్కింది. హీరో జగపతి బాబు తండ్రి అయిన రాజేంద్రప్రసాద్ జగపతి ఆర్ట్స్ బ్యానర్‌పై దసరా బుల్లోడు, మంచి మనుషులు, బంగారు బాబు వంటి విజయవంతమైన సినిమాలు నిర్మించారు.
తెలుగు సినిమా స్వర్ణయుగం దాటి మామూలు దశకు చేరుకున్న సమయంలో ముప్పై ఏళ్ళ క్రితం ఆయన తీసిన కుటుంబ కథా చిత్రాలు పరిశ్రమను సుసంపన్నం చేశాయి.
భారతీయ చలన చిత్ర పరిశ్రమకు 1909 లోనే పునాది రాయి వేసిన రఘుపతి వెంక య్యనాయుడు పేరిట రాష్ట్ర ప్రభుత్వం ఒక అవార్డును ఏర్పాటు చేసి తెలుగు చలన చిత్ర పరిశ్రమను సుసంపన్నం చేసిన వ్యక్తులకు ఏటా ప్రదానం చేస్తున్నది.
మచిలీపట్నంలో పుట్టిన రఘుపతి వెంకయ్య నాయుడు తన పద్దెనిమిదో ఏటనే మద్రాసులో ఆర్ట్ సెంటర్ నెలకొల్పారు. మొదట టెక్నీషియన్‌గా తర్వాత నిర్మాతగా ఆయన తెలుగు సినిమా పితామహుడిగా నిలిచారు. మద్రాసులో తొలి సినిమా థియేటర్‌ను నిర్మించింది ఆయనే.
గతంలో ఈ అవార్డు పొందిన తెలుగు సినిమా ప్రముఖులు:
బాపు, అల్లు రామలింగయ్య, కాంతారావు, పి. సుశీల.
రఘుపతి వెంకయ్య అవార్డుకు ఎంపికైన విబి రాజేంద్రప్రసాద్‌ను దట్స్‌తెలుగు డాట్‌కాం అభినందిస్తోంది.
షిండే సక్సెస్ స్టోరీ
ఆదిమానవుడికీ హనుమంతుడికీ లింకు!
ఉదయభాను విషాదగాధ
ఉత్తమ కంపెనీల్లో సత్యం
హిందీలోవీరప్పన్ సినిమా
అడవులవిస్తరణలో రాష్ట్రం టాప్
దసరామూవీస్
రెండోరౌండు సాధ్యమే!
కెసిఆర్‌మీమాంస
లంచగొండితనంసమస్య కాదా?
నానితో ఎన్టీఆర్‌కటీఫ్
ఇకనైనా నిదానం నాగేందర్












Click it and Unblock the Notifications
