మొగిలిచర్లలోవార్‌

హోంపేజి టాక్‌ ఆఫ్‌ టుడే జనరల్‌ Tuesday, July 27 2004

హైదరాబాద్‌:పదిహేనేళ్లతర్వాత పీపుల్స్‌వార్‌ రాష్ట్రంలోబహిరంగ వేదిక మీదికి వస్తోంది.బుధవారం వరంగల్‌జిల్లామొగిలిచెర్లలో పీపుల్స్‌వార్‌ అమరవీరుల సంస్మరణ సభ పేర భారీబహిరంగసభను నిర్వహిస్తోంది.మర్రి చెన్నారెడ్డి ప్రభుత్వహయాంలతో హైదరాబాద్‌,వరంగల్‌లలో పీపుల్స్‌వార్‌బహిరంగ సభలు పెద్దయెత్తునజరిగాయి. ఆ తర్వాత పీపుల్స్‌వార్‌బహిరంగ వేదిక మీదికి రావడం ఇదేతొలిసారి.

యన్‌.జనార్దన్‌ రెడ్డి ముఖ్యమంత్రిగావున్నప్పుడు కాంగ్రెస్‌ ప్రభుత్వంపీపుల్స్‌వార్‌పై నిషేధం విధించింది. ఆతర్వాత అధికారంలోకి వచ్చిన యన్టీరామారావు ప్రభుత్వం కొద్ది కాలంపీపుల్స్‌వార్‌పై నిషేధం ఎత్తివేసింది.చంద్రబాబునాయుడు అధికారంలోకివచ్చిన తర్వాత పీపుల్స్‌వార్‌పై,దాని అనుబంధ సంఘాలపై నిషేధంవిధించారు. పీపుల్స్‌వార్‌నక్సలైట్లపై చంద్రబాబు ప్రభుత్వంకఠినంగా వ్యవహరించింది.

చంద్రబాబునాయుడుప్రభుత్వం కూడా నక్సలైట్లతో చర్చలప్రక్రియను ప్రారంభించినప్పటికీఫలితం దక్కలేదు. చర్చలప్రక్రియకు ఎన్‌కౌంటర్లతోమధ్యలోనే బ్రేక్‌ పడింది. కాంగ్రెస్‌ప్రభుత్వం అధికారంలోకి రాగానేనక్సలైట్లతో చర్చల ప్రక్రియనుప్రారంభించింది. ఇందులో భాగంగాపీపుల్స్‌వార్‌పై నిషేధాన్ని కాంగ్రెస్‌ప్రభుత్వం పొడిగించలేదు. ఈ స్థితిలోపీపుల్స్‌వార్‌ మొగిలిచర్లలోబహిరంగ సభను తలపెట్టింది. ఈసభకు పెద్ద యెత్తున జనాన్నిసమీకరిస్తున్నారు.

బుధవారంజరిగే పీపుల్స్‌వార్‌ అమరవీరులసంస్మరణ సభలో విప్లవరచయితల సంఘం (విరసం)కార్యవర్గ సభ్యుడువరవరరావు, ప్రజావాగ్గేయకారుడు గద్దర్‌, గోరుమాధవరావు పాల్గొంటారనిసమాచారం. బుధవారంమొగిలిచర్లలో మధ్యాహ్నం రెండుగంటలకు అమర వీరుల స్థూపంఆవిష్కరణ జరుగుతుంది. అనంతరంయనమాముల మార్కెట్‌ యార్డులోబహిరంగ సభ జరుగుతుంది.

వరంగల్‌నగరానికి అతి సమీపంలో ఉన్నమొగిలిచెర్ల ప్రముఖ నక్సలైట్‌నాయకుడు రామకృష్ణ అలియాస్‌పోలెం సుదర్శన్‌ రెడ్డి స్వగ్రామం.ఆయన ఎన్‌కౌంటర్‌లో మరణించారు. ఈగ్రామం నుంచి దాదాపు పదిహేను మందిపీపుల్స్‌వార్‌లో చేరి అజ్ఞాతవాసంగడుపుతున్నారు. ఈ రీత్యామొగిలిచర్లను పీపుల్స్‌వార్‌బహిరంగ సభకు వేదికగాచేసుకుంది.

Recent Stories
సిద్దిపేట సీను
ఆంధ్రపైజయ చిందులు
మణికుమారికిసవతిపోరు!
కొడుకు రాజకీయంపై వైయస్‌
సైకిల్‌దిగిన బాబూఖాన్‌
సమైక్యనినాదం ఊపు
తిరగబడినరాత
బాబుపైబాలయ్య అసంతృప్తి!
సచిన్‌టెండూల్కర్‌ - ఇంటర్వ్యూ హోంపేజి

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+