• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

తల్లీకొడుకులఅపూర్వ గాధ

By Staff
|

హోంపేజి టాక్‌ ఆఫ్‌ టుడే;/SPAN> జనరల్‌ Friday, December 17, 2004

హైదరాబాద్‌:వెంకటేష్‌ కథ ముగిసింది.వెంకటేష్‌ తల్లి సుజాత రెండోఅంకానికి తెర లేపుతోంది.మృత్యువు కౌగిలిలో కూడా అపారమైనఔదార్యాన్ని, సాహసాన్ని ప్రదర్శించినవెంకటేష్‌ను అభినందించకుండాఉండలేం. అంతకన్నా మించి కన్నపేగుబంధం కళ్ల ముందే కాటికివెళ్లున్నా కంటినీటిని కడుపులోనేదాచుకుని కొడుకు ఆఖరి కోరిక తీర్చడానికిన్యాయస్థానం తలుపులు తట్టినసుజాత ఒక కొత్త అధ్యాయానికి తెరలేపింది.

యమునిమహిషపు లోహగంటలు మోగుతుంటేతన అవయవాలు ఇహలోకంలోని ఎవరికైనాఉపయోగపడాలనే వెంకటేష్‌తపనకు కార్యరూపం ఇవ్వడానికి ఆతల్లి చేసిన ప్రయత్నం అంతా ఇంతాకాదు. రాత్రిపూట కళ్ల ముందేవాడిపోతున్న తన పుత్రుడికిసేవలు చేస్తూ పగటి పూట న్యాయస్థానాలచుట్టూ తిరుగుతూ ఆ తల్లి ఒక పోరాటపటిమను, అనూహ్యధైర్యస్థయిర్యాలను ప్రదర్శించింది.

తనకొడుకు అవయవాలను దానం చేయడానికిఅనుమతించాలని ఆమె హైకోర్టు మెట్లు కూడాఎక్కింది. చట్టాల సంకెళ్లను ఛేదించేప్రయత్నం చేసింది. దయార్ద్రహృదయానికి, చట్టం సంకెళ్లకు పోటీపెట్టింది. చట్టం నిబంధనలు వెంకటేష్‌ఆఖరి కోర్కెను తీర్చలేకపోయాయి.బ్రెయిన్‌ డెత్‌ కాని శరీరంఅవయవాల మార్పిడికి చట్టంఅంగీకరించందని హైకోర్టు తీర్పు చెప్పింది.ఆమె సుప్రీం కోర్టు తలుపులు తడుదామనిఅనుకుంటుండగానే వెంకటేష్‌ ప్రాణాలుఅనంతవాయువుల్లో కలిశాయి.శుక్రవారం తెల్లవారు జామునఅతను కన్ను మూశాడు. పుట్టెడుదుఃఖాన్ని కడుపులో పెట్టుకొని సుజాత కొడుకుమృతదేహానికి కొరివి పెట్టింది. తల్లి కొరివిపెట్టడాన్ని సంప్రదాయం అంగీకరించదు. ఇదీకొడుకూ కోరికనే. అవయవాల దానంవిషయంలో కొడుకు కోర్కెను తీర్చలేనిసుజాత సంప్రదాయాల సంకెళ్లనుమాత్రం ఛేదించగలగింది.

రేపోమాపో అన్నట్లున్న కొడుకు కంటికిరెప్పలా చూసుకోవడానికి జీవితాన్ని త్యాగంచేసింది. కొడుకు ఏది అడిగినా లేదని చెప్పనితల్లి అవయవాల దానం విషయంలోమాత్రం ఏమీ చేయలేకపోయింది. కొడుకువిషయంలో తగాదాలు పడి భర్త ఆమెనువదిలేసి చక్కా వెళ్లిపోయాడు. కొడుకుకోసం ఆమె భర్తను వదులుకుంది.ఐదేళ్ల ప్రాయంలో వెంకటేష్‌ వ్యాధిబయటపడింది. వేలల్లో ఒకరికి వచ్చేఅరుదైన కండరాల క్షీణతవెంకటేష్‌ను కబళించింది. కొడుకునుచంకనేసుకుని ఆమె ఆస్పత్రుల చుట్టూతిరిగింది. అంతేకాదు, కొడుకుకుచదరంగం ఇష్టమని తెలిసి ఒకకోచ్‌ను ఏర్పాటు చేసింది.

