వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎవరు గొప్ప?

By Staff
|
Google Oneindia TeluguNews

హోంపేజి టాక్‌ ఆఫ్‌ టుడే కాంగ్రెస్‌ Tuesday, May 18 2004

;?

ప్రధానమంత్రి పదవి చేపట్టడానికిసోనియాగాంధీ సుముఖంగా లేకపోవడం ఆమె విదేశీయతనుఎగతాళి చేస్తున్న వారికి మరోమాట లేకుండా చేసింది. తనకుటుంబంలో రెండు రక్త తర్పణాలను చూసిన సోనియాగాంధీమొదటి నుంచి రాజకీయాల మీద అనాసక్తిగా ఉండేవారు.ఒకానొకప్పుడు రాజీవ్‌ గాంధీ రాజకీయాల్లోకిరావడానికే ఇష్టపడని సోనియా ఆ తర్వాత ఎన్నో విషాదకర,నాటకీయ పరిణామాలకు ప్రత్యక్షసాక్షిగా ఉన్నారు. రాజీవ్‌గాంధీ మరణానంతరం అయిదేళ్ళు పరిపాలించిన పివినరసింహారావు ప్రభుత్వంలో ఆమె ఏనాడూ జోక్యం చేసుకోలేదు.

ఆ తర్వాత బిజెపి సంకీర్ణ ప్రభుత్వం వచ్చాక దిక్కులేనికాంగ్రెస్‌ పార్టీకి నాయకత్వం వహించడానికి ఇష్టంలేక పోయినాఆమె అంగీకరించారు. ఆ సమయంలో ఆమెకు హిందీ సరిగారాదు.నాయనమ్మ ఇందిర, తండ్రి రాజీవ్‌ గాంధీల రక్తసిక్త దేహాలనుచిన్న వయసులోనే చూసిన ప్రియాంక, రాహుల్‌ లకు మంచి తల్లిగాఆమె వ్యవహరిస్తూ వచ్చారు. సోనియాగాంధీ రాజకీయ నాలెడ్జిచాలా తక్కువ. ఆమె ఎవరో రాసిచ్చిన ఉపన్యాసాల రీడర్‌మాత్రమేనని, లీడర్‌ కాదని ఆమె విమర్శకులువిరుచుకుపడ్డారు.

సోనియాగాంధీ విదేశీ వనితే. కానీ రామమందిరాన్ని ఒకసారి, అభివృద్ధి మంత్రాన్ని మరోసారి ముందుకుతెచ్చిన అసలు సిసలైన భారతీయ భారతీయ జనతా పార్టీని జనంపూర్తిగా ఎందుకు అంగీకరించలేకపోయారు? సోనియాగాంధీనాయకత్వంలోని కాంగ్రెస్‌ పార్టీ వైపు ఎక్కువ మంది భారతీయులుఎందుకు మొగ్గుచూపారు? భారత్‌ వెలిగిపోతోందని ఒక నినాదం,అంతా బాగుందని మరో నినాదం పాశ్చాత్య దేశాల నుంచి దిగుమతిచేసుకున్న కమలనాధులు సోనియాగాంధీవిదేశీయతను ప్రధాన ఎన్నికల అంశంగా చేసుకున్నారు. అయినాఫలితం బిజెపికి వ్యతిరేకంగా ఎందుకు వచ్చింది?

సోనియాగాంధీ ప్రధానమంత్రికాకపోవడం వల్ల ఈ దేశానికి వచ్చే నష్టం ఏమీలేదు. ఆమాటకొస్తే ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌ అచ్చివచ్చిన ఫ్యాక్టర్‌ ప్రియాంక,రాహుల్‌ గాంధీలే. ఇది అంతర్లీనంగా ఉన్న భారతీయ ఆత్మ.ఆరునెలల క్రితం మూడు రాష్ట్రాల్లో కాంగ్రెస్‌ పరాజయంపాలైనప్పుడు అందుకు ప్రధాన బాధ్యత తనదేననిసోనియాగాంధీ అంగీకరించారు. తన లోపాలను బహిరంగంగాఅంగీకరించిన ఇటువంటి వ్యక్తులను అభినందించడంలో తప్పులేదు.దేశీయత, విదేశీయతను, అధికారాన్ని, అనధికారాన్నిపక్కనబెట్టి వ్యక్తిత్వానికి మార్కులు వేయడం తప్పుకాదు.

