• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

వెలుగు వెనుక చీకటి

By Staff
|
హోంపేజి టాక్‌ ఆఫ్‌ టుడే జనరల్‌ Friday, June 11 2004

హైదరాబాద్‌: చంద్రబాబు నాయుడుహయాంలో కుదుర్చుకున్న జివికె, స్ప్రెక్టం, ల్యాంకో, బిఎస్‌ఇఎస్‌ వంటివిద్యుత్‌ ఉత్పత్తి సంస్ధలతో కుదుర్చుకున్న పవర్‌ పర్చేజ్‌అగ్రిమెంట్లపై ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి తీసుకున్ననిర్ణయం సాహసోపేతమైనది.

ప్రభుత్వ విద్యుత్‌ ఉత్పత్తి సంస్ధరేట్ల కంటే అధికంగా ఈ కంపెనీలకు ప్రభుత్వం ఇప్పటివరకుడబ్బు చెల్లిస్తూ వస్తోంది. రాష్ట్రంలో ప్రైవేటు రంగంలో నాణ్యమైనవిద్యుత్‌ ఉత్పత్తి కావడానికి ప్రోత్సాహకంగా అధిక రేట్లకుపవర్‌ పర్చేజ్‌ అగ్రిమెంట్లు కదుర్చుకున్నట్టు అప్పటి ప్రభుత్వంసర్దిచెప్పుకుంది.

రైతులకు ఉచిత విద్యుత్‌, మరికొన్నిసబ్సిడీలు ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది కాబట్టి మీరు ప్రభుత్వానికిసరఫరా చేస్తున్న విద్యుత్‌కు అధికరేట్లు చెల్లించడం సాధ్యంకాదంటూ కొత్త ప్రభుత్వం ఇప్పటికే ఈ నాలుగు సంస్ధలకు నోటీసులుజారీ చేసింది. జివికెకు ఏటా నూట రెండు కోట్లు, స్ప్రెక్టం నుంచి తొంభై ఏడుకోట్లు అధికంగా చెల్లిస్తున్నట్టు ముఖ్యమంత్రి స్వయంగాచెప్పారు.

పన్నెండేళ్ళ క్రితం రాష్ట్రంలో విద్యుత్‌రంగ సంస్కరణలు అమలులోకి వచ్చినప్పటి నుంచి పెద్ద వ్యాపారసంస్ధలు ఈ రంగంలో భారీ పెట్టుబడులు పెట్టి రాజకీయ పలుకుబడిద్వారా తమకు అత్యంత లాభదాయకంగా ఉండేలా పవర్‌పర్చేజ్‌ అగ్రిమెంట్లు కుదుర్చుకున్నాయి.

ఆ సమయంలోఅధికారంలో ఉన్న కోట్ల విజయభాస్కరరెడ్డిని, ఆ తర్వాతవచ్చిన ఎన్టీఆర్‌ను, ఆ తర్వాత చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని ఈవిదుత్‌ సంస్ధలు ఇంప్రెస్‌ చేయగలిగాయి. ఈ విద్యుత్‌ లాబీ ఏపార్టీ అధికారంలో ఉన్నా తమ లాభాలు తాము సాధించుకోగలసమర్ధత కలిగి ఉన్నాయి.

ఈ సంస్ధలతో లోపాయికారీ లావాదేవీలుజరుగకుండా వైఎస్‌ రాజశేఖరరెడ్డి పారదర్శకంగావ్యవహరించారు. తమ లాభాలకు భారీగా గండికొట్టే ఈనిర్ణయంపై న్యాయస్ధానాల్లో పోరాటం చేయడానికి ఈ సంస్ధలుసిద్ధమవుతున్నాయి. మానవీయత లేని సంస్కరణల వల్ల బడాపారిశ్రామికవేత్తలు ఎలా లాభపడతారో చిన్న రైతులు,సామాన్యులు ఎలా నష్టపోతారో గత పదేళ్ళుగా ఆంధ్రప్రదేశ్‌చక్కటి ఉదాహరణ.

ఈ విద్యుత్‌ సంస్ధల న్యాయపోరాటంలో తుదిఫలితం వచ్చేవరకు చాలా కాలం పట్టవచ్చు. అప్పటివరకురైతుల ఉచిత విద్యుత్‌కు ఏటా నాలుగువందల కోట్ల రూపాయలుభరించడం ప్రభుత్వానికి కష్టం కావచ్చు. ఇటీవల కేంద్రంవిద్యుత్‌ చట్టానికి సవరణ చేసి ఓపెన్‌ యాక్సెస్‌ విధానంప్రవేశపెట్టింది.

దీనివల్ల పారిశ్రామిక సంస్ధల నుంచి ప్రభుత్వానికిరావలసిన విద్యుత్‌ ఆదాయానికి భారీగా గండి పడే అవకాశంఉంది. సంస్కరణలను అన్ని రంగాల్లో కాక కొన్ని రంగాలకేపరిమితం చేయడం వల్ల కొన్ని పలుకుబడి గల వర్గాలు మాత్రమేలాభపడుతున్నాయి. సంస్కరణలు అమలు జరుగుతున్నరంగాల్లోకి నిధులను మళ్ళించి బడా సంస్ధలు లబ్ది పొందడం దీనికి మంచిఉదాహరణ. రాష్ట్రంలో ఏఏ రంగాల్లో సంస్కరణలు అమలు జరుగుతున్నాయో,వీటివల్ల ఏఏ వర్గాలు లాభపడుతున్నాయో, ఎవరునష్టపోతున్నారో కొత్త ప్రభుత్వం సమీక్షించవలసిన అవసరంఉంది.

ఇటీవలికథనాలు

 • ఈ సినిమా పేరు ఎత్తుకు పైఎత్తు
 • చుట్టాలు-చట్టాలు
 • ఈయన సినిమా పోలీసు కాదు
 • ప్రత్యూష కేసు మరో మలుపు
 • ప్రజల దేవుడు
 • విశ్లేషణ..సగటు ఓటరు విజయం
 • రేపటి సంగతి
 • ఎక్కడైనా హీరోలు కానీ...
 • బాబుచేయనిది, కృష్ణ చేసింది...
 • వ్యతిరేక గాలి
 • ఎక్కడైనా హీరోలు కానీ...
 • బాబుచేయనిది, కృష్ణ చేసింది...
 • చంద్రబాబుతురుపుముక్క
 • ఎన్టీఆర్‌ గుర్తున్నాడా?
 • సైకిల్‌కుఅసమ్మతి బ్రేక్‌లు
 • చిరంజీవిరహస్య ఎజెండా?
 • అస్పష్ట రాజకీయ చిత్రం
 • హోంపేజి

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more