మోహన్‌ఫౌండేషన్‌ వైద్యం ఖర్చులుభరించడానికి ముందుకు వచ్చింది. గ్లోబల్‌ఆస్పత్రికి ఉచిత చికిత్స అందించడానికిసిద్ధపడింది. గ్లోబల్‌ ఆస్పత్రిలోవెంటిలేటర్‌ మీదున్న కొడుకునుచూసుకుంటూనే ఆమె న్యాయపోరాటంచేసింది.

కొడుకుఅంతిమ కోర్కెను తీర్చలేకపోయినా ఆమెభారతదేశంలో ఒక కొత్త అధ్యాయానికితెర లేపింది. బతికుండగా అవయవాలుదానం చేయడం అనేదిచర్చనీయాంశంగా మారింది. మెర్సీకిల్లింగ్‌కు అవకాశం కల్పించాలని,అందుకు అనుగుణంగా చట్టం ఉండాలని సిపిఐనల్లగొండ లోక్‌సభ సభ్యుడుసురవరం సుధాకర్‌ రెడ్డిలోక్‌సభలో ప్రస్తావించారు.

ఇదిలావుంటే, కొడుకు దేహందహించుకుపోతుంటే చూస్తూ కంటితడిని గుండెల్లో అదిమి పడుతూ ఆమెమరో పోరాటానికి సిద్ధమవుతోంది.తన కొడుకు పేరు మీద ఒక సంస్థనుఏర్పాటు చేస్తానని సుజాత చెబుతున్నారు.మే తొమ్మిది వెంకటేష్‌ పుట్టిన రోజు. ఆరోజున ఆమె ఆ సంస్థను ప్రారంభిస్తారు.మాజీ ముఖ్యమంత్రి నారాచంద్రబాబునాయుడు వెంకటేష్‌కుఇష్టమైన రాజకీయ నేత. తానుస్థాపించబోయే సంస్థను చంద్రబాబుచేతులతో ప్రారంభోత్సవంచేయించాలనేది ఆ తల్లి కోరిక.

తల్లికారణంగా వెంకటేష్‌ మరణించిజీవిస్తున్నాడు. ఒక మానవీయ కథకుతెర లేపి, చట్టాలను ప్రశ్నించిన సుజాతఇప్పుడు ఒక వెంకటేష్‌ తల్లే కాదు,ఎంతో మంది మాతృమూర్తి కాబోతోంది.

శత్రువుశత్రువు మిత్రుడవుతాడా?

ఆచెట్టు వేళ్ళు పుట్టిన గడ్డలోనే

అన్నీ మంచిశకునములే

చిన్నస్వామిస్వర్ణాభిషేకం

త్వరలోదాసరి ఛానల్‌!

మాటలమరాఠీ!

ప్రెస్‌అకాడమీ చైర్మన్‌గా అమర్‌

కంచిపైఇంటిలిజెన్స్‌ కన్ను

బాలకృష్ణపైచార్జిషీట్‌

చిరుకథలోపెను మార్పులు!

సినిమా వాళ్ళెక్కడ? మీడియా ఎక్కడ?

జయేంద్ర విశేషాలు
ఒక టిడిపి నేత విజయ గాధ
రాంగోపాల్‌వర్మ నాచ్‌ వివాదం
హెల్మెట్‌లో దాగిన అవినీతి పురుగు
మన్మోహన్‌హంగ్‌!
రాజేంద్రప్రసాద్‌కు రఘుపతి వెంకయ్య అవార్డు
షిండే సక్సెస్‌ స్టోరీ
ఆది మానవుడికీ హనుమంతుడికీ లింకు!
ఉదయభాను విషాద గాధ
ఉత్తమ కంపెనీల్లో సత్యం
హిందీలో వీరప్పన్‌ సినిమా

హోంపేజి

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more