వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సోదరహాసం

By Staff
|
Google Oneindia TeluguNews

హోంపేజి టాక్‌ ఆఫ్‌ టుడే కాంగ్రెస్‌ Thursday, September 02 2004

Y S Vivekananda Reddyహైదరాబాద్‌: ముఖ్యమంత్రి వైఎస్‌రాజశేఖరరెడ్డి తమ్ముడు, కడప లోక్‌సభ సభ్యుడు వైఎస్‌వివేకానందరెడ్డి రాజీనామాను కాంగ్రెస్‌ అధ్యక్షురాలుసోనియాగాంధీ తిరస్కరించడం రాజకీయ వర్గాల్లో సంచలనం కలిగించింది.రాజశేఖరరెడ్డికి ఇది రాజకీయంగా, కుటుంబపరంగా పెద్ద దెబ్బ. తనకొడుకు జగన్మోహనరెడ్డిని ఎంపీగా గెలిపించుకునేందుకువీలుగా వివేకానందరెడ్డితో వైఎస్‌ బలవంతంగా రాజీనామాచేయించినట్టు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.

ఎంపీ పదవికి రాజీనామా చేయడంవివేకానందరెడ్డికి ఇష్టం లేదు. అయితేజగన్మోహనరెడ్డికి అవకాశం కల్పించేందుకుకుటుంబసభ్యులు ఆయన మీద తీవ్ర వత్తిడి తీసుకువచ్చారు. నిన్నబెంగుళూరులో జగన్మోహనరెడ్డి ఇంట్లో కూడా ఈ విషయంలోహైడ్రామా జరిగింది. రాజశేఖరరెడ్డి ఆగమేఘాల మీదబెంగుళూరు వెళ్ళి కుటుంబసభ్యులతో మంతనాలు జరిపారు. ఆయనతమ్ముడు వివేకానందరెడ్డితో ఫోన్లో మాట్లాడారు.

ఆసమయంలో కడపలో ఉన్న వివేకానంద ఆ తర్వాత చెన్నైవెళ్ళి అక్కడి నుంచి ఢిల్లీ వెళ్ళారు. అన్న మాటనుశిరసావహించదలుచుకుంటే వివేకానంద ఢిల్లీవెళ్ళనవసరం లేదు. మొన్న రాజీనామా లేఖను లోక్‌సభస్పీకరుకు సమర్పించి తిరిగి వచ్చిన వివేకానందకు సోనియాగాంధీ నుంచి పిలుపు రావడంతో ఢిల్లీ వెళ్ళారు.

ఆయన ఢిల్లీలోసోనియాను కలిసే విషయం ఆఖరు నిముషం వరకు అత్యంత గోప్యంగాఉంచారు. వివేకానందరెడ్డి ఇష్టపూర్వకంగా రాజీనామాచేయలేదని తెలుసుకున్న సోనియాగాంధీ ఆయనను పిలిపించిఅదే విషయం అడిగినట్టు తెలిసింది.

వత్తిడి మేరకే రాజీనామాచేసినట్టు ఆయన సోనియా ఎదుట అంగీకరించడంతో ఆమెరాజీనామాను ఉపసంహరించుకోవలసిందిగా ఆయననుకోరారు. వారసుడిగా తన కుమారుడినిరాజకీయాల్లోకి తేవడానికి తమ్ముడి త్యాగాన్ని ఆశించిన వైఎస్‌ ఇలా కథ అడ్డం తిరిగింది.

ఐటీమీద వైఎస్‌ దృష్టి
త్తెకాలపు సత్తెన్న
కప్పల తక్కెడ
మూడోపవర్‌ఫుల్‌ లేడీ
టికెట్‌-క్యాన్సిల్‌-ఒకతెలుగమ్మాయి


బాలకృష్ణ ఇంటిదొంగలేనా?
మంద భాగ్యనగరం
తెలంగాణకు ఎర్ర జెండా
ఛానళ్ళా? చేపల చెరువులా?
టిఆర్‌ఎస్‌లో ముసలం?
వార్‌ బహుముఖ విస్తరణ
ఎమ్యెల్యేకుకోటి!
ప్రత్యేక వ్యూహం!
వైఎస్‌ అసహనం హోంపేజి

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X