టిడిపి సంఘీంకారం
హోంపేజి
టాక్ ఆఫ్ టుడే
జనరల్ Friday, July 09 2004
హైదరాబాద్: సంఘీ గ్రూపు సంస్ధల్లోబాలకార్మికుల అంశాన్ని బాగా ఎక్స్‌పోజ్ చేయాలని తెలుగుదేశం పార్టీనిర్ణయించింది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఎంతో కాలంగడవనందున ప్రభుత్వ విధానాల మీద కాకుండా ఇటువంటిసెన్సిటివ్ ఇష్యూలను లేవనెత్తాలన్నది తెలుగుదేశం పార్టీ వ్యూహం.సంఘీ గ్రూపు సంస్ధలపై రాష్ట్ర కార్మికశాఖ ఎటువంటి చర్యలుతీసుకోకపోవడం దారుణమన్న అభిప్రాయాన్ని ప్రజల్లోకలుగజేయడానికి తెలుగుదేశం ప్రయత్నిస్తోంది. గిరీష్ సంఘీకాంగ్రెస్ ఎంపీ కావడం వల్లనే ఆయన మీద ఎటువంటి చర్యలుతీసుకోవడం లేదని, చట్టాల మీద రాష్ట్ర ప్రభుత్వానికి గౌరవంలేకుండా పోయిందని ప్రచారం చేయాలన్నది తెలుగుదేశం వ్యూహం.
అంతర్జాతీయ సంస్ధలకు తెలుగుదేశంపార్టీ తరఫున ఈ విషయంలో ఫిర్యాదు చేస్తే ఏదోరాజకీయమనుకుంటారు కాబట్టి మెగసేసే అవార్డుగ్రహీత శాంతాసిన్హా ఆధ్వర్యంలోని మామిడిపూడి వెంకటరంగయ్యఫౌండేషన్ ద్వారా ఐఎల్‌ఓ, ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్‌కు ఫిర్యాదుచేయించాలని టిడిపి నాయకులు ప్రయత్నిస్తున్నారు. సంఘీ సంస్ధల్లోబాలకార్మికులకు సంబంధించిన సాక్ష్యాధారాలను టిడిపిసేకరించిపెట్టుకుంది.
Recent Stories
సచిన్‌టెండూల్కర్ - ఇంటర్వ్యూ హోంపేజి












Click it and Unblock the Notifications
