వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఇదొకరాజ్యకీయం.

By Staff
|
Google Oneindia TeluguNews
Nedurimalli Rajyalaxmiహైదరాబాద్‌:ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డితర్వాత ఆయన మంత్రివర్గంలోడైనమిక్‌గా పనిచేస్తున్నదెవరు?ప్రాధమిక విద్యాశాఖ మంత్రి నేదురుమల్లి రాజ్యలక్ష్మి. ఎన్నోదశాబ్దాలు గృహిణిగా నాలుగు గోడలకుపరిమితమైన ఆమె ఐదేళ్ళ క్రితమేప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చారు.గత నాలుగు నెలల్లో ఆమె ఎన్నో పాఠశాలలను తనిఖీచేశారు. పిల్లలతోకలిసి మధ్యాహ్న భోజనం రుచి చూశారు.డిఇవోల సమావేశంలో వాళ్ళకు చివాట్లుపెట్టారు. ఎదురుగా ఎంత పెద్దఅధికారులు కూర్చున్నా ఆమె ఎంతోఆత్మవిశ్వాసంతో మాట్లాడుతారు.తనకు న్యాయంగా అన్పించిన పనినిఅధికారుల చెవులు పిండి చేయించడంఆమె ప్రత్యేకత.

భర్తజనార్ధన రెడ్డి ముఖ్యమంత్రిగాఉన్నప్పుడు ఏనాడూ ప్రభుత్వ పాలనలోరాజ్యలక్ష్మి జోక్యం చేసుకోలేదు. అయితేఅన్ని విషయాలను సన్నిహితంగాపరిశీలించడం వల్ల ఆమె పరిపాలనారంగంలోని వాస్తవాలను, రహస్యాలనుతెలుసుకోగలిగారు. ఆ అనుభవమేఆమెను డైనమిక్‌ మంత్రిగా తీర్చి దిద్దిఉంటాయి. తన భర్తకు కేంద్రమంత్రిపదవి ఇవ్వకుండా కంటి తుడుపుగాతనకు రాష్ట్రంలో మంత్రి పదవిఇవ్వడాన్ని మొదట ఆమెవ్యతిరేకించారు.

పదవికి రాజీనామాచేసి భర్త పట్ల విధేయతను చాటుకున్నారు. ఆ తర్వాత జరిగిననాటకీయ పరిణామాల్లో భాగంగా ఆమెరాజీనామాను వెనక్కి తీసుకుని మంత్రిగాయాక్టివ్‌ అయ్యారు. జనార్ధనరెడ్డి,రాజశేఖరరెడ్డి గతంలో కాంగ్రెస్‌రాజకీయాల్లో బద్ధ శత్రువులుగాఉండేవారు. మారిన రాజకీయపరిస్ధితుల్లో ఇద్దరూ రాజీ పడినట్టు కన్పిస్తోంది. మరోవైపు వైఎస్‌నుహైకమాండ్‌ అర్ధంతరంగా మార్చవలసివస్తే ప్రత్యామ్నాయంరాజ్యలక్ష్మేనని విన్పిస్తోంది. రాజకీయాల్లోఏదైనా సాధ్యమే.

అవినీతి వికేంద్రీకరణ
కాంగ్రెస్‌-టిఆర్‌ఎస్‌ కటీఫ్‌?
సోదరహాసం
ఐటీమీద వైఎస్‌ దృష్టి
త్తెకాలపు సత్తెన్న
కప్పల తక్కెడ
మూడోపవర్‌ఫుల్‌ లేడీ
టికెట్‌-క్యాన్సిల్‌-ఒకతెలుగమ్మాయి


బాలకృష్ణ ఇంటిదొంగలేనా?
మంద భాగ్యనగరం
తెలంగాణకు ఎర్ర జెండా
ఛానళ్ళా? చేపల చెరువులా?
టిఆర్‌ఎస్‌లో ముసలం?
వార్‌ బహుముఖ విస్తరణ
ఎమ్యెల్యేకుకోటి!
ప్రత్యేక వ్యూహం!
వైఎస్‌ అసహనం

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X