పొంచిఉన్నహింస
హోంపేజి
టాక్ ఆఫ్ టుడే
రాజకీయాలు Wednesday, April 28 2004
హైదరాబాద్:ఎన్నికల ఫలితాలు రావడానికి ఇంకా రెండువారాలవ్యవధి ఉండడంతో పరిస్ధితి తుఫానుకుముందు ప్రశాంతతలాగా ఉంది. ఫలితాలువెలువడిన తర్వాత పెద్ద ఎత్తునహింసాకాండ తలెత్తుందని ఇంటిలిజెన్స్‌అధికారుల దృష్టికి వచ్చింది. ఒక అగ్రశ్రేణిదినపత్రిక నగరంలోని తమ కార్యాలయాలన్నిటికిభద్రత కావాలని నగరపోలీసు కమిషనర్‌నుకోరింది. బుధవారం ఉదయానికల్లా ఆ పత్రికాకార్యాలయాల్లో పోలీసు సిబ్బందిని మోహరించారు.
ఎలాగైనాతానే ముఖ్యమంత్రిని అవుతానని చంద్రబాబునాయుడు చెప్పడం, ఈలోపు ప్రభుత్వ కార్యకలాపాలుస్తంభించిపోకుండా రాష్ట్రంలో గవర్నరుపరిపాలన విధించాలని ఆయన కోరడం అనేకఅనుమానాలకు తావిస్తోంది. ఎగ్జిట్‌పోల్స్ ప్రకారంకాంగ్రెసు పార్టీకిసంపూర్ణమెజారిటీవచ్చినా ఘర్షణలు జరిగే అవకాశం ఉంది. గతంలోచెన్నారెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వంఏర్పడిన కొత్తలో పాతబస్తీలో కలహాలు చెలరేగాయి.
రాయలసీమకు చెందిన కిరాయి మనుషులేవాటికి కారణమని తర్వాత తెలిసింది.కాంగ్రెస్‌లోని ఒక వర్గం నాయకుడే ఆ కలహాలనుసృష్టించారని బయటపడింది.ఇప్పుడుకూడా ముఖ్యమంత్రి పదవి ఆశిస్తున్న కొందరునాయకులకు ఆశాభంగం కలిగితే అటువంటిపరిస్ధితులు పునరావృతం కావచ్చన్నఅభిప్రాయం ఉంది. కాంగ్రెస్‌వంటి పార్టీల్లో చీలిక తీసుకురావడం సులభం.తమకు నచ్చని వ్యక్తి ముఖ్యమంత్రి అయితేకట్టకట్టుకుని పార్టీ నుంచి బయటకు రావడానికిఆ పార్టీ ఎమ్మెల్యేలు వెనుకాడరు.
కాంగ్రెస్‌పార్టీ సంస్కృతి అది. ఎటూ ఓడిపోతున్నామనితెలిసి తెలుగుదేశం పార్టీ కోస్తా, రాయలసీమల్లోపెద్దగా డబ్బు ఖర్చు చేయలేదని, కాంగ్రెస్‌నునిలువునా చీల్చడానికి ఆ డబ్బును రిజర్వులో పెట్టారనికాంగ్రె స్ నాయకులే అంటున్నారు.
పిసిసిఅధ్యక్షుడు డి.శ్రీనివాస్ మీద వైఎస్, ఎం.సత్యనారాయణరావు,దాసరి నారాయణరావు, వి.హనుమంతరావుగుర్రుగా ఉన్నారు. శ్రీనివాస్ మీద అంచలంచెలుగాఅధిష్టానవర్గానికి ఫిర్యాదు చేయడానికిఈ గ్రూపులు సిద్ధమవుతున్నాయి. కాంగ్రెస్‌గ్రూపు తగాదాల వల్ల కూడా శాంతిభద్రతలకువిఘాతం కలగవచ్చని అనుమానిస్తున్నారు.
- వ్యతిరేక గాలి
- విజయశాంతిపికప్
- ఆఖరి పోరాటం
- కులమే సామాజిక సత్యం
- తారల ప్రభావం నిల్!
- కెసిఆరే పెద్ద ఫ్యాక్టర్
- పార్టీ టికెట్ల మార్కెటింగు
- చిరంజీవిరహస్య ఎజెండా?
- అస్పష్ట రాజకీయ చిత్రం హోంపేజి












Click it and Unblock the Notifications
