• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

టిడిపి,బిజెపిలు దూరం

By Staff
|
హోంపేజి టాక్‌ ఆఫ్‌ టుడే తెలుగుదేశం Wednesday, May 19 2004

హైదరాబాద్‌: రాష్ట్రంలో తెలుగుదేశం-బిజెపిలహనీమూన్‌కు తెరపడే అవకాశాలు కన్పిస్తున్నాయి. తప్పనిసరిపరిస్ధితుల్లో ఒక ఇంట్లో ఉండే భార్యాభర్తల పరిస్ధితి ఇప్పుడు వారిది.బిజెపితో పొత్తు వల్ల తాము నష్టపోయామని టిడిపి నాయకులు అనుకుంటున్నారు.తెలుగుదేశం ప్రజావ్యతిరేక విధానాల కారణంగా తాముఘోరపరాజయం పాలయ్యామని రాష్ట్ర బిజెపి నాయకులువాపోతున్నారు. టిడిపితో తమ సంబంధాలు పొత్తు అనే అంశానికేపరిమితమని వచ్చే ఐదేళ్ళలో ఎవరి కార్యక్రమాలు వారుచేసుకుంటామని బిజెపి హిమాయత్‌ నగర్‌ ఎమ్మెల్ల్యే, బిజెపిజాతీయ అధ్యక్షుడు వెంకయ్యనాయుడి ప్రియ శిష్యుడుమంచిరెడ్డి కిషన్‌ రెడ్డి బుధవారం విలేకరుల సమావేశంలోచల్లగా చెప్పారు.

వెంకయ్యనాయుడు వంటి పెద్దనాయకులతో చర్చించకుండా కిషన్‌రెడ్డి ఇలా మాట్లాడుతారనిఎవరూ అనుకోరు. బిజెపి-తెలుగుదేశం పార్టీల మధ్యకుదిరిన అవగాహనకు ఒక సైద్ధాంతిక సారూప్యత కానీనైతిక కట్టుబాటు కాని లేవు. రాష్ట్రంలో ఓడిపోయిన చంద్రబాబునాయుడు కేంద్రంలో ఎన్డీయే అత్తెసరు మెజార్టీతో అయినాఅధికారంలోకి వస్తుందని రెండురోజులు ఎదురు చూశారు.పదమూడో తేదీన పార్లమెంటు ఎన్నికల ఫలితాలు వచ్చాక ఆయనమరింత కుంగిపోయారు. కేంద్రంలో కూడా కాంగ్రెస్‌అధికారంలోకి వస్తోంది కాబట్టి తనమీద కక్ష సాధింపు చర్యలుఉంటాయని ఆయన భయం. చంద్రబాబు నాయుడు అభివృద్ధి పేరుతోవిశృంఖలంగా చేసిన దుబారా గురించి సిబిఐ దర్యాప్తు జరిపితే ఎన్నోకుంభకోణాలు బయటపడతాయి. కరువుప్రాంతాల్లో ఉపాధికిఉద్దేశించిన పనికి ఆహారం బియ్యం ఆంధ్రప్రదేశ్‌లో బాగాదుర్వినియోగమయ్యాయి. చంద్రబాబు నాయుడి దిగిపోయినమూడు రోజుల తర్వాత కూడా విదేశాలకు తరలిపోతున్నరెండుకోట్ల రూపాయల విలువైన దొంగ బియ్యం దొరకడం దీనికి తాజాఉదాహరణ.

ఎన్డీయే హయాంలో చంద్రబాబు నాయుడికిఢిల్లీలో అల్లుడి మర్యాదలు లభించాయి. తనకు ఏమి కావాలోఆయన అడిగిందే తడవుగా మంజూరయ్యేవి. సీట్ల సర్దుబాటులోకూడా ఆయన మాటే వేదం అయింది. పైన వెంకయ్య నాయుడు,ఇక్కడ చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో బిజెపిని ఎదగనివ్వడంలేద న్న ఆవేదన రాష్ట్ర బిజెపి శ్రేణుల్లో ఎన్నాళ్ళుగానో ఉంది. ఈనేపధ్యంలో రాష్ట్ర బిజెపి తనదారి తాను చూసుకుంటుంది.

ఇటీవల జరిగిన ఎన్నికల్లో రాష్ట్రంలోటిడిపి-బిజెపిల పరిస్ధితి జోగీ జోగీ రాసుకుంటే బూడిదరాలినచందంగా ఉంది. ఈదశలో ఒకరిని ఒకరువిమర్శించుకోవడం వల్ల ఒనగూరే ప్రయోజనం ఉఅభయులకూఉండదు.

ఇటీవలికథనాలు

  • చంద్రబాబుతురుపుముక్క
  • ఎన్టీఆర్‌ గుర్తున్నాడా?
  • సైకిల్‌కుఅసమ్మతి బ్రేక్‌లు
  • చిరంజీవిరహస్య ఎజెండా?
  • అస్పష్ట రాజకీయ చిత్రం
  • హోంపేజి

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X