సోనియాగాంధీ విదేశీయత కారణంగాప్రధానమంత్రి పదవిని చేపట్టరాదని ప్రవాస భారతీయుల్లోఅధిక శాతం అభిప్రాయపడుతున్నారు. వారి భావనలను మేంగౌరవిస్తాం. మన్మోహన్‌ సింగ్‌ ను ప్రధానమంత్రి అభ్యర్ధిగా ప్రకటించినసోనియాగాంధీ ఔదార్యాన్ని కూడా మెచ్చుకోవలసి ఉంది.రాజకీయాల్లో నైతిక విలువలు ఉండాలని చెప్పే వాజ్‌పేయిఇప్పుడెందుకు మౌనంగా ఉన్నారు?

ఈ సందర్భంగా తెలుగుదేశంతో సహాఎన్డీయే భాగస్వామ్య పక్షాల అధికార దాహాన్ని ప్రస్తావించకపోవడంసముచితం కాదు. కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వాన్ని, రాష్ట్రంలోతెలుగుదేశం ప్రభుత్వాన్ని కొన్ని స్వార్ధశక్తులు నడిపించాయి.రెండు ప్రభుత్వాలు పల్లెలకు దూరమయ్యాయి. ప్రపంచబ్యాంకుఅభివృద్ధి మోడల్స్‌ వల్ల తెలివితేటలున్న బ్రోకర్లు,కాంట్రాక్టర్లు విపరీతమైన సంపదనుపోగుచేసుకున్నారు. స్వాతంత్య్ర సంగ్రామాన్నిగుర్తుచేస్తున్న బిజెపి నాయకులు మహాత్మాగాంధీలా ఎందుకునిరాడంబరంగా ఉండలేకపోయారు?

కాంగ్రెస్‌ లో ఉన్న వ్యక్తి పూజలే ఎన్డీయేలోఉన్నాయి. కాంగ్రెస్‌లొ ఉన్న అవలక్షణాలన్నీ ఎన్డీయేలో ఉన్నాయి.

కొన్ని ప్రశ్నలు మనం వేసుకోవాలి.

వాజ్‌ పేయిని మించిన ప్రధాని అభ్యర్ధి లేరనిప్రచారం చేసుకున్న ఎన్డీయే విశ్వసనీయత ఎంత?

ఏనాడూ ప్రధానమంత్రి అభ్యర్ధిగాప్రకటించుకోని సోనియాగాంధీ నాయకత్వంలోని కాంగ్రెస్‌ పార్టీవైపు జనం ఎందుకు మొగ్గుచూపారు?

నాలుగుకాళ్ళ వృద్ధులు ప్రధానమంత్రిపదవికి అర్రులు చాస్తున్న సమయంలో కాంగ్రెస్‌ విజయానికికారకులైన ప్రియాంక, రాహుల్‌ గాంధీలు ప్రధానమంత్రిపదవితీసుకోవద్దని తల్లిని కోరడం నిజంగా హృదయాలనుకదిలించే అంశమే.

ఎవరో ఒకరిని ప్రధానమంత్రి పదవిలో కూర్చోబెట్టిసోనియాగాంధీ పార్టీ అధ్యక్షురాలిగా ఉండిపోతే,అవసరమైనప్పుడు పార్టీ ప్రచార బాధ్యతలను ఆ పిల్లలిద్దరూతీసుకుంటే దేశ ప్రజలకు ఎటువంటి సంకేతాలు అందుతాయి? వాళ్ళత్యాగాల ముందు వెంకయ్యనాయుళ్ళు, మహాజనులునిలబడగలరా? ఈ పరిణామాలు దేశాన్ని దీర్ఘకాలంలో ఎటువైపునడిపించనున్నాయి?

ప్రజాస్వామ్యంలో మెజారిటీ ప్రజలఅభిప్రాయానికే విలువ ఉంటుంది. సోనియాగాంధీ భయపడిప్రధానమంత్రి పదవిని వదులుకున్నారా? తన కుటుంబంశ్రేయస్సుకోసం ఆ పదవిని త్యాగం చేశారా? హోంపేజి

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X