వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రియల్‌(ఎస్టేట్‌) రిపోర్ట్‌

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుపై ఇంకా అనిశ్చితి పూర్తిగా తొలగకముందే హైదరాబాద్‌ రియల్‌ ఎస్టేట్‌ మార్కెట్‌ మాంద్యం దిశగా పయనిస్తోంది. రియల్‌ ఎస్టేట్‌ మార్కెట్‌ సగానికి సగం పడిపోయిందని కొన్ని పత్రికలు, ఛానళ్ళలో వస్తున్న వార్తలు భయాందోళనలు కలిగిస్తున్నాయి. ఇది సహేతుకం కాదని నగరంలోపలి ప్లాట్ల, అపార్టుమెంట్ల ధరలపై తెలంగాణ ప్రభావం నామమాత్రంగా ఉంటుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

వాయిదాల పద్ధతిపై నగర శివార్లలో ప్లాట్లు అమ్మే రియల్‌ ఎస్టేట్‌ సంస్ధలు మాత్రం మార్కెటింగ్‌లో ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయని కుకట్‌పల్లి చుట్టుపక్కల అనేక వెంచర్లు డెవలప్‌ చేసిన శాలివాహన, శుభోదర బిల్డర్స్‌ అధినేత శ్రీనివాస్‌ దట్స్‌ తెలుగు డాట్‌కాంకు చెప్పారు. ఈ రంగంలో దీర్ఘకాలిక పెట్టుబడులు మందగించవచ్చని, నగరం పరిధిలో తక్షణం ఇల్లు కట్టుకోదగిన క్లియర్‌ టైటిల్‌ ప్లాట్ల ధరలు తగ్గే అవకాశం లేదని ఆయన అన్నారు.మూడు నాలుగేళ్ళ తర్వాత ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడినా జరగబోయే మార్పులు ఈ విధంగా ఉంటాయి.

ఒకటి: హైదరాబాద్‌ ఉమ్మడి రాజధానిగా మరికొన్నేళ్ళు కొనసాగితే రియల్‌ ఎస్టేట్‌ రంగంలో అభివృద్ధికి ఆటంకం ఉండదు.

రెండు: ఒకవేళ కోస్తా ఆంధ్ర, రాయలసీమల రాజధాని విజయవాడగుంటూరు నగరాల మధ్యకు తరలిస్తే దాదాపు యాభై వేల మంది ప్రభుత్వ ఉద్యోగులు హైదరాబాద్‌ వదిలిపెట్టవలసి రావచ్చు. ప్రభుత్వరంగ సంస్ధల సిబ్బంది చలనంలో పెద్ద మార్పు ఉండదు. రెండు లక్షల మంది కోస్తాకు తరలివెళ్ళినంత మాత్రాన ఈ నగరం బహుముఖ అభివృద్ధిలో పెద్ద మార్పు ఉండదు.

కాబట్టి రియల్‌ ఎస్టేట్‌ రంగంలో పెద్ద ఒడిదుడుకులు ఉండవు. ఉమ్మడి మద్రాసు రాష్ట్రం నుండి ఆంధ్ర విడిపోయి రాజధాని కర్నూలుకు మారినప్పుడు మద్రాసు నగరంలో రియల్‌ఎస్టేట్‌ రంగంలో పెద్ద మార్పులు రాలేదు. ఇటీవల చత్తిస్‌గఢ్‌ రాష్ట్రం ఏర్పడి రాయపూర్‌లో కొత్త రాజధాని వచ్చినా పాత రాజధానిఇండోర్‌లో రియల్‌ ఎస్టేట్‌ ధరల్లో మార్పు లేదు.

మూడు: విజయవాడ-గుంటూరు నగరాల మధ్య ఇప్పటికే భూముల ధరలు బాగా పెరిగాయి. చిన్నాచితకారియల్‌ ఎస్టేట్‌ సంస్ధలు ఇప్పటికే తమ కార్యకలాపాలను హైదరాబాద్‌ నుంచి ఈ ప్రాంతానికిమార్చుకున్నాయి.

ఇన్వెస్ట్‌మెంట్‌ నిపుణులు మాత్రం హైదరాబాద్‌లో ఆస్తుల కొనుగోలు విషయంలో ఆచితూచి వ్యవహరించమని తమ క్లయింట్లకు సలహా ఇస్తున్నారు. జూబిలీహిల్స్‌, బంజారాహిల్స్‌, మారేడుపల్లి, కుకట్‌ పల్లి హౌసింగ్‌ బోర్డు, మాదాపూర్‌, కొండాపూర్‌లలో ఇప్పటికేరియల్‌ ఎస్టేట్‌ ధరలు గరిష్ట స్ధాయికి చేరి ఉన్నాయి. ఈ ప్రాంతాల్లో అమ్మే వాళ్ళ కంటే కొనే వాళ్ళ సంఖ్య ఇప్పటికీ ఎక్కువగా ఉంది కాబట్టిడిమాండ్‌-సరఫరా సూత్రాన్ని బట్టి ఇక్కడ ధరలు మరీ దారుణంగా పడిపోయే అవకాశం లేదు. షేర్‌ మార్కెట్‌ లాగానే ధరలు ఒక
స్ధాయికి పడినప్పుడు కొనుక్కోవడం ఉత్తమమని నిపుణులు చెబుతున్నారు.

నాలుగు: లక్జరీ అపార్టుమెంట్లకు డిమాండ్‌ ఏ మాత్రం తగ్గలేదు. బడా వ్యాపారులు, ఉన్నతోద్యోగులు, రాజకీయ నాయకులు, సాఫ్ట్‌వేర్‌రంగంలోని సీనియర్‌ ఉఅద్యోగులు ముప్పై నుంచి నలభై లక్షలు వెచ్చించి అయినా స్టార్‌ హోటళ్ళలా ఉండే ఫ్లాట్లలో ఉండడానికిఇష్టపడుతున్నారు. ఇక్కడ తెలంగాణ ఫ్యాక్టర్‌ ఏ మాత్రం పనిచేయదు.ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడినా ఇప్పటికే కాస్మొపాలిటన్‌ లక్షణాలు వచ్చిన హైదరాబాద్‌ నగరంలోని పాష్‌ ఏరియాల్లో రియల్‌ఎస్టేట్‌ విలువ పెద్దగా తగ్గే అవకాశం లేదు.

ఇటీవలికథనాలు

  • వెలుగు వెనుక చీకటి
  • ఈ సినిమా పేరు ఎత్తుకు పైఎత్తు
  • చుట్టాలు-చట్టాలు
  • ఈయన సినిమా పోలీసు కాదు
  • ప్రత్యూష కేసు మరో మలుపు
  • ప్రజల దేవుడు
  • విశ్లేషణ..సగటు ఓటరు విజయం
  • రేపటి సంగతి
  • ఎక్కడైనా హీరోలు కానీ...
  • బాబుచేయనిది, కృష్ణ చేసింది...
  • వ్యతిరేక గాలి
  • ఎక్కడైనా హీరోలు కానీ...
  • బాబుచేయనిది, కృష్ణ చేసింది...
  • చంద్రబాబుతురుపుముక్క
  • ఎన్టీఆర్‌ గుర్తున్నాడా?
  • సైకిల్‌కుఅసమ్మతి బ్రేక్‌లు
  • చిరంజీవిరహస్య ఎజెండా?

  • అస్పష్ట రాజకీయ చిత్రం
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X