వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

M ཅ

By Staff
|
Google Oneindia TeluguNews

హోంపేజి టాక్‌ ఆఫ్‌ టుడే జనరల్‌ Friday, July 16 2004 సైకిల్‌దిగిన బాబూఖాన్‌

హైదరాబాద్‌:మాజీ మంత్రి బషీరుద్దీన్‌ బాబూఖాన్‌ఎట్టకేలకు సైకిల్‌ దిగారు. ఆయనశుక్రవారంనాడు తెలుగుదేశంపార్టీకి రాజీనామా చేశారు. భారతీయజనతా పార్టీ (బిజెపి) పట్ల తెలుగుదేశంవైఖరి మారనందుకే తాను రాజీనామాచేసినట్లు ఆయన విలేకరులకుచెప్పారు. బిజెపితో పొత్తుతెలుగుదేశం పార్టీ పొత్తుపెట్టుకోవడంతో ఆయన పందొమ్మిదివందల తొంబై ఎనిమిదిలో మంత్రిపదవికి రాజీనామా చేశారు. అయితేఆయన అప్పటి నుంచి తెలుగుదేశంలోకొనసాగుతూనే వున్నారు.

ఆతర్వాతి జరిగిన ఏ ఎన్నికల్లోనూ ఆయనపోటీ చేయలేదు. ఆయననియోజకవర్గం నిజామాబాద్‌ జిల్లాలోనికామారెడ్డిని తెలుగుదేశం పార్టీఇతరులకు అప్పగించింది. తానుకాంగ్రెస్‌లో చేరడం లేదని బాబూఖాన్‌విలేకరులతో చెప్పారు. ఫోరం ఫర్‌ఈక్విటీ అండ్‌ జస్టిస్‌ పేరుతో ముస్లింలహక్కుల కోసం పని చేస్తానని ఆయనప్రకటించారు.

తనకుమారుడు జగన్మోహన్‌ రెడ్డిరాజకీయ ప్రవేశంపై ఇంకా నిర్ణయంతీసుకోలేదని ముఖ్యమంత్రి డాక్టర్‌వై.యస్‌. రాజశేఖర్‌ రెడ్డిచెబుతున్నారు. తన సోదరుడు,కడప లోక్‌సభ సభ్యుడు వై.యస్‌.వివేకానంద రెడ్డి రాజకీయాల నుంచితప్పుకొని అమెరికా వెళ్లిపోవాలనేఆలోచన చేస్తున్న మాట నిజమేననిఆయన అంటున్నారు. వివేకానంద రెడ్డికూతురు ఆరోగ్యం బాగా లేదని,అందువల్ల అమెరికాలో వుంటున్న ఆమెవద్దకు వివేకానంద రెడ్డివెళ్లాలనుకుంటున్నారని ఆయనవిలేకరులతో చెప్పారు.

ఈవిషయాలపై కొద్ది రోజుల క్రితం ఒకతెలుగుదిన పత్రిక వార్తాకథనంప్రచురించింది. ఇదే విషయంపై మరోతెలుగుదిన పత్రిక తాజాగావార్తకథనం ప్రచురించింది. ఈనేపథ్యంలో రాజశేఖర్‌ రెడ్డి ఈవివరణలు ఇవ్వాల్సి వచ్చిందనిఅంటున్నారు.

వై.యస్‌.వివేకానంద రెడ్డి తెలుగుదేశంపార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన రాజకీయఉద్ధండుడు డాక్టర్‌ ఎం.వి.మైసురారెడ్డిపై కడప నుంచిలోక్‌సభకు ఎన్నికయ్యారు.వివేకానంద రెడ్డి లోక్‌సభ సీటుకురాజీనామా చేసి అమెరికా వెళ్లిపోతారని, ఆస్థానం నుంచి వై.యస్‌. రాజశేఖర్‌రెడ్డి కుమారుడు లోక్‌సభకు పోటీచేస్తారని వార్తలు వెలువడ్డాయి.

Recent Stories
సమైక్యనినాదం ఊపు
తిరగబడినరాత
బాబుపైబాలయ్య అసంతృప్తి!
సచిన్‌టెండూల్కర్‌ - ఇంటర్వ్యూ హోంపేజి

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X